Breaking News

డివైడర్‌ను ఢీకొని సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగుల దుర్మరణం

Published on Sat, 11/16/2024 - 07:53

గచ్చిబౌలి: అతివేగం ఇద్దరు సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగుల ప్రాణాలను బలిగొంది. మితిమీరిన వేగం ఎంతటి ప్రమాదమో ఈ విషాదకర ఘటన తెలియజెప్పింది. గచ్చిబౌలి పరిధిలో శుక్రవారం తెల్లవారుజామున జరిగిన రోడ్డు ప్రమాదంలో వెంకన్న స్వామి (30), దేవ్‌ కుమార్‌ స్వామి (25) అనే యువ సాఫ్ట్‌వేర్‌ ఇంజినీర్లు దుర్మరణం చెందారు. 

గచ్చిబౌలి ఇన్‌స్పెక్టర్‌ హబీబుల్లా ఖాన్‌ తెలిపిన వివరాలప్రకారం.. ఏపీలోని కాకినాడకు చెందిన కేవీ కృష్ణారావు కుమారుడు కేసాని వెంకన్న స్వామి అమెజాన్‌ కంపెనీలో, వైజాగ్‌లోని హరిజన బస్తీకి చెందిన చెందిన పిల్లి కుమార స్వామి కుమారుడు దేవ్‌కుమార్‌ స్వామి మైక్రోసాఫ్ట్‌ కంపెనీలో సాఫ్ట్‌వేర్‌ ఇంజినీర్లుగా పని చేస్తున్నారు. నానక్‌రాంగూడలో ఓ పీజీ హాస్టల్‌లో ఉంటున్నారు.

 గురువారం రాత్రి వీరిద్దరూ కలిసి సెకండ్‌ షో సినిమాకు వెళ్లారు. సినిమా చూసి శుక్రవారం తెల్లవారు జామున 2.15 గంటల సమయంలో బైక్‌పై వస్తుండగా ట్రిపుల్‌ ఐటీ జంక్షన్‌ వద్ద ఎడమ వైపు ఉన్న డివైడర్‌ను ఢీకొట్టారు. బైక్‌ ఎగిరి పల్టీ కొట్టింది. ఇద్దరూ కిందపడిపోవడంతో తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాత్రులను కొండాపూర్‌ జిల్లా ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గమధ్యలోనే మృతి చెందారు. మృతదేహాలకు ఉస్మానియా ఆస్పత్రిలో పోస్టుమార్టం నిర్వహించి కుటుంబ సభ్యులకు అప్పగించారు. అతివేగం కారణంగానే బైక్‌ అదుపుతప్పి ప్రమాదం జరిగిందని పోలీసులు చెబుతున్నారు. గచి్చ»ౌలి పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.  

Videos

జగనన్న నాపై పెట్టిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటా

మా మిథున్ రెడ్డిని చంపేస్తారా? TDP గూండాల దాడిపై పెద్దిరెడ్డి రియాక్షన్..

రాష్టపతి దృష్టికి ఎంపీ మిథున్ రెడ్డి పై దాడి ఘటన

గంభీర్ మాస్టర్ ప్లాన్ .. వన్డేల నుండి బుమ్రా అవుట్?

నామినేషన్ కు ర్యాలీగా YS అవినాష్ రెడ్డి

మిథున్ రెడ్డికి జగన్ పరామర్శ TDP దాడులపై రియాక్షన్

LIVE : టీడీపీ గూండాల దాడులపై మిథున్ రెడ్డి సంచలన Press Meet

ఎన్నికల్లోనూ రెడ్ బుక్ రాజ్యాంగం.. మిథున్ రెడ్డిపై హత్యాయత్నం రోజా రియాక్షన్

CBIకి సాయికృష్ణ కేసు హైకోర్టు సంచలన తీర్పు

నామినేషన్లు వేయనివ్వరా? పుంగనూరు ఘటనపై లేళ్ల అప్పిరెడ్డి ఆగ్రహం

Photos

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)