టీడీపీలో ఉండే కంటే కట్టెలు కొట్టుకోవడం నయం | Motkupalli Narasimhulu takes on telugu desam party | Sakshi
Sakshi News home page

టీడీపీలో ఉండే కంటే కట్టెలు కొట్టుకోవడం నయం

Jan 28 2014 1:44 PM | Updated on Sep 2 2017 3:06 AM

టీడీపీలో ఉండే కంటే కట్టెలు కొట్టుకోవడం నయం

టీడీపీలో ఉండే కంటే కట్టెలు కొట్టుకోవడం నయం

రాజ్యసభ సీటు దక్కకపోవడంతో టీడీపీ ఎమ్మెల్యే మోత్కుపల్లి నర్సింహులు ఆవేదన కట్టలు తెంచుకుంది.

రాజ్యసభ సీటు దక్కకపోవడంతో టీడీపీ ఎమ్మెల్యే మోత్కుపల్లి నర్సింహులు ఆవేదన కట్టలు తెంచుకుంది. మంగళవారం హైదరాబాద్లో మోత్కుపల్లిను సముదాయించేందుకు వచ్చిన ఆ పార్టీ సీనియర్ నేతల ఎర్రబెల్లి, ఎల్. రమణ, విజయరమణారావు, ఊకే అబ్బయ్య, మహేందర్‌రెడ్డి తదితరులు మోత్కుపల్లి నివాసానికి తరలివచ్చారు. ఈ సందర్భంగా వారి వద్ద మోత్కుపల్లి  తన ఆక్రోశాన్ని ఆయన వెళ్లకక్కారు. టీడీపీలో ఉండే కంటే కట్టెలు కొట్టుకోవడం నయమని మోత్కుపల్లి వాపోయారు.


పార్టీని నమ్ముకుంటే ఇంత అన్యాయం చేస్తారా అంటూ ప్రశ్నించారు. సంవత్సరం నుంచి నీకే రాజ్యసభ సీటు ఇస్తానని చెప్పి తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు తనను మభ్యపెట్టారని తోటి ఎమ్మెల్యే వద్ద మోత్కుపల్లి ఆగ్రహం వ్యక్తం చేశారు. చంద్రబాబు వైఖరితో మోత్కుపల్లి తీవ్ర కలత చెందారు. దీంతో ఆయన పార్టీ మారే యోచనలో ఉన్నట్లు సమాచారం.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement