Breaking News

తెలంగాణ ఫిరాయింపు ఎమ్మెల్యేలకు నోటీసులు

Published on Tue, 02/04/2025 - 11:37

హైదరాబాద్‌, సాక్షి: తెలంగాణ ఎమ్మెల్యేల  ఫిరాయింపుల ఎపిసోడ్‌లో కీలక పరిణామం చోటు చేసుకుంది. పార్టీ మారిన ఎమ్మెల్యేలకు అసెంబ్లీ సెక్రటరీ మంగళవారం నోటీసులు జారీ చేశారు. ఫిరాయింపుల ఫిర్యాదుపై.. లిఖిత పూర్వక సమాధానం ఇవ్వాలని కోరారు. అయితే వివరణ ఇవ్వడానికి వాళ్లు గడువు కోరినట్లు సమాచారం. 

తెలంగాణలో బీఆర్‌ఎస్‌ పార్టీ మీద గెలిచి.. పది మంది ఎమ్మెల్యేలు అధికార కాంగ్రెస్‌లోకి వెళ్లారు. అయితే ఈ ఫిరాయింపులపై బీఆర్‌ఎస్‌ పార్టీ న్యాయస్థానాలను ఆశ్రయించింది. కిందటి ఏడాది..  నాలుగు నెలల్లోగా ఎమ్మెల్యేలపై చర్యలు తీసుకోవాలని తెలంగాణ హైకోర్టు ఆదేశించింది. అయినా ఎలాంటి పురోగతి కనిపించలేదు. దీంతో సుప్రీం కోర్టులో బీఆర్‌ఎస్‌ అనర్హత పిటిషన్‌ వేసింది. 

ఈ పిటిషన్‌పై విచారణ సందర్భంగా ఇంకా ఎంత సమయం తీసుకుంటారని న్యాయస్థానం నిలదీసింది. ఈ క్రమంలో ఎమ్మె‍ల్యేలకు కనీసం నోటీసులు జారీ చేయించాలని ఆదేశించింది. ఈ క్రమంలోనే ఇవాళ అసెంబ్లీ సెక్రటరీ నోటీసులు పంపించారు. మరోవైపు.. ఫిరాయింపుల అంశంపై బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌తో పాటు ఎమ్మెల్యే పాడి కౌశిక్‌ రెడ్డి వేసిన పిటిషన్లను కలిపి ఫిబ్రవరి 10వ తేదీన సుప్రీం కోర్టు విచారణ జరపనుంది.

ధృవీకరించిన ఎమ్మెల్యేలు
తమకు అసెంబ్లీ సెక్రెటరీ నుంచి నోటీసులు అందిన మాట వాస్తవమేనని పార్టీ మారిన ఎమ్మెల్యేలు డాక్టర్‌ సంజయ్‌, తెల్లం వెంకట్రావులు అన్నారు. ‘‘అసెంబ్లీ స్పీకర్ కార్యాలయ నుండి నోటీసులు ఇచ్చింది వాస్తవమే. న్యాయ నిపుణులను సంప్రదించి తగు నిర్ణయం చెప్పుతాం’’ అని మీడియాకు తెలిపారు.

స్పీకర్‌తో ఫిరాయింపు ఎమ్మెల్యేల భేటీ
ఫిరాయింపు ఎమ్మెల్యేలకు నోటీసులు అందిన వేళ.. ఆసక్తికర పరిణామం చోటు చేసుకుంది. ప్రభుత్వ సలహాదారు వేం నరేందర్ రెడ్డితో కలిసి పార్టీ మారిన ఎమ్మెల్యేలు స్పీకర్‌ను కలిశారు. భేటీలో ఎమ్మెల్యేలు అరికెపూడి గాంధీ, కాలే యాదయ్య, ప్రకాష్ గౌడ్ తదితరులు ఉన్నారు. అసెంబ్లీ సెక్రెటరీ నోటీసుల కారణంగా ఈ భేటీకి ప్రాధాన్యత సంతరించుకుంది.

Videos

రాబోయే రోజుల్లో పోలీసులు శిక్ష అనుభవించక తప్పదు..

నామినేషన్లు అడ్డుకున్న ఒక్కొక్కడికి చెప్తున్నా.. రోజా ఊర మాస్ వార్నింగ్

Nellore: అధికారుల ఓవరాక్షన్.. ఇచ్చిపడేసిన చంద్రశేఖర్ రెడ్డి

అడ్డుకోవాలని చూసారు పోలీసులకు ఇచ్చిపడేసిన రోజా

YSRCP మున్సిపల్ చైర్మన్ అభ్యర్థి రేష్మ నామినేషన్ తిరస్కరణ...

నిందితులు అరెస్ట్... టైగర్ పై ఎటాక్ అమెరికా నుంచే ప్లాన్ అమలు...

Tesla Roadster: ఎగిరే కారు.. మస్క్ మరో సంచలనం! ధర తెలిస్తే అవాక్

Penukonda: అధికారుల ఓవర్ యాక్షన్.. ఒక్క ఫోన్ కాల్ తో దుమ్ముదులిపేసిన ఉష శ్రీ చరణ్

అభిషేక్ తో పెళ్లి! శుభ్‌మన్ గిల్, అభిషేక్ శర్మపై షాకింగ్ కామెంట్స్!

శ్రీకాకుళంలో పవన్ కు బిగ్ షాక్ YSRCPలో చేరిన జనసేన యూత్

Photos

+5

రణ్‌బీర్‌ కపూర్‌, సాయిపల్లవి 'రామాయణ' మూవీ HD స్టిల్స్‌

+5

నవరాత్రి స్పెషల్.. ప్రత్యేక పూజల్లో అలియా భట్‌ (ఫొటోలు)

+5

జైలర్‌ 2 హిట్‌.. మిర్నా ఫొటోలు వైరల్‌!

+5

జిగేలుమంటున్న ప్రియాంక.. ఎల్లోరా శిల్పం కూడా తక్కువే! (ఫొటోలు)

+5

నవరాత్రి వేడుకల్లో కుందనపు బొమ్మలా మాళవిక (ఫొటోలు)

+5

కిరణ్ అబ్బవరం సినిమాతో కన్నడ బ్యూటీ టాలీవుడ్ ఎంట్రీ.. ఎవరీమె?

+5

బతుకమ్మ పండగ.. అందంగా హీరోయిన్ అనన్య (ఫొటోలు)

+5

తిరుమల : స్వర్ణరథంపై దేవదేవుడు శ్రీ వేంకటాద్రీశుడు దివ్య దర్శనం (ఫోటోలు)

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)