-
సెల్యూట్ రంజిత్
విశాఖ సిటీ: శత్రువుకు ఆ నౌక వైపు చూడాలం టేనే వెన్నులో వణుకు పుట్టేది. దాయాదులు దాడిని ముందుగానే పసిగట్టి.. వారు ప్రణా ళిక అమలు పరచకముందే.. సముద్రంలోనే అంతమొందించే అత్యాధునిక వ్యవస్థను సొంతం చేసుకొని 36 ఏళ్ల పాటు భారత నౌకాదళానికి సుదీర్ఘ సేవలందించిన ఐఎన్ఎస్ రంజిత్ ఈ నెల 6న విధులకు స్వస్తి పలకనుంది. మిసైల్ డిస్ట్రాయర్గా అంతర్జాతీయ విన్యాసాల్లో సత్తా చాటిన రంజిత్‌కు భారత నౌకాదళం ఘనంగా వీడ్కోలు పలికేందుకు సిద్ధమవుతోంది. సదా రణే జయతే నినాదంతో.. భారత నౌకాదళ చరిత్రలో సరికొత్త అధ్యాయాన్ని లిఖించిన కాషిన్ క్లాస్ మిసైల్ డిస్ట్రాయర్ నౌకల్లో ఐఎన్ఎస్ రంజిత్ మూడో నౌకగా ఖ్యాతినార్జించింది. రష్యాలో 1979లో లౌక్లీ పేరుతో రూపుదిద్దుకుంది. 1983 సెప్టెంబర్ 15న భారత నౌకాదళంలో చేరిన రంజిత్.. 36 ఏళ్ల పాటు సుదీర్ఘ సేవలందించింది. శత్రుదుర్భేధ్యమైన ఈ నౌకకు తొలి కెప్టెన్‌గా విష్ణుభగవత్ వ్యవహరించారు. తూర్పు, పశ్చిమ నౌకాదళాల్లో ఇది సేవలందించింది. సదా రణే జయతే(రణరంగంలో ఎల్లప్పుడూ విజయమే) నినాదంతో సాగర జలాల్లో దూసుకుపోయిన రంజిత్ యుద్ధ నౌకంటే శత్రు సైన్యానికి దడ పుట్టేదని నౌకాదళ వర్గాలు చెబుతున్నాయి. 3,950 టన్నుల బరువుతో 147 మీటర్ల పొడువు, 15.8 మీటర్ల బీమ్, 5 మీటర్ల డ్రాఫ్ట్‌తో తయారైన ఈ నౌకలో 4 గ్యాస్ ఇంజిన్లున్నాయి. గంటకు 35 నాటికల్ మైళ్లు(65 కిలోమీటర్లు) వేగంతో దూసుకుపోయేది. 35 మంది అధికారులు, 320 మంది సిబ్బందిని తీసుకెళ్లగల సామర్థ్యం రంజిత్ సొంతం. యాంటీ సర్ఫేస్, యాంటీ సబ్మెరైన్గా రంజిత్ని వినియోగించారు. మిసైల్స్, గన్స్‌తో పాటు టార్పెడో ట్యూబ్ లాంచర్, చేతక్ హెలికాఫ్టర్లు నౌకలో ఉండేవి. శక్తివంతమైన బ్రహ్మాస్త్రాల్లాంటి క్షిపణులు ప్రయోగించడంలో రంజిత్ ప్రముఖ పాత్ర పోషించింది. అత్యంత శక్తిమంతమైన క్షిపణులతో పాటు అత్యాధునిక ఆయుధాల్ని మోసుకెళ్లేది. శత్రు లక్ష్యాల్ని, వారి నుంచి ఎదురవ్వబోయే దాడుల్ని ముందుగానే గుర్తించి సిబ్బందికి సిగ్నల్ ఇచ్చే వ్యవస్థ రంజిత్ సొంతం. అంతర్జాతీయ విన్యాసాల్లో సత్తా.. క్షిపణులతో దాడి చేస్తూ.. శత్రువుల గుండెల్లో నిద్రపోయిన రంజిత్ దేశ విదేశాల్లో జరిగిన విన్యాసాల్లో సత్తా చాటింది. 1991–92లో యూఎస్ నేవీ ఆధ్వర్యంలో నిర్వహించిన పాసెక్స్, మలబార్ విన్యాసాలు, 2003లో ఇండియా–రష్యా(ఇంద్ర) విన్యాసాలు, 2003 నవంబర్‌లో సారెక్స్ విన్యాసాలు, 2007లో పసిఫిక్ తీరంలో జరిగిన అంతర్జాతీయ విన్యాసాల్లో పాల్గొని భారత కీర్తి పతాకాన్ని రెపరెపలాడించింది. 2004 సునామీ సమయంలోనూ, 2014 హుద్‌హుద్ తుపాను సమయంలో విపత్తు నిర్వహణలో ఐఎన్ఎస్ రంజిత్ కీలక పాత్ర పోషించింది. డాక్‌యార్డులో డీకమిషన్ మూడున్నర దశాబ్దాలకు పైగా సుదీర్ఘ సేవలందించిన ఐఎన్ఎస్ రంజిత్ ఈ నెల 6న సేవల నుంచి రిటైర్ కాబోతోంది. ఈ డీకమిషన్ కార్యక్రమంలో ఐఎన్ఎస్ రంజిత్‌లో సేవలు అందించిన కెప్టెన్లు, అధికారులకు ఆత్మీయ సత్కారం నిర్వహించనున్నారు. -
ఐఎన్ఎస్ రంజిత్‌లో అగ్నిప్రమాదం
