Breaking News

ప్రధానికి తెలంగాణ రైజింగ్‌ గ్లోబల్‌ సదస్సు ఆహ్వానం

Published on Wed, 12/03/2025 - 11:13

సాక్షి, ఢిల్లీ: తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి బుధవారం ఉదయం ప్రధాన మంత్రి నరేంద్ర మోదీతో భేటీ అయ్యారు. తెలంగాణ రైజింగ్‌ గ్లోబల్‌ సమ్మిట్‌కు రావాల్సిందిగా ప్రధానికి ఆయన ఆహ్వానం అందించారు. పార్లమెంట్‌ భవనంలో జరిగిన ఈ భేటీలో తెలంగాణ డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క రేవంత్‌ వెంట ఉన్నారు.

సుమారు అరగంటపాటు ప్రధాని మోదీతో తెలంగాణ సీఎం రేవంత్‌ రెడ్డి భేటీ అయ్యారు. ఈ సందర్భంగా.. డిసెంబర్‌ 8,9వ తేదీల్లో జరగబోయే తెలంగాణ రైజింగ్‌ గ్లోబల్‌ సమ్మిట్‌కు రావాల్సిందిగా ఆహ్వానించారు. అలాగే.. రీజినల్ రింగ్ రోడ్డు, బెంగళూరు చెన్నై హైదరాబాద్ బుల్లెట్ ట్రైన్, మెట్రో విస్తరణకు నిధులు ఇవ్వాలని సీఎం ప్రధానిని కోరినట్లు తెలుస్తోంది. 

అంతకు ముందు తెలంగాణ ఎంపీలతో కలిసి సీఎం రేవంత్‌ బృందం.. కేంద్ర మంత్రులు రాజ్‌నాథ్‌ సింగ్‌, అశ్వినీ వైష్ణవ్‌లను కలిసింది. సదస్సుకు రావాల్సిందిగా కేంద్ర మంత్రులకు ఆహ్వానం అందించింది. 

ప్రధానితో భేటీ అనంతరం కాంగ్రెస్‌ అగ్రనేతలు రాహుల్‌ గాంధీ, ప్రియాంక గాంధీని సీఎం రేవంత్‌, డిప్యూటీ సీఎం భట్టి, ఎంపీల బృందం కలిసింది. రాష్ట్ర రాజకీయాలతో పాటు సదస్సు గురించి వీళ్ల మధ్య చర్చ జరిగినట్లు కాంగ్రెస్‌ వర్గాలు వెల్లడించాయి. 

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)