Sakshi: Telugu Breaking News | Latest Telugu News | తెలుగు వార్తలు | Online Telugu News Today
Sakshi News home page

Top Stories

Advertisement

ప్రధాన వార్తలు

Modi 3.0: Nda Govt To Hold Its First Cabinet Meeting Today
ఎవరికి ఏ శాఖ?.. కొనసాగుతున్నమోదీ 3.0 తొలి కేబినెట్ భేటీ

సాక్షి, ఢిల్లీ : మరికొద్ది సేపట్లో కేంద్ర కేబినెట్‌ సమావేశం జరగనుంది. అయితే ఈ మంత్రి వర్గం సమావేశం లోపే నేతలకు శాఖలు కేటాయించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. మంత్రులకు ఎవరికి ఏయే శాఖ కేటాయిస్తారని అంశంపై ఉత్కంఠ కొనసాగుతుండగా..సీనియర్ మంత్రులను అదే శాఖల్లో కొనసాగించే అవకాశం ఉన్నట్లు సమాచారం. ఆదివారం కొలువుదీరిన మోదీ 3.0 కేబినెట్‌లో ఆరుగురు మాజీ ముఖ్యమంత్రులు చేరారు. వారికి కీలక శాఖలు అప్పగించే యోచనలో బీజేపీ అధిష్టానం ఉన్నట్లు జాతీయ మీడియా కథనాలు చెబుతున్నాయి. హోం,రక్షణ శాఖ, ఆర్ధిక శాఖ వంటి కీలక పదవులు బీజేపీ నేతలకేననే ప్రచారమూ కొనసాగుతుంది.ప్రాధన్యాత కలిగిన శాఖపై కిషన్‌ రెడ్డి పట్టుమరోవైపు తెలుగు రాష్ట్రాలకు ఏ శాఖలు దక్కుతున్నాయనే అంశంపై ఆసక్తికర చర్చ మొదలైంది. ఏపీ, తెలంగాణలకు రెండు కేబినెట్‌, మూడు సహాయమంత్రి పదవులు దక్కనున్నాయి. అయితే తెలంగాణ నుంచి గతంలో కిషన్ రెడ్డికి ప్రధాని మోదీ టూరిజం శాఖ అప్పగించాగా.. ఈ సారి మాత్రం ఈసారి ప్రాధాన్యత కలిగిన శాఖను కిషన్‌ రెడ్డి ఆశిస్తున్నారు. పార్లమెంట్ సమావేశాలపైనా ఇక క్యాబినెట్ సమావేశంలో పార్లమెంటు సమావేశాల తేదీని ఖరారు చేసే అవకాశం ఉంది. ఈనెల 15 నుంచి 22 వరకు పార్లమెంట్ సమావేశాలను నడిపేందుకు ప్రణాళిక సిద్ధం కానుందని, 15 నుంచి మూడు రోజులపాటు ఎంపీల ప్రమాణస్వీకారం, ఆ తర్వాత స్పీకర్ ఎన్నిక ఉండనుంది. అనంతరం ఈనెల 22న పార్లమెంటు ఉభయ సభలను ఉద్దేశించి రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ప్రసంగించనున్నారు.

After NCP Shiv Sena upset over Minister of State posts
మోదీ కేబినెట్.. సహాయ మంత్రి పదవిపై శివ‌సేన అసంతృప్తి

ప్రధానమంత్రిగా నరేంద్ర మోదీ వరుసగా మూడోసారి పదవీ బాధ్యతలు స్వీకరించారు. ఆదివారం రాత్రి న్యూఢిల్లీలోని రాష్ట్రపతి భవన్‌లో జరిగిన కార్యక్రమంలో మోదీ సహా 72 మందితో కేంద్ర క్యాబినెట్‌ కూడా ఏర్పాటైంది. వీరిలో 30 మంది కేబినెట్‌ మంత్రులు,36 మంది సహాయ మంత్రులు, 5 మంది స్వంతంత్ర్య మంత్రులు దక్కాయి.ఎన్డీయే మిత్రపక్షాలైన టీడీపీ, జేడీయూ, జేడీఎస్​, శివసేన, ఎన్సీపీ, ఎల్జీపీ, ఆరెల్డీ పార్టీల నుంచి నేతలకు పలు మంత్రి పదవులు వరించాయి.అయితే మోదీ కేబినెట్​ కూర్పుపై మిత్రపక్షాలు పెదవి విరుస్తున్నాయి. ఎన్డీయే ప్రభుత్వంలో స్వతంత్ర బాధ్యతలు కలిగిన సహాయ మంత్రిత్వ పదవి దక్కడంపై ఏక్‌నాథ్ షిండే నేతృత్వంలోని శివసేన సోమవారం అసంతృప్తిని వ్యక్తం చేసింది. శివసేన పార్టీ కేబినెట్ మంత్రి ఆశిస్తున్నట్లు పేర్కొంది. ఈ మేరకు ఎన్డీయే ఇత‌ర భాగ‌స్వామ్య ప‌క్షాల‌కు ద‌క్కిన ప‌ద‌వుల‌ను ప్ర‌స్తావిస్తూ శివసేన చీప్ విప్ శ్రీరంగ్ బ‌ర్నే మాట్లాడుతూ.. ఐదుగురు ఎంపీలు క‌లిగిన చిరాగ్ పాశ్వాన్‌, ఒక ఎంపీ క‌లిగిన జిత‌న్ రాం మాంఝీ, ఇద్ద‌రు ఎంపీలు క‌లిగిన జేడీఎస్‌ల‌కు ఒక్కో క్యాబినెట్ మంత్రి ప‌ద‌విని కేటాయించార‌ని.. త‌మ‌ను మాత్రం ఒకే ఒక్క స‌హాయ మంత్రి ప‌ద‌వికి ప‌రిమితం చేశార‌ని వాపోయారు.ఏడు ఎంపీలు ఉన్నప్పటికీ ఒక్క పదవి మాత్రమే ఎందుకు లభించిందని ప్రశ్నించారు. తమకు కేబినెట్​ మంత్రిత్వ శాఖ వచ్చి ఉండాల్సిందని తెలిపారు. కాగా శివసేన నుంచి ప్రతాప్​ రావ్​ జాదవ్​కు స్వతంత్ర హోదా కలిగిన కేంద్ర పదవి దక్కింది. మరోవైపు ఎన్సీపీ అజిత్ ప‌వార్ వ‌ర్గం సైతం త‌మ‌కు స‌హాయ మంత్రి ప‌ద‌వితో స‌రిపెట్ట‌డంపై అసంతృప్తి వ్య‌క్తం చేసిన విషయం తెలిసిందే. తమకు కూడా కేబినెట్ మంత్రి కావాలని డిమాండ్ చేసింది. ఆదివారం ప్రమాణస్వీకారానికి ముందు తమ అసంతృప్తిని వ్యక్తం చేస్తూ.. రాష్ట్ర హోదా మంత్రి ప్రతిపాదనను తిరస్కరించింది.