సాక్షి, విశాఖపట్నం: ఇండియన్ నేవల్ షిప్ (ఐఎన్ఎస్) రంజిత్ డి–53లో మంగళవారం అగ్ని ప్రమాదం సంభవించింది. నేవల్ డాక్‌యార్డ్‌లో జరిగిన ఈ ప్రమాదంలో పలువురు నేవీ సిబ్బందికి స్వల్ప గాయాలయ్యాయి. వారిని వెంటనే నేవీ ఆస్పత్రి ఐఎన్ఎస్ కల్యాణికి తరలించారు. అయితే ప్రమాద ఘటనపై పూర్తి వివరాలు వెల్లడి కాలేదు. నేవల్ వర్గాల నుంచి ఎటువంటి సమాచారం లేదు. కొమ్మునార షిప్ బిల్డింగ్ ప్లాంట్‌లో రాజ్‌పుత్ క్లాస్ డిస్ట్రాయర్గా రూపుదిద్దుకుని 1983 నవంబర్ 24న జల ప్రవేశం చేసిన రంజిత్ నేటికీ విశాఖ కేంద్రంగా తూర్పు నావికాదళంలో సేవలందిస్తోంది. 3950 టన్నుల స్టాండర్డ్ బరువుతో 147 మీటర్ల పొడవు, 15.8 మీటర్ల బీమ్, 5మీటర్ల డ్రాప్‌్టతో తయారైన ఈ షిప్లో 4 గ్యాస్ ఇంజన్లు ఉంటాయి. 35 నాట్స్(గంటకు 65 కిలోమీటర్లు) వేగంతో 35 మంది ఆఫీసర్లతోపాటు మొత్తం 320 మందిని తీసుకుపోగలదు. యాంటీ సర్ఫేస్, యాంటీ సబ్మెరైన్గా ఈ నౌకను వినియోగిస్తున్నారు. మిసైల్స్, గన్స్‌తోపాటు టార్పెడో ట్యూబ్ లాంచర్, ఒక చేతక్ హెలికాప్టర్ ఉంటాయి. ఇన్ని ప్రత్యేకతలతో 33 మూడేళ్లుగా సేవలందిస్తున్న యుద్ధ నౌకలో అగ్ని ప్రమాదం సంభవించడమంటే సాధారణ విషయం కాదు. దీనిపై నేవీ అధికారులు లోతుగా దర్యాప్తు చేస్తున్నారు.
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్‌లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్‌తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
AP: డీజీపీని బదిలీ చేసిన ఎన్నికల కమిషన్
ఆ పూలు స్టార్స్‌లా అందంగా ఉన్నా..వాసన మాత్రం భరించలేం!
IPL 2024: సీఎస్కేకు బిగ్ షాక్.. స్వదేశానికి వెళ్లిపోయిన స్టార్ బౌలర్
ఉద్యోగం వెతుక్కునే క్రమంలో ఇలా చెయ్యొద్దు!: గూగుల్ ఉద్యోగి
ఇజ్రాయెల్ ప్రధాని కీలక నిర్ణయం.. అల్ జజీరా ఛానెల్‌పై నిషేధం
‘ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్‌ను ఆపాలని భూకజ్జాదారులు యత్నిస్తున్నారు’
'ఆ ఒక్కటి అడక్కు' రెండో రోజు వసూళ్లు.. మొత్తం ఎంతంటే?
రాణించిన జడేజా.. పంజాబ్ కింగ్స్ టార్గెట్ ఎంతంటే?
బీజేపీ ‘ప్యూన్’ విమర్శలు.. కిశోరి లాల్ శర్మ కౌంటర్
అలాంటి కార్లను ఇష్టపడే వ్యక్తుల్లో శాడిజం ఎక్కువగా ఉంటుందట!
తప్పక చదవండి
- మీనాక్షి ఇంత క్యూట్ గా ఉందేంటి? సీరత్ ఏకంగా అలా!
- AP: డీజీపీని బదిలీ చేసిన ఎన్నికల కమిషన్
- 'ఆ ఒక్కటి అడక్కు' రెండో రోజు వసూళ్లు.. మొత్తం ఎంతంటే?
- చీర కామెంట్స్... సీఎం రేవంత్‌కు కేటీఆర్ స్ట్రాంగ్ కౌంటర్
- IPL 2024: పంజాబ్‌తో మ్యాచ్.. సీఎస్కే జట్టులో ఓ మార్పు
- ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్: టీడీపీపై బీజేపీ నేత కీలక వ్యాఖ్యలు
- IPL 2024 GT VS RCB: విరాట్ ఖాతాలో భారీ రికార్డులు.. తొలి భారత క్రికెటర్‌గా..!
- వెన్నులో వణుకు పుట్టించే 'ది కంజూరింగ్'..!
- బ్రెజిల్ భారీ వర్షాల్లో 57కు మృతుల సంఖ్య.. 67 మంది గల్లంతు!
- ఓటీటీలోకి వచ్చేస్తున్న తెలుగు హిట్ మూవీ.. స్ట్రీమింగ్ అప్పుడేనా?
Advertisement