Breaking News

ఆపరేషన్‌ సిందూర్‌ కొనసాగించాలి

Published on Thu, 05/08/2025 - 17:25

హైద‌రాబాద్‌: ఆపరేషన్‌ సిందూర్‌కు అపూర్వ స్పందన లభిస్తోంది. ఉగ్రవాదులను తుదముట్టించేందుకు ఇదే సరైన చర్య అని మాజీ ఆర్మీ అధికారులు భావిస్తున్నారు. అవసరమైతే తాము కూడా యుద్ధంలో పాల్గొనడానికి సిద్ధమని ప్రకటిస్తున్నారు. ఆర్మీ, నేవీ, వాయుసేన (Air Force) సంయుక్తంగా చేపట్టిన ఈ ఆపరేషన్‌పై కంటోన్మెంట్‌లోని పలువురు ఆర్మీ అధికారులు తమ అభిప్రాయాలు వెల్లడించారు. ఈసారి యుద్ధం వస్తే, అధికారుల నుంచి పిలుపు వస్తే పాల్గొనటానికి సిద్ధంగా ఉన్నామని రిటైర్డ్‌ ఆర్మీ జవాన్లు తెలిపారు.  

దాడులు చేస్తే సహించేది లేదు 
ఆపరేషన్‌ సిందూర్‌ సమర్థనీయమే. శక్తివంతమైన మన త్రివిధ దళాల సామర్థ్యం ప్రపంచ దేశాలకు తెలుసు. 1948 మొదలు 1965, 1975, 1999లో పాకిస్థాన్‌ దేశానికి తగిన గుణపాఠం చెప్పినా తీరు మార్చుకోలేదు. ఉగ్రవాదులు మనదేశంపై దాడులు చేయకుండా పాకిస్తాన్‌లోని వారి శిబిరాలపై దాడులు చేసేందుకు ఆపరేషన్‌ సిందూర్‌ కొనసాగించాలి.  
– ఆర్‌ఆర్‌ మహాపాత్రో, రిటైర్డ్‌ ఆర్మీ అధికారి

మరోసారి యుద్ధానికి సిద్ధం 
ఒకవేళ పాకిస్తాన్‌తో యుద్ధం జరిగితే మనదేశం తరఫున యుద్ధంలో పాల్గొనేందుకు సిద్ధంగా ఉన్నాను. గత కార్గిల్‌ యుద్ధంలో మద్రాస్‌ రెజిమెంట్‌ 27 తరఫున పూంచ్‌ సెక్టార్‌ నుంచి పాల్గొన్నాను. పాక్‌ ముష్కరులపై దాడులు చేశాం. 2006లో ఆర్మీ నుంచి పదవీ విరమణ పొందాను. తాజాగా ఉగ్రవాదులు దాక్కున్న తొమ్మిది స్థావారాలపై మన దళాలు దాడులు జరిపి ఉగ్రవాదులను మట్టుపెట్టి వారి స్థైర్యాన్ని దెబ్బతీశాయి.  
– పరమేశ్వర్‌ సింగ్‌ సిపాయి, రిటైర్డ్‌

పాక్‌కు తట్టుకునేశక్తి లేదు..
ఈసారి పాక్‌తో యుద్ధం వస్తే మరోసారి పాల్గొనేందుకు సిద్ధంగా ఉన్నాను. 1999లో జరిగిన కార్గిల్‌ యుద్ధంలో యుద్ధ ట్యాంకర్‌ డ్రైవర్‌గా 21 మెకనైజ్డ్‌ ఎనిఫెంట్రి రెజిమెంట్‌ తరఫున పదకొండు రోజులపాటు జమ్ము, కశ్మీర్‌లోని మేరినాగ్‌ బటాపూర్‌ నుంచి పాల్గొన్నాను. పదకొండు మంది పాక్‌ సైనికులను అంతమొందించాం. మనదేశానికి చెందిన ఆర్మీ, నేవీ, వాయుసేనను తట్టుకునే శక్తి పాకిస్తాన్‌కు లేదు.  
– కామేశ్వర్‌ రావు, కార్గిల్‌ యుద్ధవీరుడు

చ‌ద‌వండి: పాకిస్థాన్ మిస్సైళ్ల‌ను గాల్లోనే పేల్చేసిన భార‌త్‌  

Videos

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

ఎన్నికలు సజావుగా జరిగితే విజయం మాదే..

దసరాకి RC ఫాన్స్ కు అదిరిపోయే న్యూస్..!

హైకోర్టులో YSRCP పిటిషన్.. పొన్నవోలు వాదనలు

అనకాపల్లి జిల్లా నర్సీపట్నంలో అయ్యన్నపాత్రుడికి షాక్

కడపలో ఉద్రిక్తత నామినేషన్ పత్రాలు చించివేత

YSRCP నేతలు నామినేషన్లు వేయకుండా TDP మూకల దాడి

జగనన్న నాపై పెట్టిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటా

మా మిథున్ రెడ్డిని చంపేస్తారా? TDP గూండాల దాడిపై పెద్దిరెడ్డి రియాక్షన్..

రాష్టపతి దృష్టికి ఎంపీ మిథున్ రెడ్డి పై దాడి ఘటన

Photos

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)