Breaking News

త్వరలో తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు

Published on Mon, 08/04/2025 - 18:31

హైదరాబాద్: త్వరలో తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు నిర్వహించాలని కేబినెట్‌లో నిర్ణయం తీసుకున్నారు. ఈరోజు(సోమవారం, ఆగస్టు 4వ తేదీ) తెలంగాన కేబినెట్‌ సమావేశం నిర్వహించారు.సీఎం రేవంత్‌రెడ్డి ఢిల్లీ పర్యటన అనంతరం  అసెంబ్లీని  నిర్వహించాలని కేబినెట్‌ నిర్ణయం తీసుకుంది. ప్రధానంగా అసెంబ్లీలో కాళేశ్వరం రిపోర్ట్‌పై చర్చించనున్నారు. కాళేశ్వరం నివేదికపై అసెంబ్లీలో చర్చలు అనంతరం దర్యాప్తు సంస్థలకు అప్పగించాలని కేబినెట్‌లో నిర్ణయం తీసుకున్నారు. 

ప్రధానంగా కాళేశ్వరం కమిషన్‌ నివేదికపైనే అసెంబ్లీలో చర్చించే అవకాశం ఉంది.  కాళేశ్వరంపై అవతవకలపై ఏర్పాటు చేసిన కమిషన్‌.. తుది నివేదికను కొన్ని రోజుల క్రితం ప్రభుత్వానికి అందించింది. ఈ నేపథ్యంలో నేటి కేబినెట్‌ సమావేశంలో కూడా దీనిపైనే ప్రధానంగా చర్చించారు.

మరోవైపు.. కాళేశ్వరంలో ఎక్కడా అవినీతి జరగలేదని బీఆర్‌ఎస్‌ నేతలు చెబుతున్నారు. డిజైన్‌లో లోపాలు లేవని అంటున్నారు. అది కాంగ్రెస్‌ కమిసన్‌ అని వారు విమర్శిస్తున్నారు. వ్యాప్కో సంస్థ సూచనల మేరకు ప్రాజెక్టు నిర్మాణం జరిగినట్టు తెలిపారు.  కాగా, బీఆర్‌ఎస్‌ అధినేత కేసీఆర్‌తో పార్టీ నేతలు ఈరోజు సమావేశమయ్యారు. ఎర్రవల్లిలోని ఫామ్‌హౌజ్‌లో కేసీఆర్‌తో వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌, మాజీ మంత్రులు హరీష్‌ రావు, జగదీష్‌ రెడ్డి, నిరంజన్‌ రెడ్డి, వేముల ప్రశాంత్‌ రెడ్డి భేటీ అయ్యారు. ప్రభుత్వానికి కాళేశ్వరం కమిషన్‌ అందించిన నివేదికపైనే ఈ భేటీలో బీఆర్‌ఎస్‌ నేతలు చర్చించినట్లు తెలుస్తోంది.

కాళేశ్వరం నివేదికపై స్పందించిన కేసీఆర్‌

Videos

మొత్తం ఫుటేజ్ చూసి KCR ఏం అన్నాడంటే..?

స్పీకర్ వివాదం.. తాతా మధు చేసిన కామెంట్స్ ఇవే

నందుస్ వరల్డ్ అరెస్ట్ EXCLUSIVE VIDEO

Nepal Floods: తల్లి, కుమార్తె వరదలో చిక్కుకున్న దృశ్యాలు.. కన్నీళ్లు తెప్పిస్తున్న వీడియో

నోరు అదుపులో పెట్టుకో.. ఉదయనిధికి సినిమా రేంజ్ లో కౌంటర్

Nandana ఇండియాకు ఎందుకు వచ్చింది? కారణం ఇదేన..!

ఇదేం క్రేజ్ రా అయ్యా ! వైభవ్ కోసం పోటెత్తిన చెపాక్

300 మంది బలి.. ఫస్ట్ రోడ్లు మంచిగా వేయండి డేటా సెంటర్లు కాదు

కంటతడి పెట్టుకున్న సీతక్క, స్పీకర్

బైకర్‌కు తృటిలో తప్పిన ప్రమాదం.. భారీ కొండచరియలు విరిగిపడిన ఘటన వైరల్

Photos

+5

గోల్డ్ డ్రెస్‌లో మెరిసిపోతున్న అమితాబ్ మనవరాలు (ఫోటోలు)

+5

అప్సరసగా అందాల రాశీ ..(షూటింగ్‌ ఫొటోస్‌)

+5

తెలంగాణ అసెం‍బ్లీ : బీఆర్‌ఎస్‌ నిరసనపై పోలీసుల ఉక్కుపాదం (ఫొటోలు)

+5

‘రోమాంచకం’ మూవీ సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

బిగ్‌బాస్ హౌస్‌లో అడుగుపెట్టిన గ్లామరస్ యాంకర్ వర్షిణి (ఫొటోలు)

+5

‘మహేంద్రగిరి వారాహి’ ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

సారీలో సారా.. ధురుంధర్‌ భామ (ఫొటోలు)

+5

పూల మధ్యలో పుత్తడి బొమ్మలా.. అందాల సోయగం శ్రీలీల ఫొటోలు

+5

సద్గురుతో సమంత ఆధ్యాత్మిక ప్రయాణం.. ఫొటోలు

+5

తెలుగు బిగ్‌బాస్‌ సీజన్‌ 10... కంటెస్టెంట్స్‌ వీళ్లే (ఫొటోలు)