Breaking News

సింగరేణి ఎన్నికలు వాయిదా..

Published on Wed, 10/11/2023 - 12:58

సాక్షి,  హైదరాబాద్‌: సింగరేణి ఎన్నికలపై తెలంగాణ హైకోర్టు కీలక విచారణ చేపట్టింది. ఈనెల 28న జరగాల్సిన సింగరేణి ఎన్నికలను ఎన్నికలు వాయిదా వేయాలన్న సింగరేణి యాజమాన్యం అభ్యర్థనను అంగీకరించిన కోర్టు.. ఈమేరకు ఎన్నికలను వాయిదా వేసింది. డిసెంబరు 27న సింగరేణి ఎన్నికలు నిర్వహించాలని ఉన్నత న్యాయస్థానం ఆదేశించింది. నవంబర్‌ 30 లోపు ఓటర్‌ లిస్ట్‌ చేయాలని పేర్కొంది.

ఈ నెల 28న సింగరేణిలో ఎన్నికలు నిర్వహించేందుకు కేంద్ర కార్మిక శాఖ సిద్ధం అవ్వగా, ఎన్నికలపై  హైకోర్టు డివిజన్ బెంచ్‌లో సింగరేణి యాజమాన్యం అప్పీల్ చేసింది. అసెంబ్లీ ఎన్నికల కారణంగా సింగరేణి ఎన్నికలు వాయిదా వేయాలని సింగరేణి యాజమాన్యం కోరింది.

గత ఏడాది నుంచి హైకోర్ట్‌లో సింగరేణి ఎన్నిక వివాదం జరుగుతోంది. ఎన్నికల  నిర్వహణపై గడువు పొడిగిస్తూ ఉత్తర్వులు జారీ చేస్తున్న హైకోర్ట్.. ఇప్పటికే 3 సార్లు ఉత్తర్వులు జారీ చేసింది. జూన్ 23న సింగరేణి ఎన్నికల పై కీలక ఉత్తర్వులు హైకోర్టు జారీ చేసింది. ఎన్నికల నిర్వహించాల్సిందిగా సింగిల్ బెంచ్ ఉత్తర్వులు ఇవ్వగా, ఉత్తర్వులపై చీఫ్ కోర్టులో  సింగరేణి అప్పీల్ చేసింది. ఈ రోజు సింగరేణి ఎన్నికలపై విచారణ జరిపిన హైకోర్టు.. సింగరేణి ఎన్నికలను  డిసెంబరు 27కి వాయిదా వేస్తూ తీర్పు చెప్పింది.
చదవండి: 17 రోజులు.. 41 సభలు 

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)