Manipur CM convoy attacked, one security person injured
మణిపూర్​ సీఎం కాన్వాయ్​పై దాడి

ఇంఫాల్​: మణిపూర్ ముఖ్యమంత్రి ఎన్ బీరెన్ సింగ్ కాన్వాయ్‌పై సోమవారం అనుమానిత మిలిటెంట్లు దాడి చేశారు. కాంగ్‌పోక్పి జిల్లాలో జాతీయ రహదారి 37 వద్ద సోమవారం ఉదయం సాయుధ ఈ ఆకస్మికంగా దాడి జరిగింది. ఈ ఘటనలో సీఎం భద్రతా సిబ్బందికి చెందిన ఓ వ్యక్తి గాయపడ్డాడు.కాగా జూన్​ 6న జిరిబామ్‌కు చెందిన ఓ రైతు హత్యతో అక్కడ ఆందోళనలు తీవ్ర రూపం దాల్చాయి. గత కొన్ని రోజులుగా ఉద్రిక్తంగా మారిన ఇక్కడ పరిస్థితులను సీఎం బీరెన్​ సింగ్​ మంగళవారం సందర్శించేందుకు ప్లాన్​ చేశారు. ఈ క్రమంలోనే నేడు సీఎం కాన్వాయ్ ఇంఫాల్ ​నుంచి జిరిబ‌మ్ జిల్లాకు వెళ్తున్న స‌మ‌యంలో దాడి జ‌రిగింది. సెక్యూరిటీ ద‌ళాల‌పై మిలిటెంట్లు ప‌లుమార్లు ఫైరింగ్ జ‌రిపారు. అయితే ఆ దాడిని భ‌ద్ర‌తా బ‌ల‌గాలు తిప్పికొట్టాయి.అయితే దాడి సమయంలో సీఎం సంఘటన ప్రాంతంలో లేనట్లు తెలుస్తోంది. ఆయన ప్రస్తుతం ఢిల్లీలో ఉన్నట్లు సమాచారం. ఇదిలా ఉండగా జిరిబామ్‌లో వ్యక్తి హత్యతో కొందరు అరాచకవాదులు రెండు పోలీస్‌ అవుట్‌పోస్టులు, ఫారెస్టు బీట్‌ కార్యాలయంతోపాటు మేతీ, కుకీ తెగల వారికి చెందిన దాదాపు 70 ఇళ్లను తగలబెట్టారు. ఈ ఘటన అనంతరం మైతీ వర్గానికి చెందిన వందలాది మంది పౌరులు ఆ ప్రాంతం విడిచి వెళ్లిపోయారు.

Pakistan Eliminated? Full T20 World Cup Super 8 Qualification Scenario
పాకిస్తాన్‌ ఇక ఇంటికేనా.. సూపర్‌-8 చేరాలంటే ఇలా జరగాలి?

టీ20 వ‌ర‌ల్డ్‌క‌ప్‌-2024లో పాకిస్తాన్ దారుణ ప్ర‌ద‌ర్శ‌న క‌న‌బ‌రుస్తోంది. ఈ మెగా టోర్నీలో వ‌రుస‌గా రెండు మ్యాచ్‌ల్లో ఓట‌మి పాలైన పాకిస్తాన్‌.. త‌మ సూప‌ర్‌-8 ఆశ‌ల‌ను సంక్లిష్టం చేసుకుంది. తొలుత అమెరికా చేతిలో అనూహ్య ఓట‌మి చ‌విచూసిన పాకిస్తాన్‌.. తాజాగా త‌మ రెండో మ్యాచ్‌లో భార‌త్‌పై 6 ప‌రుగుల తేడాతో ప‌రాజ‌యం పాలైంది. దీంతో.. పాక్‌ సూపర్-8లో క్వాలిఫై అయ్యే అవకాశాలు స‌న్నగిల్లాయి. సూప‌ర్‌-8లో దాయాది పాక్ చోటు సంపాందించుకోవాలంటే ఏదైనా అద్భుతం జ‌ర‌గాలి.పాకిస్తాన్ సూప‌ర్‌-8 చేరాలంటే?ఈ మెగా టోర్నీలో గ్రూపు-ఎలో ఉన్న పాకిస్తాన్‌కు మ‌రో రెండు లీగ్ మ్యాచ్‌లు మిగిలి ఉన్నాయి. పాకిస్తాన్ త‌మ త‌దుప‌రి మ్యాచ్‌ల్లో జూన్ 11న కెన‌డా, 16న ఐర్లాండ్‌తో త‌ల‌ప‌డ‌నుంది. కాగా పాకిస్తాన్ ప్ర‌స్తుతం పాయింట్ల టేబుల్‌లో నాలుగో స్థానంలో ఉంది. అయితే పాకిస్తాన్ సూప‌ర్‌-8కు చేరాలంటే మిగిలిన రెండు మ్యాచ్‌ల్లోనూ భారీ విజయం సాధించాలి. త‌మ రన్‌రేటును భారీగా మెరుగుపరుచుకోవాలి. మ‌రోవైపు పాయింట్ల ప‌ట్టిక‌లో రెండో స్ధానంలో ఉన్న యూఎస్ఎ త‌మ త‌దుప‌రి రెండు మ్యాచ్‌ల్లో ఓడిపోవాలి. అప్పుడు పాకిస్తాన్‌, యూఎస్ఎ పాయింట్లు స‌మం అవుతాయి. ఆ స‌మ‌యంలో అమెరికా కంటే పాక్ మెరుగైన ర‌న్ క‌లిగి ఉంటే సూప‌ర్‌-8 అర్హ‌త సాధిస్తోంది. అయితే అమెరికా ఒక్క మ్యాచ్‌లో గెలిచినా పాక్ ఇంటిముఖం ప‌ట్ట‌క త‌ప్ప‌దు. ప్రస్తుతం యూఎస్ఏ రన్‌రేట్ (+0.626) పాక్(-0.150) కంటే మెరుగ్గా ఉంది. మైన‌స్‌లో ఉన్న పాకిస్తాన్ మెరుగుప‌డాలంటే అంత ఈజీ కాదు. కెనడా, ఐర్లాండ్‌పై భారీ విజ‌యాలు సాధిస్తే త‌ప్ప ర‌న్‌రేట్ మెరుగుప‌డ‌దు. ఎలా చూసినా.. సూపర్-8లో చేరేందుకు పాకిస్తాన్‌కు చాలా తక్కువ అవకాశాలే ఉన్నాయని చెప్పాలి. ఇక గ్రూపు-ఎ నుంచి పాయింట్ల ప‌ట్టిక‌లో అగ్ర‌స్ధానంలో ఉన్న భార‌త్‌.. మ‌రో విజ‌యం సాధిస్తే సూప‌ర్‌-8కు అర్హ‌త సాధిస్తోంది.చదవండి: T20 WC: బుమ్రా సూపర్‌ బాల్‌.... దెబ్బకు రిజ్వాన్ ఫ్యూజ్‌లు ఔట్‌! వీడియో

