Breaking News

ఫోన్‌ట్యాపింగ్‌ కేసులో ఫస్ట్‌ బెయిల్‌..తెలంగాణ సర్కారుకు ‘సుప్రీం’ షాక్‌

Published on Mon, 01/27/2025 - 12:10

సాక్షి,న్యూఢిల్లీ : సంచలనం సృష్టించిన ఫోన్‌ట్యాపింగ్‌ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ కేసులో తొలిసారి తెలంగాణ సర్కారుకు గట్టి షాక్‌ తగిలింది. కేసులో ప్రధాన నిందితుల్లో ఒకరికి మొదటిసారి బెయిల్‌ లభించింది.  కేసులో కీలక నిందితుల్లో ఒకరిగా ఉన్న అడిషనల్‌ ఎస్పీ తిరుపతన్నకు సుప్రీంకోర్టు బెయిల్‌ మంజూరు చేసింది.

 తిరుపతన్న బెయిల్‌ పిటిషన్‌ను జస్టిస్ బివి నాగరత్న,జస్టిస్ సతీష్ చంద్ర శర్మలతో కూడిన సుప్రీం  ధర్మాసనం సోమవారం(జనవరి27) విచారించింది. బెయిల్‌పై విడుదలైన తర్వాత కేసు విచారణకు సహకరించాలని బెయిల్‌ ఇచ్చిన సందర్భంగా తిరుపతన్నను సుప్రీంకోర్టు ఆదేశించింది. సాక్షులను ప్రభావితం చేయొద్దని,అవసరం అయితే ట్రయల్ కోర్టు బెయిల్‌పై మరిన్ని షరతులు విధించాలని సూచించింది. కాగా, తిరుపతన్న బెయిల్‌ను తెలంగాణ ప్రభుత్వం వ్యతిరేకించింది.

ఈ కేసులో ఇంకా సాక్షులను విచారించాలని,దర్యాప్తు కొనసాగుతున్న నేపథ్యంలో కీలక నిందితుల్లో ఒకరైన తిరుపతన్నకు బెయిల్ ఇవ్వొద్దని తెలంగాణ ప్రభుత్వం తరపు న్యాయవాది సిద్ధార్థ లూత్రా కోర్టును కోరారు. ఫోన్ ట్యాపింగ్‌ కేసులో తిరుపతన్న పది నెలలుగా జైలులో ఉన్నారు. 

ఫోన్‌ట్యాపింగ్‌ కేసులో మరో ప్రధాన నిందితుడు టాస్క్‌ఫోర్స్‌ మాజీ డీసీపీ రాధాకిషన్‌రావు ఇప్పటికీ జైలులోనే ఉన్నారు. ఫోన్‌ ట్యాపింగ్‌కు నేతృత్వం వహించారని ఆరోపణలున్న టాస్క్‌ఫోర్స్‌ మాజీ చీఫ్‌ ప్రభాకర్‌రావు ప్రస్తుతం అమెరికాలో ఉన్నారు. ఆయనను రప్పించేందుకు తెలంగాణ ప్రభుత్వం ఇంటర్‌పోల్‌ ద్వారా ప్రయత్నిస్తున్న విషయం తెలిసిందే. 

Videos

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

బీహార్ తలదించుకునేలా ఏపీ లో రెడ్ బుక్ అరాచకాలు

లోకేష్ ఈ రోజుని గుర్తు పెట్టుకుంటున్నాం... మిథున్ రెడ్డి, భూమన మాస్ వార్నింగ్

BIGG BOSS లీక్స్.. ఈ వీక్ CAPTAIN అతనే..?

షాకిస్తోన్న జైలర్ 2... రజనీ రెమ్యునరేషన్ తో 4 సినిమాలు..!

విజయనగరం జిల్లాలో టీడీపీ నాయకుల రాజీనామా

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

Photos

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)