ఐఎన్‌ఎస్‌ రంజిత్‌లో అగ్నిప్రమాదం

ఐఎన్‌ఎస్‌ రంజిత్‌లో అగ్నిప్రమాదం - Sakshi

సాక్షి, విశాఖపట్నం: ఇండియన్‌ నేవల్‌ షిప్‌ (ఐఎన్‌ఎస్‌) రంజిత్‌ డి–53లో మంగళవారం అగ్ని ప్రమాదం సంభవించింది. నేవల్‌ డాక్‌యార్డ్‌లో జరిగిన ఈ ప్రమాదంలో పలువురు నేవీ సిబ్బందికి స్వల్ప గాయాలయ్యాయి. వారిని వెంటనే నేవీ ఆస్పత్రి ఐఎన్‌ఎస్‌ కల్యాణికి తరలించారు. అయితే ప్రమాద ఘటనపై పూర్తి వివరాలు  వెల్లడి కాలేదు. నేవల్‌ వర్గాల నుంచి ఎటువంటి సమాచారం లేదు.

 

కొమ్మునార షిప్‌ బిల్డింగ్‌ ప్లాంట్‌లో రాజ్‌పుత్‌ క్లాస్‌ డిస్ట్రాయర్‌గా రూపుదిద్దుకుని 1983 నవంబర్‌ 24న జల ప్రవేశం చేసిన రంజిత్‌ నేటికీ విశాఖ కేంద్రంగా తూర్పు నావికాదళంలో సేవలందిస్తోంది. 3950 టన్నుల స్టాండర్డ్‌ బరువుతో 147 మీటర్ల పొడవు, 15.8 మీటర్ల బీమ్, 5మీటర్ల డ్రాప్‌్టతో తయారైన ఈ షిప్‌లో 4 గ్యాస్‌ ఇంజన్లు ఉంటాయి. 35 నాట్స్‌(గంటకు 65 కిలోమీటర్లు) వేగంతో 35 మంది ఆఫీసర్లతోపాటు మొత్తం 320 మందిని తీసుకుపోగలదు. యాంటీ సర్ఫేస్, యాంటీ సబ్‌మెరైన్‌గా ఈ నౌకను వినియోగిస్తున్నారు. మిసైల్స్, గన్స్‌తోపాటు టార్పెడో ట్యూబ్‌ లాంచర్, ఒక చేతక్‌ హెలికాప్టర్‌ ఉంటాయి. ఇన్ని ప్రత్యేకతలతో 33 మూడేళ్లుగా సేవలందిస్తున్న యుద్ధ నౌకలో అగ్ని ప్రమాదం సంభవించడమంటే సాధారణ విషయం కాదు. దీనిపై నేవీ అధికారులు లోతుగా దర్యాప్తు చేస్తున్నారు. 
Read latest District News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top