Apple CEO Tim Cook Meets Indian Student Developer Akshat Srivastava
ఆశ్చర్యపోయాను!.. భారతీయ విద్యార్థిపై 'టిమ్ కుక్' ప్రశంసలు

యాపిల్ కంపెనీ ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్వహించే 'వరల్డ్‌వైడ్ డెవలపర్స్ కాన్ఫరెన్స్ 2024' (WWDC 2024) జూన్ 10 నుంచి 14 వరకు కాలిఫోర్నియాలో జరుగుతుంది. అయితే ఈ ఈవెంట్‌ ప్రారంభం కావడానికి ముందు యాపిల్ సీఈఓ టిమ్ కుక్ గోవాలోని బిట్స్ పిలానీ కేకే బిర్లా కాలేజీలో చదువుతున్న 22 ఏళ్ల అక్షత్ శ్రీవాస్తవను కుక్ కలిశారు.టిమ్ కుక్.. భారతీయ విద్యార్థి, డెవలపర్‌ అయిన అక్షత్ శ్రీవాస్తవతో జరిపిన పరస్పర చర్యను తన ఎక్స్ (ట్విటర్) ఖాతాలో పోస్ట్ చేశారు. ఇందులో 'స్విఫ్ట్ స్టూడెంట్ ఛాలెంజ్‌'లో గెలిచిన విద్యార్థి డెవలపర్‌లతో మాట్లాడాను. వారి క్రియేటివిటీ, ప్రదర్శనను చూడటం ఆశ్చర్యంగా ఉందని పేర్కొన్నారు.నేను గత సంవత్సరం భారతదేశాన్ని సందర్శించినప్పుడు చాలా మంది గొప్ప డెవలపర్‌లను కలిశాను. ప్రజల జీవితాలను మెరుగుపరిచే అనేక మార్గాలు వారిలో ఉండటాన్ని చూసి ఆశ్చర్యపోయాను. ఈ వారం అక్షత్‌ని కలవడం కూడా అంతే ఆశ్చర్యంగా ఉందని ఆయన పేర్కొన్నారు. క్లాసిక్ గేమ్‌ల పట్ల తనకున్న ప్రేమను తరువాత తరంతో పంచుకోవడానికి సరికొత్త మార్గాన్ని సృష్టించారు అని వెల్లడించారు.శ్రీవాస్తవ యాపిల్ స్విఫ్ట్ స్టూడెంట్ ఛాలెంజ్‌లో భాగంగా మైండ్‌బడ్ అనే యాప్‌ను సమర్పించారు. ఇది తన మేనల్లుడితో పంచుకున్న ఉల్లాసభరితమైన క్షణాల నుంచి ప్రేరణ పొంది, ఈ యాప్‌ను రూపొందించినట్లు సమాచారం. మైండ్‌బడ్ పిల్లలు తమ కుటుంబం లేదా స్నేహితులతో కలిసి ఆనందించడానికి రూపొందించిన నాలుగు ఆకర్షణీయమైన చిన్న గేమ్‌లను కలిగి ఉంది.శ్రీవాస్తవ మైండ్‌బడ్‌ని సృష్టించడానికి స్విఫ్ట్‌యుఐ, ఎవికిట్ (ఆడియో), పెన్సిల్‌కిట్, ఫైల్‌మేనేజర్‌లను ఉపయోగించారు. కొత్త టెక్నాలజీలు అనుగుణంగా దీనిని రూపొందించారు.అక్షత్ శ్రీవాస్తవ కోవిడ్ సంక్షోభ సమయంలో ట్విట్టర్, ఫేస్‌బుక్‌లోని సోషల్ మీడియా పోస్ట్‌ల ద్వారా ఆసుపత్రులలో ఖాళీగా ఉన్న పడకలను ట్రాక్ చేయడానికి ఒక యాప్‌ను అభివృద్ధి చేశారు. కొత్త ఆవిష్కరణలు, టెక్నాలజీల మీద ఆసక్తి కనపరిచిన శ్రీవాస్తవ యాపిల్ పార్క్‌లో జరిగే కార్యక్రమానికి 50 మంది విద్యార్థులలో ఒకరుగా వెళ్లారు.Kicking off #WWDC24 in the best way possible—meeting with student developers who won our Swift Student Challenge. It’s amazing to see their creativity and determination on full display! pic.twitter.com/b56k8kcGZs— Tim Cook (@tim_cook) June 9, 2024

A video shows in which animal was seen strolling casually at the presidential palace during the swearing-in ceremony on Sunday.
మోదీ ప్రమాణ స్వీకార కార్యక్రమంలో పులి?.. వీడియో వైరల్​

