విజయనగరం మాజీ జెడ్పీ ఛైర్మన్ బెల్లాని చంద్రశేఖర్ శుక్రవారం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరారు.
గన్నవరం : మాజీ పీసీసీ అధ్యక్షుడు బొత్స సత్యనారాయణకు గట్టి ఎదురుదెబ్బ తగిలింది. విజయనగరం మాజీ జెడ్పీ ఛైర్మన్ బెల్లాని చంద్రశేఖర్ శుక్రవారం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సమక్షంలో బెల్లానితో పాటు 40 మంది సర్పంచ్‌లు, మాజీ ఎంపీటీసీలు, సోసైటి అధ్యక్షులు పార్టీలో చేరారు.
జగన్ వీరిని సాదరంగా పార్టీలోకి ఆహ్వానించారు. రాష్ట్ర ప్రజలను కాంగ్రెస్, టీడీపీలు వంచించాయని చంద్రశేఖర్ విమర్శించారు. వైఎస్ జగన్ పోరాట పటిమ, నాయకత్వ లక్షణాలను చూసి పార్టీలో చేరినట్టు బెల్లాని ప్రకటించారు. అలాగే డీసీసీ కార్యదర్శి దేవభక్తుని సుబ్బారావు కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరారు.