రాజధానికి సెంటు పొలం కూడా ఇచ్చేది లేదని రాయపూడి రైతులు ఎమ్మెల్యేతో చెప్పారు.
గుంటూరు: ఆంధ్రప్రదేశ్ రాజధాని కోసం పచ్చని పొలాల జోలికి వస్తే ఊరుకోమని అన్నదాతలు తేల్చిచెప్పుతున్నారు. తమ పొలాలు ఇచ్చేది లేదని గుంటూరు జిల్లా తుళ్లురు మండలం రాయపూడి రైతులు స్పష్టం చేశారు.
బుధవారమిక్కడ జరిగిన జన్మభూమి కార్యక్రమంలో టీడీపీ ఎమ్మెల్యే శ్రావణ్కుమార్ పాల్గొన్నారు. రాజధానికి సెంటు పొలం కూడా ఇచ్చేది లేదని ఎమ్మెల్యేతో చెప్పారు. రైతులు భూములు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారని ఎలా చెబుతున్నారని ఎమ్మెల్యేను నిలదీశారు. సమాధానం చెప్పలేక ఎమ్మెల్యే శ్రావణ్కుమార్ అక్కడి నుంచి వెళ్లిపోయారు.