న్యూఢిల్లీ: దేశ ప్రధానిగా నరేంద్రమోదీ మూడోసారి ప్రమాణస్వీకారం చేశారు. ఆయనతో పాటు 71 మంది మంత్రులుగా ప్రమాణం చేశారు. రాష్ట్రపతి భవన్‌ వేదికగా ఆదివారం అట్టహాసంగా ఈ కార్యక్రమం జరిగింది. దేశ, విదేశాలకు చెందిన రాజకీయ, సినీ ప్రముఖులు, పారిశ్రామిక వేత్తలతో సహా 8 వేల మంది అతిథులు హాజరయ్యారు.అయితే అత్యంత కట్టుదిట్టమైన భద్రతా వలయంలో జరిగిన ఈ వేడుకలో ఆహ్వానం లేదని ఓ అతిథి ప్రత్యక్షమైంది. ప్రమాణస్వీకార కార్యక్రమం పూర్తయిన తర్వాత మధ్యప్రదేశ్​ బీజేపీ ఎంపీ దుర్గా దాస్​ ఉయికే.. రాష్ట్రపతి ముర్ముకు అభివాదం చేస్తుండగా.. స్టేజీ వెనక భాగంలో ఓ జంతువు అటుగా వెళుతూ కెమెరా కంటికి చిక్కింది. ప్రమాణ స్వీకార వేదికకు కాస్త దూరంలోనే సంచరించడం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.సోషల్‌మీడియాలో దీనికి సంబంధించిన వీడియో వైరల్​గా మారింది. తొలుత ఫేక్‌ వీడియో లేదా ఏఐ జనరేటెడ్‌ వీడియో అని కొట్టిపారేశారు. తర్వాత ప్రధానమంత్రి కార్యాలయం నిన్న షేర్‌ చేసిన యూట్యూబ్‌ లైవ్‌ ఫీడ్‌ను పరిశీలించినప్పుడు.. ఓ జంతువు సంచరించడం నిజమేనని తేలింది.అది చూడటానికి పులిలా కనిపించింది. కానీ ఆ జంతువు పెంపుడు పిల్లి అని, లేదా కు అయి ఉండవచ్చిన పలువురు అభిప్రాయపడుతున్నారు. అంతేగాక కొంతమంది ఈ దృశ్యాలను కూడా నమ్మడం లేదు, బ్యాగ్రౌండ్​లో ఎడిట్ చేసి చూపిస్తున్నారని చెబుతున్నారు. మరికొందరైతే అతి కచ్చితంగా చిరుతపులిలా కనిపిస్తుందని, అక్కడి వారు అదృష్టవంతులు దాని బారి నుంచి తప్పించుకున్నారని కామెంట్​ చేస్తున్నారు. దీనిపై రాష్ట్రపతి భవన్‌ నుంచి ఎలాంటి అధికారిక ప్రకటన వెలువడలేదు.An animal was seen strolling back in the Rashtrapati Bhavan after MP Durga Das finished the paperwork~ Some say it was a LEOPARD while others call it some pet animal. Have a look 🐆 pic.twitter.com/owu3ZXacU3— The Analyzer (News Updates🗞️) (@Indian_Analyzer) June 10, 2024

Teens Lung Collapses After Vaping Equivalent Of 400 Cigarettes A Week
సిగరెట్స్‌ కంటే వేపింగే డేంజరా? హఠాత్తుగా శరీరం..

సిగరెట్స్ ఆరోగ్యానికి మంచిది కాదు కాబట్టి చాలా మంది ఇప్పుడు వేపింగ్ వైపుకి మొగ్గు చూపుతున్నారు. ఎక్కువగా టీనేజర్స్ దీనికి బాగా ఎడిక్ట్ అవుతున్నారు. అలానే ఇక్కడొక యువతి దీనికి అడిక్ట్‌ అయ్యి చావు అంచులదాక వెళ్లి వచ్చింది. అదృష్టంకొద్ది ప్రాణాలతో బయటపడింది. ఆమె సిగరెట్‌ వేపింగ్‌ మాదిరిగా ప్రమాదకరమైనది కాదనుకుని చేజేతులారా ఇంతటి పరిస్థితి కొని తెచ్చుకున్నానని బాధగా చెప్పింది. అసలేంటి ఈ వేపింగ్‌? సిగరెట్స్‌ కంటే ప్రమాదకరమా..?యూకేకి చెందిన 17 ఏళ్ల అమ్మాయి వేపింగ్‌కి అడిక్ట్‌ అయ్యింది. దీంతో ఊపిరితిత్తుల్లో గాయమై ఒక్కసారిగా పనిచేయడం మానేశాయి. ఇది ఆమె సరిగ్గా మే11న తన ‍స్నేహితురాలి ఇంట్లో నిద్రిస్తున్న సమయంలో జరిగింది. నిద్రలోనే శ్వాస సంబంధ సమస్యలతో శరీరం అంతా నీలం రంగంలోకి మారిపోవడం జరిగింది. దీంతో ఆమెను హుటాహుటినా ఆస్పత్రికి తరలించారు. అక్కడ వైద్యులు పరీక్షల్లో న్యూమోథోరాక్స్‌కి గురవ్వడంతో ఊపరితిత్తులు పనిచేయడం మానేశాయని చెప్పారు. వెంటనే ఆమెకు ఊపరితిత్తుల భాగాన్ని తొలగించాలని వెల్లడించారు. ఇక్కడ న్యూమోథోరాక్స్‌ అంటే..శరీరంలో సరిగ్గా ఊపిరితిత్తులకు బయట ఉన్న ఖాళీ ప్రదేశంలో గాలి పేరుకుపోయి ఊపరితిత్తులపై ఒత్తిడి ఏర్పడుతుంది. దీంతో అక్కడ గాయం అయ్యి ఒక్కసారిగా ఊపిరితిత్తులు పనిచేయడం మానేస్తాయి. అలాగే రోగి శరీరం నీలం రంగులోకి మారిపోతుంది. ఈ పరిస్థితుల్లో రోగి ప్రాణాలు పోయే ప్రమాదం కూడా ఉంటుంది. అయితే ఈ టీనేజ్‌ అమ్మాయికి వైద్యులు సుమారు ఐదున్నర గంటల పాటు సర్జరీ చేసి తక్షణమే డ్యామేజ్‌ అయిన ఊపిరితిత్తుల భాగాన్ని తొలగించారు. ప్రస్తుతం ఆమె నెమ్మది నెమ్మదిగా కోలుకుంటోంది. తాను చాలా భయానకమైన చేదు అనుభవాన్ని ఎదుర్కొన్నానని, వేపింగ్‌ ఇంత ప్రమాదమని అస్సలు అనుకోలేదని కన్నీటిపర్యతమయ్యింది. ఇక దాని జోలికి వెళ్లనని, జీవితం చాలా విలువైనదని దాన్ని సంతోషభరితంగా చేసుకోవాలని చెబుతోంది. ఇంతకీ ఏంటీ వేపింగ్‌..?వేపింగ్‌ అంటే..?బ్యాటరీతో నడిచే ఎలెక్ట్రానిక్ 'ఈ సిగరెట్' పరికరం నుంచి వచ్చే ఆవిరిని పీల్చడాన్ని వేపింగ్ అంటారు. 'ఈ-సిగరెట్స్' బ్యాటరీతో పని చేస్తాయి. మామూలు సిగరెట్స్‌లో పొగాకు మండి పొగ వస్తుంది. ఈ-సిగరెట్స్‌లో పొగాకు, ఫ్లేవర్స్, కెమికల్స్‌తో నిండిన లిక్విడ్ ఉంటుంది. ఈ లిక్విడ్‌ని వేడి చేస్తే పొగ / వేపర్ వస్తుంది. ఈ పొగని పీల్చడమే వేపింగ్ అంటే. ఇది సిగరెట్‌ కంటే ప్రమాదకారి కాదు. కానీ దీనిని స్మోకింగ్ మానడానికి ఒక మెట్టుగా మాత్రమే ఉపయోగిస్తారని చెబుతున్నారు నిపుణులు . అయితే ఇది కూడా ఆరోగ్యాని అంత మంచిది కాదనే చెబుతున్నారు. అంతేగాదు వేపింగ్‌ ఎడిక్షన్‌కి గురైతే..బాధితులు ఒక వారానికి 400 సిగరెట్లు సేవించడం వల్ల వచ్చే దుష్ఫరిణాన్ని ఎదుర్కొంటారని చెబుతున్నారు నిపుణులుదుష్పలితాలు..వేపింగ్ ఊపిరితిత్తులని డామేజ్ చేస్తుంది. ఫ్రీ రాడికల్స్‌ని బాడీలోకి రిలీజ్ చేసి కేన్సర్ రావడానికి కారణం అవుతాయి. రోగ నిరోధక శక్తి బాగా బలహీన పడుతుంది. పిల్లలూ, టీనేజ ర్స్‌లో బ్రెయిన్ డెవలప్‌మెంట్‌ని ఎఫెక్ట్ చేస్తుంది. స్త్రీలు ప్రెగ్నెంట్‌గా ఉన్నప్పుడు ఈ-సిగరెట్స్ యూజ్ చేస్తే అబార్షన్ జరిగే ఛాన్స్ కూడా ఉంటుందని నిపుణులు చెబుతున్నారు.(చదవండి: తుమ్ము ఎంత పనిచేసింది? ఏకంగా ప్రేగులు..)

