Breaking News

తెలంగాణ బీజేపీకి షాకిచ్చిన సుప్రీంకోర్టు

Published on Mon, 09/08/2025 - 11:54

సాక్షి, ఢిల్లీ: సుప్రీంకోర్టులో తెలంగాణ బీజేపీకి చుక్కెదురైంది. ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డికి వ్యతిరేకంగా దాఖలైన పరువు నష్టం దావా కేసుపై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. ఇదే సమయంలో రాష్ట్ర బీజేపీ దాఖలు చేసిన పిటిషన్‌ను సుప్రీంకోర్టు కొట్టివేసింది.

వివరాల ప్రకారం.. ఎన్నికల ప్రచారంలో భాగంగా బీజేపీ అధికారంలోకి వస్తే రాజ్యాంగాన్ని మారుస్తున్నారని, రిజర్వేషన్లను ఎత్తివేస్తారని రేవంత్‌ రెడ్డి వ్యాఖ్యలు చేశారు. ఈ క్రమంలో రేవంత్‌ వ్యాఖ్యలపై తెలంగాణ బీజేపీ.. సుప్రీంకోర్టులో పరువు నష్టం దావా పిటిషన్‌ దాఖలు చేసింది. తాజాగా బీజేపీ పిటిషన్‌పై సుప్రీంకోర్టు చీఫ్‌ జస్టిస్‌ బీఆర్‌. గవాయ్‌ ఆగ్రహం వ్యక్తం చేశారు. రాజకీయాలకు కోర్టులను వేదికగా చేసుకోవద్దు అని హితవు పలికారు. రాజకీయ నాయకులు వీటిని గట్టిగా ఎదుర్కోవాలి. రాజకీయపరమైన వ్యాఖ్యలు రాజకీయ స్ఫూర్తితోనే ఎదుర్కోవాలి అని వ్యాఖ్యానించారు. చివరగా.. పది లక్షల జరిమానా విధిస్తామని బీజేపీని హెచ్చరించారు. అనంతరం, పిటిషన్‌ను కొట్టివేశారు.

ఇదిలా ఉండగా.. గతంలో ఇదే విషయంపై బీజేపీ పిటిషన్‌ను తెలంగాణ హైకోర్టు సైతం కొట్టివేసింది. దీంతో, రాష్ట్ర బీజేపీ.. హైకోర్టు ఉత్తర్వులను సుప్రీంకోర్టులో సవాల్‌ చేసింది. తాజాగా మరోసారి బీజేపీకి ఎదురుదెబ్బ తగిలింది. 

Videos

EXCLUSIVE VISUALS: చేతికి గాయాలతో మిథున్ రెడ్డి

బంగారం కొనేవారికి గుడ్ న్యూస్! ఇవాళ తులం ఎంతంటే

మిథున్ రెడ్డిపై దాడి.. పెద్దిరెడ్డి స్టాంగ్ రియాక్షన్

దాడి తర్వాత గాయాలతో మిథున్ రెడ్డి

మిథున్ రెడ్డి కార్లన్నీ ధ్వంసం

ఆ యంగ్ హీరోతో మమితా వివాహం.. క్లారిటీ ఇచ్చిన హీరోయిన్

పవన్ పై రగిలిపోతున్న జనసేన కేడర్...!

మిథున్ రెడ్డిపై హత్యాయత్నం.. కత్తులు, రాళ్లు, కర్రలతో కాన్వాయ్ పై దాడి

రామచంద్రాపురంలో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన టీడీపీ సీనియర్ నేతలు

అట్లాంటిక్ సముద్రం అడుగున పెను విధ్వంసం! శాస్త్రవేత్తల షాకింగ్ హెచ్చరిక!

Photos

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)

+5

తిరుమల : కల్పవృక్ష వాహనంపై శ్రీ మలయప్పస్వామి కటాక్షం (ఫొటోలు)