Breaking News

సుంకాలు, నిబంధనలు ఆందోళనకరం

Published on Fri, 10/10/2025 - 05:37

సాక్షి, హైదరాబాద్‌: అమెరికా ప్రభుత్వం తీసుకొనే నిర్ణయా లు, అనుసరించే విధానాలన్నీ సానుకూల దృక్పథంతో ఇరుదేశాల మధ్య సంబంధాలను మరింత పెంపొందించేలా ఉండాలని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఆకాంక్షించారు. భార తీయ ఉత్పత్తులపై అమెరికా సుంకాలు పెంచడం, హెచ్‌– 1బీ వీసాలపై కఠిన నిబంధనలు విధించడంపట్ల ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. ఇలాంటి నిర్ణయాలు ఆర్థిక వ్యవస్థపై ప్రతికూల ప్రభావం చూపడంతోపాటు అస్థిరతకు, అపార్థానికి దారితీస్తాయన్నారు. ఇరుదేశాల మధ్య ఆర్థికా భివృద్ధికి దోహదపడే విధానాలు అనుసరిస్తే ప్రపంచానికి ఆదర్శవంతంగా ఉంటుందన్నారు.

అమెరికా నుంచి వచ్చిన ప్రతినిధుల బృందం తెలంగాణ పర్యటనలో భాగంగా గురువారం సచివాలయంలో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డితో సమావేశమైంది. అమెరికాలోని హడ్సన్‌ ఇన్‌స్టిట్యూట్‌కు చెందిన 16 మంది ప్రతినిధులు ఈ బృందంలో ఉండగా వారిలో మేధావులు, బిజినెస్‌ లీడర్లు ఉన్నారు. ఇండియా ఫౌండేషన్‌ ఆధ్వర్యంలో ఈ బృందం పలు రాష్ట్రాల్లో పర్యటిస్తూ ఇరు దేశాల మధ్య ద్వైపాక్షిక సంబంధాలు, వ్యాపార, వాణిజ్య వ్యవహారాలు, విధానాలపై అభిప్రాయాలు స్వీకరిస్తోంది. ఈ సమావేశంలో సీఎం మాట్లాడుతూ తెలంగాణ రైజింగ్‌ భవిష్యత్తు ప్రణాళికలను వివరించారు.

పాలకులు మారితే విధానాలు మార్చుకోవాల్సిన అవసరం లేదని.. రాష్ట్ర అభి వృద్ధి విషయంలో ఉత్తమ విధానాలను ప్రభుత్వం ఇప్పటికీ కొనసాగిస్తోందన్నారు. జీఎస్డీపీ, తలసరి ఆదాయంలో తెలంగాణ అనూహ్య పురోగతి సాధించిందని.. 2034 నాటి కి ఒక ట్రిలియన్‌ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా రాష్ట్రాన్ని తీర్చిది ద్దుతూ అభివృద్ధి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నామన్నారు. 

న్యూయార్క్, టోక్యోకి పోటీగా హైదరాబాద్‌
ఐటీ, ఫార్మా రంగాల పెట్టుబడులకు గమ్యస్థానంగా హైదరా బాద్‌ అందరినీ ఆకర్షిస్తోందని.. ప్రపంచ దిగ్గజ కంపెనీలు ఇక్కడికి వస్తున్నాయని సీఎం రేవంత్‌ చెప్పారు. హైదరాబాద్‌ ఇప్పుడు న్యూయార్క్, టోక్యో, దక్షిణ కొరియాతో పోటీపడు తోందన్నారు. హైదరాబాద్‌లో గేమ్‌–ఛేంజర్‌ ప్రాజెక్టులుగా భారత్‌ ఫ్యూచర్‌ సిటీతోపాటు రీజనల్‌ రింగ్‌రోడ్, రీజనల్‌ రింగ్‌ రైల్, మాన్యుఫాక్చరింగ్‌ జోన్లు, మెట్రో విస్తరణ, మూసీ సుందరీకరణ చేపడుతున్నట్లు వివరించారు. హైదరాబాద్‌ – చైన్నై, హైదరాబాద్‌–బెంగళూరు మధ్య బుల్లెట్‌ ట్రైన్‌ ప్రతిపాదనలు కూడా ఉన్నాయన్నారు.  

500 ఫార్చ్యూన్‌ కంపెనీలు రావాలి
30 వేల ఎకరాల్లో హైదరాబాద్‌లో అభివృద్ధి చేస్తున్న భారత్‌ ఫ్యూచర్‌ సిటీలో అమెరికా పరిశ్రమల భాగస్వా మ్యాన్ని ఆహ్వానిస్తున్నామని సీఎం రేవంత్‌ అన్నారు. ఇప్పటికే ఫార్చ్యూన్‌ 500 కంపెనీల్లో 50 కంపెనీలు హైదరాబాద్‌లో ఉన్నాయని.. మొత్తం 500 కంపెనీలూ పెట్టుబడులకు ముందుకొచ్చి ఫ్యూచర్‌ సిటీలో పాలుపంచుకోవాలని ఆకాంక్షించారు. ‘చైనా+1’ వ్యూహానికి తెలంగాణ అత్యుత్తమ ప్రత్యామ్నాయంగా నిలుస్తుందని.. అటువంటి భవిష్యత్తు ప్రణాళికలను తమ ప్రభుత్వం అనుసరిస్తోందని పేర్కొన్నారు. సమావేశంలో మంత్రి ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్‌బాబు, సీఎం సలహాదారు వేం నరేందర్‌రెడ్డి. సీఎస్‌ రామకృష్ణారావు తదితరులు పాల్గొన్నారు.

Videos

నేను రాజీనామా చేయను ఎమ్మెల్యేగా విధులు నిర్వహిస్తా

విజయ్ సాయి రెడ్డి, మాగుంట కామెంట్స్ పై డాక్టర్ రాధా మాధవి సీరియస్

కొండా విషయంలో జరిగింది ఇదే పిన్ టు పిన్ మీకోసం

రేవంత్ బ్లాక్ మెయిల్ రాజకీయం చేస్తున్నాడు... బాంబు పేల్చిన కొండా సురేఖ

YSRకు రేవంత్ కు తేడా ఇదే...!

మమ్మల్ని నమ్మించి మోసం చేశావ్ బాబుపై బొప్పరాజు సంచలన కామెంట్స్

తగ్గదేలే...మీసం మెలేసిన కొండా మురళి

ఫుల్ స్పీడ్ లో రవితేజ.. Next ప్రాజెక్ట్ ఎవరితో అంటే!

LIVE : కొండా సురేఖ సంచలన ప్రెస్ మీట్

భయం పట్టుకుంది అందుకే పోలవరం గురించి మాట్లాడటం మానేశా

Photos

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు

+5

మై లిటిల్ ప్యారడైజ్‌.. కొడుకు అర్జున్‌తో నాని క్యూట్ మూమెంట్స్‌ (ఫోటోలు)