రభసలో నటిస్తున్నా..

రభసలో నటిస్తున్నా..


జూనియర్ ఆర్టిస్ట్ సుందర్

తాడేపల్లిగూడెం రూరల్ : జూనియర్ ఎన్టీఆర్ హీరోగా నటిస్తున్న రభస చిత్రంలో సహాయ నటుడిగా నటిస్తున్నానని జూనియర్ ఆర్టిస్ట్ సమయమంతుల హేమసుందర్ (సుందర్) అన్నారు. తాడేపల్లిగూడెం బలుసులమ్మ జాతర సందర్భంగా ఆదివారం ఇక్కడకు వచ్చిన సుందర్ విలేకరులతో మాట్లాడారు.  

? : మీ స్వగ్రామం

తాడేపల్లిగూడెం మండలం బంగారుగూడెం

? : ఎంతవరకు చదువుకున్నారు

సుందర్ : బీఎస్సీ, బీఫార్మసీ, డిప్లొమా ఇన్ మల్టీమీడియా

? : సినీ రంగాన్ని ఎంచుకోవడంలో ఉద్దేశం

నాన్న స్టేజ్ నటుడు కావడంతో చిన్నతనం నుంచి నటనపై నాకు ఆసక్తి ఉంది. స్కూళ్లలో నాటకాలు కూడా వేశాను. వృత్తిరీత్యా వ్యాపార కుటుంబమైనా నాకు మాత్రం నటుడు కావాలనే కోరిక ఉండేది. దీంతో ఈ రంగంలోకి అడుగుపెట్టాను.

? : సినిమా రంగంలో ఎప్పుడు ప్రవేశించారు

2005లో ‘దొంగ దొంగది’ ద్వారా పరిచయమయ్యాను. ఆ తర్వాత కొంతకాలం సినిమాలకు దూరంగా ఉన్నాను. 2008లో ‘ఆకాశమే హద్దు’తో మరలా నటన మొదలుపెట్టా.

? : ఇప్పటి వరకు ఎన్ని సినిమాల్లో నటించారు

 చమక్ చల్లో, అది నువ్వేనువ్వే, జాదూ సినిమాల్లో నటించాను.

?: ప్రస్తుతం నటిస్తున్న సినిమాలు ఏవి

 జూనియర్ ఎన్టీఆర్ రభస, నేను నేనుగా లేను చిత్రాల్లో నటిస్తున్నా, కల్యాణ్‌రామ్ హీరోగా నిర్మించనున్న సినిమాలో నటించనున్నా.

?: సీరియల్స్‌లో  నటించారా

సుందర్ : భార్యామణిలో (తేజ్), పెళ్లినాటి ప్రమాణాలలో (శ్రీమంత్), ముత్యమంత పసుపులో (మౌర్య), ముద్దుబిడ్డలో (చిన్నా), కళ్యాణయోగంలో (వివేక్) పాత్రలు పోషించాను. పెళ్లినాటి ప్రమాణాల్లో శ్రీమంత్ పాత్రకు మంచి గుర్తింపు వచ్చింది.

? : నటుడు కావాలనుకునే యువతకు మీరిచ్చే సలహా

సుందర్ : ఈ రంగంలో నిరంతరం కష్టపడాలి. ఏ పాత్ర వచ్చినా చిత్తశుద్ధితో నటించాలి. అంకితభావం చాలా అవసరం. పనిచేస్తేనే ఫలితాలు వస్తాయి. నిరుత్సాహాన్ని దరిచేరనీయవద్దు.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top