ఫోన్‌ ట్యాపింగ్‌ కేసు.. సుప్రీం కోర్టు కీలక వ్యాఖ్య

Published on Mon, 09/22/2025 - 11:59

సాక్షి, ఢిల్లీ: ఫోన్‌ ట్యాపింగ్‌ కేసులో సోమవారం విచారణ సందర్భంగా.. సుప్రీం కోర్టు సిట్‌కు కీలక వ్యాఖ్య చేసింది. దర్యాప్తునకు ప్రభాకర్‌ రావు సహకరించడం లేదంటూ తెలంగాణ ప్రభుత్వం తరఫున న్యాయవాదులు కోర్టు దృష్టికి తీసుకెళ్లడంపై కోర్టు స్పందించింది. 

ఫోన్‌‍ ట్యాపింగ్‌ కేసులో ఏ1 ప్రభాకర్‌ రావుకు ఇచ్చిన మధ్యంతర బెయిల్‌ను రద్దు చేయాలంటూ సిట్‌ పిటిషన్‌ వేసిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో సోమవారం విచారణ జరిగింది. తెలంగాణ ప్రభుత్వం తరపు న్యాయవాదులు సిద్ధార్థ లూథ్రా, అడిషనల్ సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా వాదనలు వినిపించారు. 

‘‘ప్రభాకర్ రావు సిట్ దర్యాప్తుకు సహకరించడం లేదు. ఫోన్ డివైస్‌లలో డాటా ఫార్మట్ చేశారు. ముందస్తు బెయిల్ పిటిషన్ పెండింగ్‌లో ఉండగానే ఫోన్ డివైస్‌లో సమాచారం ధ్వంసం చేశారని ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబొరేటరీ (FSL) నివేదిక కూడా ఇచ్చింది. జర్నలిస్టులు, జడ్జిల ఫోన్లను కూడా ఆయన టాప్ చేశారు. ప్రభుత్వ ఫోన్‌లో పాస్వర్డ్ సైతం చెప్పడం లేదు. ఈ తరుణంలో ఆయనకు అరెస్టు నుంచి కల్పించిన రక్షణను తొలగించాలి’’ అని విజ్ఞప్తి చేశారు. 

దీనికి ప్రభాకర్‌రావు తరఫు న్యాయవాది దామా శేషాద్రి నాయుడు స్పందిస్తూ.. ఇప్పటికే తన క్లయింట్‌ చాలాసార్లు సిట్‌ విచారణకు హాజరయ్యాని.. సహకరించడం లేదన్నదాంట్లో వాస్తవం లేదని అన్నారు. ఈ తరుణంలో ప్రభుత్వ ఆరోపణలపై స్పందించేందుకు రెండు వారాల సమయం కోరారాయన. దీంతో.. ఈ కేసు తదుపరి విచారణను అక్టోబర్‌ 8వ తేదీకి వాయిదా వేసింది సుప్రీం కోర్టు. 

తదుపరి విచారణ దాకా ఆయనపై ఎలాంటి బలవంతపు చర్యలు తీసుకోవద్దని చెబుతూ.. మధ్యంతర ఊరటను పొడిగించింది. అలాగే విచారణకు సహకరించాల్సిందేనని ప్రభాకర్‌రావుకు కోర్టు స్పష్టం చేసింది. అదే సమయంలో.. ఇంటరాగేట్ చేసి ఆయన నుంచి సమాచారం రాబట్టాలని సిట్‌కు సూచించింది.

Videos

CBI కి సాయి కృష్ణ కేసు.. వైఎస్ జగన్ హర్షం

స్థానిక ఎన్నికలపై ఏపీ హైకోర్టు కీలక ఆదేశాలు

కడప YSRCP అభ్యర్థిపై టీడీపీ దాడి... మేయర్ అభ్యర్థి బండి దీప్తి స్ట్రాంగ్ వార్నింగ్

మిథున్ రెడ్డి పై టీడీపీ గూండాలు దాడి.. లోకేష్ కు తోపుదుర్తి మాస్ వార్నింగ్

టీమిండియాకు బిగ్ టెన్షన్! చివరి T20.. ఎవరిది సిరీస్?

మిథున్ రెడ్డి సీరియస్ వార్నింగ్.. దాడులకు భయపడేది లేదు..!

మాట ఇచ్చి మోసం.. జనసేన కు షాక్ ఇచ్చిన మహిళా నేత

బరితెగింపు అంటే ఇదే.. నామినేషన్ తొలి రోజే తెగబడ్డ నారా గొడ్డలి

YSRCP రెండో జాబితా.. మేయర్ అభ్యర్థులు వీరే..!

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

Photos

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)