Director Ratheesh Balakrishnan Treated Like a Maid: Costume designer Liji Preman
ఆ డైరెక్టర్‌ నన్ను పనిమనిషిలా చూశాడు.. అందరిముందు..

మలయాళ దర్శకుడు రథీశ్‌ బాలకృష్ణ తనను మొదటినుంచీ ఇబ్బందిపెడుతూనే ఉన్నాడంది కాస్ట్యూమ్‌ డిజైనర్‌ లిజి ప్రేమన్‌. తనను ఒక ఆర్టిస్టుగా కాకుండా పనిమనిషిగా చూశాడని వాపోయింది. తాజాగా ఓ ఇంటర్వ్యూలో లిజి మాట్లాడుతూ.. సురేశంతియం సుమలతయుదేయమ్‌: హృదయహరియయ ప్రణయకథ అనే సినిమాకు నేను కాస్ట్యూమ్‌ డిజైనర్‌గా పని చేశాను. 35రోజులు పని ఉంటుందన్నారు. అందుకుగానూ రెండున్నర లక్షలు అడిగాను. సరేనంటూ లక్ష రూపాయలు అడ్వాన్స్‌గా ఇచ్చారు. ఎన్నో ఇబ్బందులు..ఈ సినిమా ప్రీపొడక్షన్‌ దగ్గరి నుంచి షూటింగ్‌ వరకు దాదాపు 110 రోజులు పని చేశాను. ఈ సమయంలో చాలా ఇబ్బందులు ఎదుర్కొన్నాను. ముఖ్యంగా ఈ సినిమా డైరెక్టర్‌ రథీశ్‌కు ఇగో ఎక్కువ. నన్ను ఒక పనిమనిషిలా చూశాడు. అతడి ప్రవర్తన నాకు ఏమాత్రం నచ్చలేదు. అందరిముందు చులకన చేసి మాట్లాడేవాడు. ఆయన వల్ల ఎంతో మానసిక వేదన అనుభవించాను. తన టార్చర్‌ భరించలేక చివర్లో ఈ ప్రాజెక్టు నుంచి బయటకు వచ్చేశాను. నాకు క్రెడిట్‌ ఇవ్వలేదుతీరా చూస్తే సినిమా క్రెడిట్స్‌లో నా పేరు వేయలేదు. అసిస్టెంట్‌ అని రాశారు. కాస్ట్యూమ్‌ డిజైనర్‌గా మరో వ్యక్తికి క్రెడిట్‌ ఇచ్చారు. ఇది నన్ను అవమానించడం కాకపోతే ఇంకేమవుతుంది. పైగా నాకు ఇవ్వాల్సిన డబ్బు పూర్తిగా ముట్టజెప్పలేదు. ఎన్నో ఏళ్లుగా ఇండస్ట్రీలో ఉన్న నాపై ఇలా కక్ష సాధింపు చర్యలు చేపట్టిన వారిని ఊరికే వదిలిపెట్టను. నా వల్ల సినిమాకు ఇబ్బంది ఉండకూడదనే రిలీజ్‌ అయ్యేవరకు ఆగాను. ఓటీటీలో అయినా..ఇప్పుడు న్యాయపోరాటం చేస్తాను. కనీసం ఓటీటీలో విడుదల చేసేటప్పుడైనా కాస్ట్యూమ్‌ డిజైనర్‌గా సినిమాలో నా పేరు వేయాలని డిమాండ్‌ చేస్తున్నాను. అలాగే నా పట్ల దురుసుగా ప్రవర్తించినందుకుగానూ డైరెక్టర్‌ నాకు సారీ చెప్పాలి. మానసిక వేధింపులకు గురి చేసినందుకు పరిహారం చెల్లించాలి. నాలాంటి పరిస్థితి మరెవరికీ రాకూడదు అని లిజి పేర్కొంది.చదవండి: గుడిలో కమెడియన్‌ పెళ్లి.. వధువు బ్యాక్‌గ్రౌండ్‌ ఇదే!

KSR Comments On The Manner In Which Many Leaders Got A Place In The Union Cabinet
మోదీ కేబినెట్‌లో ఇదొక సర్‌ప్రైజ్‌ ప్యాక్‌!

