Breaking News

టిప్పర్‌ ఢీకొని యువకుడి దుర్మరణం!

Published on Sun, 06/14/2026 - 12:52

మహబూబాబాద్‌ రూరల్‌ : టిప్పర్‌ ఢీకొని యువకుడు మృతిచెందిన సంఘటన మహబూబాబాద్‌ జిల్లా కేంద్రంలోని సర్వేపల్లి రాధాకృష్ణ విగ్రహం సెంటర్‌ వద్ద శనివారం చోటుచేసుకుంది. టౌన్‌ సీఐ రఘుపతిరెడ్డి తెలిపిన వివరాల ప్రకారం.. జిల్లాలోని కేసముద్రం మండలం బడితండాకు చెందిన భూక్య సేవియా, లలిత దంపతులకు ముగ్గురు కుమారులు భరత్‌, నవీన్‌ (22) గణేష్‌ ఉన్నారు. రెండో కుమారుడు నవీన్‌ శుభకార్యాల డెకరేషన్లు, ఈవెంట్‌ ఆర్గనైజింగ్‌ పనులతోపాటు కూలి పనులు చేస్తుంటాడు.

ఈ క్రమంలో జిల్లా కేంద్రంలోని మూడు కోట్ల సెంటర్‌ వైపు నుంచి కోర్టు సెంటర్‌ వైపు బైక్‌ పై వస్తున్నాడు. సర్వేపల్లి రాధాకృష్ణ విగ్రహం సెంటర్‌ వద్దకు నవీన్‌ చేరుకుంటుండగా వెనుకనుంచి టిప్పర్‌ వాహనం అతడిని ఢీకొట్టగా అక్కడికక్కడే మృతిచెందాడు. సమాచారం తెలుసుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని టిప్పర్‌ను అదుపులోకి తీసుకొని పోలీస్‌ స్టేషన్‌కు తరలించారు. నవీన్‌ మృతదేహాన్ని పోస్ట్‌మార్టం గదికి తరలించారు. టిప్పర్‌ డ్రైవర్‌ పరారీలో ఉన్నట్లు సమాచారం. బాధిత కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తామని సీఐ తెలిపారు.

Videos

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

మున్సిపల్ ఎన్నికలపై జగన్ ఫోకస్.. రెండో జాబితాలో బీసీలకు పెద్దపీట..!

తిరుపతిలో దారుణం.. నామినేషన్ వేయడానికి వెళ్లిన మహిళ బట్టలు చింపి...

భారీ ర్యాలీతో వరుదు కళ్యాణి నామినేషన్

ఒక్కోడికి చెప్తున్నా.. పోలీసుల ఓవరాక్షన్..! ఇచ్చిపడేసిన నరేన్ రెడ్డి

తొలిరోజే 100 కోట్లు... భారీ కలెక్షన్స్ దిశగా జైలర్ 2

కాలువలో పడ్డ బస్సు.. 8 మంది దుర్మరణం

పులివెందులలో TDP నేతల దాడి.. వైఎస్ అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్

Photos

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)