Breaking News

సీబీఐ చేతికి గట్టు వామనరావు దంపతుల కేసు

Published on Tue, 08/12/2025 - 12:08

సాక్షి, న్యూఢిల్లీ: గట్టు వామనరావు దంపతుల హత్య కేసుపై సుప్రీం కోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. ఈ కేసును సెంట్రల్‌ బ్యూరో ఆఫ్‌ ఇన్వెస్టిగేషన్‌కు అప్పగించాలని తెలంగాణ ప్రభుత్వాన్ని మంగళవారం ఆదేశించింది. ఈ క్రమంలో.. హత్య కేసును తిరిగి విచారణ జరపాలని, పిటిషనర్‌కు భద్రత కల్పించాలని సీబీఐకి సూచించింది.

హైకోర్టు లాయర్లైన వామనరావు, ఆయన సతీమణి నాగమణి దంపతులను పెద్దపల్లి జిల్లా మంథనిలో 2021 ఫిబ్రవరి 17వ తేదీన రోడ్డుపైనే కొందరు దారుణంగా హతమార్చారు. ఈ జంట హత్య తెలుగు రాష్ట్రాల్లో తీవ్ర కలకలం రేపింది. ఈ కేసులో పలువురిని అరెస్ట్‌ చేయగా.. ఇంకా దర్యాప్తు కొనసాగుతోంది. అయితే ఈ కేసును సీబీఐకి అప్పగించాలని వామనరావు తండ్రి కిషన్ రావు సుప్రీం కోర్టును ఆశ్రయించారు. 

జస్టిస్ ఎంఎం సుందరేశ్ , జస్టిస్ ఎన్ కె. సింగ్‌ల ధర్మాసనం పిటిషన్‌ను విచారించి.. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి నోటీసులు జారీ చేసింది. అలాగే హత్యకు సంబంధించిన వీడియోలు, పత్రాలు అందజేయాలని ఆదేశించింది. సీబీఐ విచారణ అవసరమా? అనే అంశంపై రికార్డులు పరిశీలించిన తర్వాత నిర్ణయం తీసుకుంటామని ధర్మాసనం తెలిపింది.

ఈలోపు.. కేసును సీబీఐకి అప్పగించేందుకు తమకు ఎలాంటి అభ్యంతరం లేదని తెలంగాణ ప్రభుత్వం తరఫున న్యాయవాది తెలిపారు. దీంతో.. సీబీఐకి కేసును బదిలీ చేస్తున్నట్లు సుప్రీం కోర్టు ఇవాళ ఆదేశాలు జారీ చేసింది.

Videos

నేను తాడిపత్రి పోతా.. ఏం పీకుతారో పీక్కోండి.. మాస్ వార్నింగ్

మరి గోరం... హీరోయిన్ ఎంగిలి చేసిన బాటిల్ ధర రూ.3 లక్షలు..!

అనంతపురం రూరల్ EX ZPTCపై పోలీసుల ఓవర్ యాక్షన్

జోగి రమేష్ హౌస్ అరెస్ట్

ఆ 15 స్థానాల్లో పోటీయే లేదు..! లైవ్ లో మొత్తం బయటపెట్టిన YS జగన్

సంచలనం రేపుతున్న ప్రశాంత్ భూషణ్ ట్వీట్

ఏం చంపుతావా? విడదల రజినీని నెట్టేసి కిందపడేసిన SI

బంగారానికి ఏమైంది? వరుసగా పడిపోతున్న ధరలు!

జగన్ లాస్ట్ పంచ్... జస్ట్ సింగిల్ డిజిట్!

పోరాడిన ప్రతి అక్కచెల్లమ్మకు హ్యాట్స్ ఆఫ్.. జగన్ ఎమోషనల్

Photos

+5

'మిస్టర్ దెయ్యం' సినిమా లాంచ్ (ఫొటోలు)

+5

వైట్ శారీలో టాలీవుడ్ అందాల భామ ఈషా రెబ్బా కొత్త ఫోటోలు

+5

‘అక్క’ ట్రైలర్‌ లాంచ్‌లో మెరిసిన హీరోయిన్‌ కీర్తి సురేశ్‌ (ఫొటోలు)

+5

గజరాజులు తిరుగు ప్రయాణం... నగరవాసుల భావోద్వేగం

+5

'ఐఫా'అవార్డుల విలేకరుల సమావేశంలో బాలీవుడ్ నటులు సందడి (ఫొటోలు)

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా సద్దుల బతుకమ్మ (ఫొటోలు)

+5

హైదరాబాద్ : ఎగ్జిబిషన్‌ మైదానంలో సందడిగా దత్తన్న అలయ్‌ బలయ్‌ (ఫొటోలు)

+5

ప్రభాస్ హీరోయిన్ కొత్త ఫొటోలు! (ఫొటోలు)

+5

సన్ ఫ్లవర్ తో రితికా నాయక్‌ (ఫొటోలు)

+5

సంజూ, నమన్ మెరుపులు.. ఓడిపోయే మ్యాచ్‌లో గెలిచిన భారత్ (ఫొటోలు)