
ప్రేక్షకులు హాస్యాన్ని కోరుకుంటున్నారు
ప్రస్తుతం ప్రేక్షకులు హాస్యాని కోరుకుంటున్నారని ప్రముఖ సినీనటుడు, నరసన్నపేట వాస్తవ్యుడు ప్రభాస్ శ్రీను చెప్పారు.
నరసన్నపేట: ప్రస్తుతం ప్రేక్షకులు హాస్యాని కోరుకుంటున్నారని ప్రముఖ సినీనటుడు, నరసన్నపేట వాస్తవ్యుడు ప్రభాస్ శ్రీను చెప్పారు. తనకు కామెడీ, నెగిటివ్ పాత్రలే చిత్ర పరిశ్రమలో గుర్తింపుని తెచ్చిపెట్టాయని చెప్పారు. ప్రతీ సంవత్సరం మాదిరిగా ఈసారి కూడా నరసన్నపేట కొత్తవీధిలో గణపతి విగ్రహాన్ని ఏర్పాటు చేసిన ఆయన పూజా కార్యక్రమాల్లో పాల్గొనేందుకు ఆదివారం వచ్చారు.
ఈ సందర్భంగా విలేకరులతో మాట్లాడారు. ఇప్పటి వరకు 80 సినిమాల్లో నటించినట్టు చెప్పారు. తాను నటించిన మరో నాలుగు సినిమాలు విడుదలకు సిద్ధంగా ఉన్నాయన్నారు. చరిత్ర సృష్టించనున్న బహుబలి సినిమాలో కూడా నటించడం ఎంతో సంతోషంగా ఉందన్నారు. తండ్రి యర్రయ్య , తల్లి సరోజల సహకారం వల్ల చిత్ర పరిశ్రమలో గుర్తింపు తెచ్చుకోగలిగానన్నారు.