కరెన్సీ నోట్ల మార్పిడికి.. పది రోజులే గడువు | Sakshi
Sakshi News home page

కరెన్సీ నోట్ల మార్పిడికి.. పది రోజులే గడువు

Published Mon, Dec 22 2014 1:10 PM

కరెన్సీ నోట్ల మార్పిడికి.. పది రోజులే గడువు - Sakshi

ముంబయి : కరెన్సీ నోట్ల మార్పిడికి సమయం దగ్గర పడింది. 2005 కంటే ముందు ముద్రించిన కరెన్సీ నోట్లను మార్చుకునేందుకు ఇక పది రోజుల గడువు ఉంది. రూ.500, రూ.1,000 కరెన్సీ నోట్లు సహా ఇతర నోట్లను మార్చుకునేందుకు భారత రిజర్వు బ్యాంకు జనవరి 1వ తేదీ 2015ను తుది గడువుగా విధించింది. 2005 కంటే ముందున్న కరెన్సీ నోట్లను బ్యాంకుల్లో మార్చుకోవాల్సిందిగా రిజర్వు బ్యాంకు ఈ ఏడాది జనవరి 22న ప్రజలను కోరింది.

 దీంతో ఇప్పటివరకు 144.66 కోట్ల కరెన్సీని ప్రజలు మార్చుకున్నారు. 2005కు ముందు తయారైన కరెన్సీ నోట్లు భద్రతా ప్రమాణాలకు అనుగుణంగా లేవని ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. 2005 కంటే ముందున్న నోట్ల వెనుక వైపు సంవత్సరం ముద్రించి ఉండదు. 2005 తర్వాత ముద్రించిన కరెన్సీ నోట్లపై వెనుకవైపు భాగాన సంవత్సరం ముద్రించి ఉంటుంది.

Advertisement
Advertisement