కేంద్ర మంత్రివర్గంలో చోటు పొందడం అంటే అది ఒక అత్యున్నత స్థానానికి చేరుకున్నట్లు లెక్క. దేశం అంతటిని ప్రభావితం చేయడానికి అవకాశం ఉంటుంది. ఈసారి ప్రధాని నరేంద్ర మోదీ మంత్రివర్గంలో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ ల నుంచి ఐదుగురికి అవకాశం దక్కింది. ముగ్గురు బీజేపీకి చెందినవారు కాగా, ఇద్దరు టీడీపీవారు. తెలుగుదేశం పార్టీ నాలుగు మంత్రి పదవులు ఆశించినా రెండు మాత్రమే లభించాయి. తెలంగాణ నుంచి కిషన్ రెడ్డి, బండి సంజయ్, ఏపీ నుంచి కె రామ్మోహన్ నాయుడు, పెమ్మసాని చంద్రశేఖర్, భూపతిరాజు శ్రీనివాస వర్మలకు చోటు లభించింది.వీరిలో అనూహ్యమైన పేరు వర్మ అని చెప్పాలి. కొంతకాలం క్రితం వరకు ఆయన ఏపీలో ఒక సాధారణ నేత. భీమవరం ప్రాంతంలో బాగా తెలిసిన వ్యక్తే అయినా, ఇంత వేగంగా ఆయన కేంద్ర మంత్రివర్గంలో సభ్యుడు అవుతారని ఎవరూ ఊహించలేదు. రాజకీయాలలో ఎప్పుడు ఎవరికి అవకాశం వస్తుందో చెప్పలేమనడానికి వర్మ ఒక ఉదాహరణ అవుతారు. ఆయన మొదటి నుంచి భారతీయ జనతా పార్టీలోనే ఉన్నారు. ఆయన టీవీ షోలలో బీజేపీ తరపున చర్చలలో పాల్గొంటుండేవారు. ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లా పార్టీ అధ్యక్షుడుగా పనిచేశారు. తదుపరి పార్టీ రాష్ట్ర నాయకుడుగా కొనసాగుతున్నారు.తెలుగుదేశంతో పొత్తు కుదిరిన తర్వాత బీజేపీకి కేటాయించిన నరసాపురం నుంచి ఎంపీ పదవికి పోటీచేయాలని వైఎస్సార్‌సీపీ దూరం అయిన సిట్టింగ్ సభ్యుడు రఘురామ కృష్ణంరాజు గట్టి ప్రయత్నం చేశారు. ఆయన కూటమిలోని మూడు పార్టీలలో ఏదో ఒక పక్షం సీటు ఇస్తుందని ఆశించారు. బీజేపీ అధిష్టానం ఆయన వైపు మొగ్గు చూపలేదు. ఆయన బీజేపీ సభ్యుడు కాదని అందువల్లే టిక్కెట్ ఇవ్వలేదని ఆ పార్టీవారు చెప్పినా, అది సాకు అని చాలా మంది భావించారు. దాంతో రఘురామ టీడీపీలో చేరి ఉండి స్థానం నుంచి పోటీచేసి అసెంబ్లీకి ఎన్నికయ్యారు.వర్మ పేరు అనూహ్యంగా తెరపైకి వచ్చింది. నరసాపురంలో క్షత్రియ వర్గానికి చెందిన నేతకు టిక్కెట్ ఇవ్వాలని నిర్ణయించుకున్న తర్వాత అక్కడ ఉన్న వారిలో ఈయనే ప్రముఖుడుగా తెరపైకి వచ్చారు. బహుశా వర్మ కూడా ఊహించి ఉండకపోవచ్చు. వర్మను మార్చించాలని కొంతమంది ప్రయత్నం చేయకపోలేదు. అయినప్పటికీ, పార్టీ కోసం నిలబడిన వ్యక్తిగా వర్మ వైపే బీజేపీ అధిష్టానం మొగ్గు చూపింది. తద్వారా పార్టీలో కష్టపడి పనిచేసేవారికి, సుదీర్ఘకాలం పార్టీలో ఉన్నవారికి అవకాశాలు వస్తాయన్న నమ్మకం కలిగించారు. వర్మ ఇక్కడ నుంచి గెలుస్తారా? లేదా? అనే సంశయం తొలుత ఉన్నప్పటికీ, వైఎస్సార్‌సీపీ తన అభ్యర్ధిగా బీసీ నేతను ఎంపిక చేసుకోవడం వర్మకు కలిసి వచ్చిందని చెప్పాలి.నరసాపురంలో ఎక్కువసార్లు క్షత్రియవర్గం వారే ఎంపీలు అవుతూ వచ్చారు. ఆ సామాజికవర్గం తక్కువ సంఖ్యలోనే ఉన్నా, వారి పలుకుబడి చాలా పెద్దదిగా భావిస్తారు. అదంతా వర్మకు ప్లస్ పాయింట్ అయింది. మనిషి కూడా సౌమ్యుడుగా పేరొందారు. అన్నీ కలిసి వచ్చి వర్మ ఎంపీగా గెలుపొందడమే కాకుండా ఏకంగా కేంద్ర మంత్రి అయిపోయారు. ఇది కలయో, నిజమో అనుకునేంతలోనే ఈ రాజకీయ పరిణామాలు జరిగిపోయాయి. రాజకీయాలలో కాకలు తీరిన సీ.ఎమ్ రమేష్, పార్టీ అధ్యక్షురాలు దగ్గుబాటి పురందేశ్వరిలను కాదని వర్మవైపు బీజేపీ మొగ్గుచూపి కేంద్రంలో స్థానం కల్పించారు. ఒకరకంగా రమేష్, పురందేశ్వరిలకు కాస్త అసంతృప్తి కలిగించే అంశమే అయినా, దాని గురించి మాట్లాడకపోవచ్చు.పురందేశ్వరి కాంగ్రెస్ హయాంలో మన్మోహన్ సింగ్ క్యాబినెట్ లో మంత్రిగా పనిచేశారు. రాష్ట్ర విభజన నేపథ్యంలో ఆమె బీజేపీలో చేరి 2014, 2019లలో పోటీచేసినా గెలవలేకపోయారు. అయినా పార్టీలో జాతీయ స్థాయిలో క్రియాశీలక పాత్ర పోషించారు. తదుపరి ఆమెను ఏపీ బీజేపీ అధ్యక్షురాలిగా నియమించారు. దాంతో ఆమెకు ప్రత్యేక గుర్తింపు వచ్చింది. మాజీ సీఎం ఎన్.టి రామారావు కుమార్తెగా కూడా ఆమె అందరికి తెలిసిన నేతగా ఉన్నారు. తెలుగుదేశంతో పొత్తు కుదర్చడంలో ఆమె గట్టి ప్రయత్నం చేశారు. అందుకు అధిష్టానం కూడా అంగీకరించింది. ఆమె రాజమండ్రి నుంచి పోటీచేసి విజయం సాధించారు. ఆమెకు కచ్చితంగా మంత్రి పదవి వస్తుందని చాలా మంది అనుకున్నారు. కారణం ఏమో కానీ ఆమెకు అవకాశం రాలేదు. స్పీకర్ లేదా, డిప్యూటి స్పీకర్ వంటి పదవి ఏదైనా వస్తుందా అని ఆమె మద్దతుదారులు ఆశిస్తున్నారు.ఇక మరో కీలకమైన నేత సీఎం రమేష్. ఆయన రాజకీయ జీవితం అంతా తెలుగుదేశంతో ముడిపడి ఉంది. రెండుసార్లు రాజ్యసభ సభ్యుడయ్యారు. టీడీపీ అధినేత చంద్రబాబుకు సొంత మనిషిగా గుర్తింపు పొందారు. 2019 ఎన్నికలలో టీడీపీ పరాజయం తర్వాత వ్యూహాత్మకంగా బీజేపీలో చేరారు. ఆ పార్టీలో ఉంటూ చంద్రబాబు ప్రయోజనాలను పరిరక్షించడంలో ముఖ్యభూమిక పోషించారని చాలామంది విశ్వసిస్తారు. అలాగే టీడీపీతో పొత్తు పెట్టుకునేలా అధిష్టానాన్ని తనదైన శైలిలో ప్రభావితం చేశారని చెబుతారు. ఆ తర్వాత ఆయన వ్యూహాత్మకంగా అనకాపల్లి స్థానాన్ని ఎంపిక చేసుకుని బీజేపీ టిక్కెట్ సాధించగలిగారు.