Breaking News

Hyderabad: రూ.4 కోట్ల మోసగాడు.. 28 ఏళ్లకు చిక్కాడు 

Published on Thu, 04/13/2023 - 08:11

సాక్షి, హైదరాబాద్‌: ఓ ఆర్థిక మోసం కేసులో 28 ఏళ్లుగా తప్పించుకు తిరుగుతున్న నేరస్తుడిని తెలంగాణ సీఐడీ పోలీసులు ఎట్టకేలకు అరెస్టు చేశారు. మహబూబ్‌నగర్‌ జిల్లా కొత్తూర్‌ పోలీస్‌ స్టేషన్‌లో 1995 నమోదైన కేసులో నిందితుడిగా వీఎస్‌ క్షీర్‌సాగర్‌ను అరెస్టు చేసినట్టు సీఐడీ అడిషనల్‌ డీజీ మహేశ్‌భగవత్‌ తెలిపారు. బుధవారం ఈ మేరకు విడుదల చేసిన ప్రకటనలో కేసు వివరాలు వెల్లడించారు.

మహబూబ్‌నగర్‌ జిల్లా, కొత్తూరు మండలం నందిగోన్‌ గ్రామ పరిధిలో 1995లో వానిసింగ్‌ కంపెనీ పేరిట ఓ స్టీల్‌ కంపెనీని  స్థాపించారు. స్థానికులకు కంపెనీలో షేర్లపేరిట మొత్తం రూ.4.3 కోట్లు సదరు కంపెనీ నిర్వాహకులు వసూలు చేశారు. ఈ మొ­త్తం­­లో రూ.4 కోట్లను 1995లో ముంబైలోని స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండోర్‌లో దాదర్‌  బ్రాంచ్‌­లో బ్రాంచ్‌ మేనేజర్‌గా పనిచేస్తున్న వీఎస్‌ క్షీర్‌సాగర్‌ కొట్టేశాడు.

కంపెనీ దివాళా తీ­యడంతో ఎంతోమంది అమాయకులు డ­బ్బు­లు పోగొట్టుకున్నా­రు. దీనిపై కేసు నమో­దు చేసిన సీఐడీ అధికారులు దర్యాప్తు చేపట్టారు. నిందితుడిపై జారీ అయిన నాన్‌ బెయిలబుల్‌ వారెంటును ఎట్టకేలకు అమలు చేస్తూ నిందితుడిని ఇండోర్‌ పట్టణంలో అరెస్టు చేశా­రు. నిందితుడి అరెస్టులో కీలకంగా పనిచేసిన సీఐ డీ ఇన్‌స్పెక్టర్‌ ఎస్‌ వెంకటేశ్, ఎస్సై పి నాగార్జు­న, హెడ్‌ కానిస్టేబుల్‌ ఎం.గోపాల్‌లను సీఐడీ అడిషనల్‌ డీజీ మహేశ్‌ భగవత్‌ అభినందించారు. 

Videos

బన్నీ - జూ ఎన్టీఆర్ మల్టీస్టారర్.. నెల్సన్ మాస్టర్ ప్లాన్...

కడపలో ఉద్రిక్తత.. కార్పొరేటర్ అభ్యర్థులపై కత్తి పోట్లు.. బండి దీప్తి ఇంటిపై దాడి!

పులివెందులలో కాల్పులు.. YSRCP నేతలపై పోలీసుల దాష్టీకం

MP గురుమూర్తి చేతిలో నుంచి నామినేషన్ పేపర్స్ లాక్కొని పారిపోయిన టీడీపీ నేతలు

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

మున్సిపల్ ఎన్నికలపై జగన్ ఫోకస్.. రెండో జాబితాలో బీసీలకు పెద్దపీట..!

తిరుపతిలో దారుణం.. నామినేషన్ వేయడానికి వెళ్లిన మహిళ బట్టలు చింపి...

భారీ ర్యాలీతో వరుదు కళ్యాణి నామినేషన్

Photos

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి