Breaking News

తెలంగాణలో ఈ జిల్లాల్లో ఇవాళ, రేపు వానలు, ఏపీలో ఇలా..

Published on Tue, 10/07/2025 - 08:37

తెలుగు రాష్ట్రాల్లో కొన్నిరోజులుగా భిన్నవాతావరణం నెలకొంటోంది. పగలంతా ఎండ ఉంటూ.. సాయంత్రం ఆకస్మికంగా వర్షాలు కురుస్తున్నాయి. ఈ తరుణంలో.. వాతావరణ శాఖ తెలంగాణలోని పలు జిల్లాలకు భారీ వర్ష సూచన చేసింది. 

ఉపరితల ఆవర్తన ప్రభావంతో.. తెలంగాణలోని 17 జిల్లాలకు ఎల్లో అలర్ట్‌ జారీ చేసింది(Telangana Yellow Alert). భద్రాద్రి కొత్తగూడెం, ములుగు, భూపాలపల్లి, మహబూబాబాద్, మేడ్చల్, రంగారెడ్డి, సూర్యాపేట జిల్లాల్లో ఇవాళ తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిసింది. గంటకు 40 కిలోమీటర్ల వేగంతో ఈదుపు గాలులు వీస్తాయని,  పిడుగులు పడే అవకాశం ఉందని హెచ్చరించింది. అయితే రేపు మాత్రం మహబూబ్‌నగర్‌, నల్లగొండ, వరంగల్‌,  సిద్ధిపేట, మేడ్చల్‌, జనగాం, యాదాద్రి, వికారాబాద్‌ జిల్లాల్లో భారీ వర్షాలు పడతాయని పేర్కొంది. 

ఇక రాజధాని హైదరాబాద్ నగరంలో ఇవాళ సాయంత్రం సమయంలో, అలాగే రేపు కుండపోత కురిసే అవకాశముందని(Hyderabad Rains) వాతావరణ శాఖ తెలిపింది. 

మరోవైపు.. ఏపీలో వాతావరణం దాదాపుగా పొడిగా ఉండొచ్చని ఇక్కడి వాతావరణశాఖ చెబుతోంది. అయితే.. రాయలసీమ ప్రాంతంలో ఉపరితల ఆవర్తనం ప్రభావంతో ఇవాళ భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది(AP Rains News). ఉదయం, సాయంత్రం ఆకస్మిక వర్షాలు పడే అవకాశం ఉన్నట్లు సమాచారం.

అక్టోబర్ నెలలో 10+10+11.. 
అక్టోబర్ నెలలోనూ మొత్తం మూడు దశల్లో వర్షాలు కురవొచ్చని వాతావరణ శాఖ అంచనా వేస్తోంది. అక్టోబర్ 1–10 మధ్య ఉత్తర, తూర్పు తెలంగాణలో భారీ వర్షాలు.. అక్టోబర్ 10–20 మధ్య ఓ మోస్తరు వర్షాలు, అక్టోబర్ 21–31 మధ్య ఈశాన్య రుతుపవనాల ప్రభావంతో మళ్లీ భారీ వర్షాలు పడే అవకాశం ఉందని చెబుతోంది.

ఇదీ చదవండి: ఇక నుంచి డిజిటల్‌ పాస్‌లు

Videos

నామినేషన్ వేయనియ్యకుండా.. టీడీపీ నేతల అరాచకం.. చోద్యం చూస్తున్న పోలీసులు..

AK-47తో YSRCP నేతలపై కాల్పులు... YS అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్..!

అమెరికాలో మహా ప్రళయం.. ఒకేసారి 3 రాకాసి తుఫానులు!

బన్నీ - జూ ఎన్టీఆర్ మల్టీస్టారర్.. నెల్సన్ మాస్టర్ ప్లాన్...

కడపలో ఉద్రిక్తత.. కార్పొరేటర్ అభ్యర్థులపై కత్తి పోట్లు.. బండి దీప్తి ఇంటిపై దాడి!

పులివెందులలో కాల్పులు.. YSRCP నేతలపై పోలీసుల దాష్టీకం

MP గురుమూర్తి చేతిలో నుంచి నామినేషన్ పేపర్స్ లాక్కొని పారిపోయిన టీడీపీ నేతలు

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

Photos

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)