కడప జిల్లాకు చెందినవారైనప్పటికీ, తన అంగ, అర్ధ బలంతోపాటు, అక్కడ ఉన్న టీడీపీ నేతలంతా తనకు బాగా తెలిసినవారే కావడంతో ఆయనకు కలిసి వచ్చింది. ఫలితంగా ఆయన విజయం సాధించిన తర్వాత కచ్చితంగా ఆయనకున్న పలుకుబడి రీత్యా కేంద్ర మంత్రి పదవి పొందుతారని చాలామంది భావించారు. కానీ బీజేపీ అధిష్టానం ఆయనకు పదవి ఇవ్వలేదు. తెలుగుదేశం పక్షాన కింజారపు రామ్మోహన్ నాయుడు మూడోసారి లోక్ సభకు ఎన్నికై మోదీ మంత్రివర్గంలో క్యాబినెట్ హోదా పొందారు. ఇది అరుదైన విషయమే. ముప్పై ఆరేళ్ల వయసులోనే ఈ స్థాయికి రావడం గొప్ప సంగతే.రామ్మోహన్ నాయుడు తండ్రి ఎర్రన్నాయుడు కూడా కేంద్రంలో యునైటెడ్ ప్రంట్ టైమ్ లో మంత్రి పదవి చేశారు. వాజ్ పేయి ప్రభుత్వ టైమ్ లో స్పీకర్ అవుతారని భావించారు. కానీ ఆ పదవి జి.ఎమ్.సి బాలయోగిని వరించింది. బాలయోగి అనూహ్య మరణం తర్వాత ఆ పదవి వస్తుందని ఆశించారు. కానీ గుజరాత్ పరిణామాల నేపథ్యంలో పదవి తీసుకోవడానికి చంద్రబాబు అంగీకరించలేదు. దాంతో ఎర్రన్నాయుడు కు మళ్లీ అవకాశం రాలేదు. ఇప్పుడు ఆయన కుమారుడు రామ్మోహన్ నాయుడుకు పదవి దక్కడం విశేషం. తండ్రి రాజకీయ వారసత్వంతో పాటు, కేంద్రంలో పదవి కూడా దక్కించుకున్నారు. తెలుగుతోపాటు ఆంగ్లం, హిందీ భాషలలో పట్టు ఉండడం ఈయనకు కలిసి వచ్చే పాయింట్ అని చెప్పాలి. యువకుడు, పార్టీకి కట్టుబడి పనిచేయడం ప్లస్ అయింది. టీడీపీ ఎంపీలలో వరసగా మూడుసార్లు ఎంపీ అయిన వ్యక్తి ఈయనే. ఉత్తరాంధ్రలో బీసీ వర్గానికి చెందిన నేతగా గుర్తింపు పొందారు. గుంటూరు నుంచి ఈసారి గల్లా జయదేవ్ పోటీచేయకపోవడంతో రామ్మోహన్ కు పోటీ లేకపోయిందని చెప్పవచ్చు. గుంటూరు నుంచి గెలిచిన పెమ్మసాని చంద్రశేఖర్ కు కూడా కేంద్రంలో పదవి రావడం విశేషం. ఎన్డీయే అధికారంలోకి రావడంతో ఈయనకు చాన్స్ వస్తుందన్న భావన ఏర్పడింది. దానికి తగ్గట్లే టీడీపీ నాయకత్వం ఈయనకు అవకాశం కల్పించింది. ఆరువేల కోట్ల సంపద కలిగిన నేతగా ప్రచారంలో ఉన్న ఈయన కేంద్రంలో మంత్రి అయ్యారు. జనసేన నుంచి వి. బాలశౌరి కేంద్ర మంత్రి అవుతారని ప్రచారం జరిగినా ఎందుకో కాలేకపోయారు. ఆయన గతంలో వైఎస్సార్‌సీపీ ఎంపీగా ఉండేవారు. ఈ ఎన్నికలలో జనసేన నుంచి మచిలీపట్నంలో గెలుపొందారు. పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ కేంద్ర మంత్రి తీసుకోవడానికి ప్రస్తుతం సిద్దపడలేదని, అందుకే బాలశౌరికి అవకాశం రాలేదని మీడియాలో వార్తలు వచ్చాయి.తెలంగాణ నుంచి కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి మరోసారి పదవి దక్కించుకున్నారు. 2018 తెలంగాణ శాసనసభ ఎన్నికలలో అంబర్ పేట నుంచి ఓటమి చెందడమే ఈయనకు వరం అయింది. ఆ తర్వాత 2019 లోక్ సభ ఎన్నికలలో సికింద్రాబాద్ నుంచి పోటీచేసి విజయం సాధించడం, మోదీ మంత్రి వర్గంలో చోటు దక్కడం జరిగిపోయాయి. ఆ రకంగా ఈయన రాజకీయ భవిష్యత్తు మారిపోయింది. పార్టీ కార్యకర్తగా జీవితాన్ని ఆరంభించి కేంద్రంలో క్యాబినెట్ హోదాకు ఎదిగిన నేత ఈయన. ప్రజలతో మమేకం అవడం ద్వారా ఆదరణ చూరగొన్నారు. మరో నేత బండి సంజయ్ కు కేంద్రంలో స్థానం లభించింది. బీసీ వర్గానికి చెందిన ఈయన రాజకీయ ప్రస్తానం కరీంనగర్ మున్సిపల్ రాజకీయాల నుంచి కావడం విశేషం.అసెంబ్లీ ఎన్నికలలో ఓటమి పొందినా, తదుపరి కరీంనగర్ నుంచి లోక్ సభకు ఎన్నికవడం, ఆ తర్వాత తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు కావడం ఒక సంచలనం. ఫైర్ బ్రాండ్ గా అనతికాలంలోనే పేరొందిన ఈయన అప్పట్లో కేసీఆర్ ప్రభుత్వంపై పెద్ద పోరాటాలే సాగించారు. ఈయనను బీజేపీ అధ్యక్ష పదవి నుంచి తప్పించడం అందరిని ఆశ్చర్యపరచింది. దాంతో తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలలో బీజేపీ విజయావకాశాలు దెబ్బతిన్నాయన్న అభిప్రాయం ఏర్పడింది. దానిని గుర్తించిన పార్టీ నాయకత్వం పార్టీలో జాతీయ హోదా కల్పించింది. తిరిగి ఇప్పుడు కేంద్ర మంత్రివర్గంలో అవకాశం ఇచ్చింది.సీనియర్ నేత డీకే అరుణ, మరో నేత ఈటల రాజేందర్ లు కూడా కేంద్రంలో పదవులు ఆశించారు. కానీ దక్కలేదు. కిషన్ రెడ్డికి పదవి ఇచ్చినందున అరుణకు అవకాశం ఉండదు. అలాగే బండి సంజయ్ కు లభించిన తర్వాత ఈటలకు చాన్స్ రాదు. కాకపోతే ఈటలకు పార్టీ అధ్యక్ష పదవి ఇవ్వవచ్చని ప్రచారం జరుగుతోంది. ఓడలు బండ్లు అవుతాయి.. బండ్లు ఓడలు అవుతాయని చెప్పడానికి ఈటల రాజకీయ జీవితం కూడా ఉదాహరణే. కేసీఆర్ ప్రభుత్వం నుంచి బర్తరఫ్ అయిన తర్వాత జరిగిన పరిణామాలలో ఆయన గడ్డు పరిస్థితి ఎదుర్కున్నారు. ఒక షెల్టర్ గా ఉంటుందని భావించి బీజేపీలో చేరారు. అది ఆయనకు కలసి వచ్చింది. గత శాసనసభ ఎన్నికలలో ఓటమి చెందినా, మల్కాజిగిరి నుంచి ఎంపీ కాగలిగారు.మొత్తం మీద చూస్తే బీజేపీలో మొదటి నుంచి ఉన్న నేతలకే మోదీ ప్రాధాన్యం ఇచ్చినట్లు కనిపిస్తుంది. కిషన్ రెడ్డి, బండి సంజయ్, భూపతిరాజు శ్రీనివాస వర్మలకు అందుకే పదవులు దక్కాయి. దగ్గుబాటి పురందేశ్వరి, సీఎం రమేష్, డి.కె అరుణ, ఈటల రాజేందర్, కొండా విశ్వేశ్వరరెడ్డి వంటి నేతలు ఇతర పార్టీల నుంచి బీజేపీలో చేరిన నేతలు కావడం గమనార్హం. టీడీపీ నుంచి ఒక బీసీ నేతకు, బీజేపీ నుంచి మరో బీసీ నేతకు అవకాశం వచ్చింది. ముగ్గురు అగ్రవర్ణాల వారికి మంత్రి పదవులు దక్కాయి. వీరందరికి అభినందనలు చెబుదాం.– కొమ్మినేని శ్రీనివాసరావు, సీనియర్ పాత్రికేయులు

YSRCP MLA Matsyarasa Visweswara Raju On Party Change Rumour
వైఎస్సార్‌సీపీని వీడితే నాకు పుట్టగతులుండవు: విశ్వేశ్వర రాజు

అల్లూరి సీతారామరాజు: రాజకీయంగా ఎన్నో అవకాశాలు ఇచ్చిన వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి, వైఎస్సార్‌సీపీని వీడే ప్రసక్తే లేదని పాడేరు ఎమ్మెల్యే మత్స్యరాస విశ్వేశ్వరరాజు Matsyarasa Visweswara Raju అంటున్నారు. ఆయనపై జరుగుతున్న ప్రచారం నేపథ్యంలో సోమవారం ఉదయం మీడియాతో మాట్లాడారు.‘‘నేను పార్టీ మారుతున్నట్లు వస్తున్న కథనాలను తీవ్రంగా ఖండిస్తున్నా. వైఎస్‌ జగన్‌తోనే నా పయనం కొనసాగుతుంది. నాకు రాజకీయంగా గుర్తింపు ఇచ్చింది ఆయనే. ఎస్టీ కమిషన్‌ సభ్యుడిగా, నా భార్యకు జెడ్పీటీసీగా అవకాశం కల్పించారు. ఎన్నో అవకాశాలు ఇచ్చిన వైఎస్సార్‌సీపీని వీడితే నాకు పుట్టగతులు ఉండవు. .. పార్టీ మారే ప్రసక్తే లేదు. ఊపిరి ఉన్నంత వరకు జగన్‌తోనే ఉంటా. 2029లో మళ్లీ వైఎస్సార్‌సీపీ అధికారంలోకి వస్తుంది’’ అని విశ్వేశ్వరాజు ఆశాభావం వ్యక్తం చేశారు.ఇదీ చదవండి: చంద్రబాబు చెప్పినా.. ఏపీలో ఆగని టీడీపీ దాష్టీకం

Advertisement
Advertisement


Advertisement
Advertisement
Advertisement
 

న్యూస్ పాడ్‌కాస్ట్‌

ఫోటో స్టోరీస్

View all
Advertisement