అన్నయ్యా.. ఇలాంటి పుట్టినరోజులు నువ్వు మరెన్నో చేసుకోవాలి

Published on Thu, 07/24/2025 - 10:40

భారత రాష్ట్ర సమితి వర్కింగ్‌ ప్రెసిడెంట్‌, మాజీ మంత్రి కల్వకుంట్ల తారకరామారావు పుట్టినరోజు నేడు(జులై 24). ఈ సందర్భంగా బీఆర్‌ఎస్‌ శ్రేణుల్లో కోలాహలం నెలకొంది. పార్టీ నేతలతో పాటు రాజకీయ, సినీ ప్రముఖలు ఆయనకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు.  తాజాగా.. ఆయన సోదరి, ఎమ్మెల్సీ కవిత సోషల్‌ మీడియా వేదికగా శుభాకాంక్షలు తెలియజేశారు.

‘‘అన్నయ్యా.. ఇలాంటి పుట్టినరోజులు నువ్వు మరెన్నో చేసుకోవాలి’’ అని పోస్ట్‌ చేశారామె. కవితకు, కేటీఆర్‌కు మధ్య గతకొంతకాలంగా నెలకొన్న గ్యాప్‌ సంగతి తెలిసిందే. 

తండ్రి, బీఆర్‌ఎస్‌ అధినేత కేసీఆర్‌కు రాసిన లేఖలో.. కేవలం ట్వీట్లు చేయడంతోనే ఆగిపోకూడదంటూ కేటీఆర్‌ను ఉద్దేశించి ఆమె విమర్శలులు గుప్పించారు. అదే సమయంలో పార్టీ విషయాలు అంతర్గతంగా మాట్లాడితేనే మంచిదంటూ కవితకు కేటీఆర్‌ చురకలంటించారు. ఈ క్రమంలో సోదరుడి పుట్టినరోజు సందర్భంగా ఆమె చేసిన ట్వీట్‌ ఇప్పుడు చర్చనీయాంశమైంది.

తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి కేటీఆర్‌కు జన్మదిన శుభాకాంక్షలు చెప్పినట్లు సీఎంవో అధికారిక ఖాతా ద్వారా తెలియజేసింది.

కేటీఆర్‌ ఫ్లెక్సీల తొలగింపు
కేటీఆర్‌ పుట్టినరోజు సందర్భంగా హైదరాబాద్‌లో బీఆర్‌ఎస్‌ శ్రేణులు ఫ్లెక్సీల ఏర్పాటు చేశాయి. అయితే జీహెచ్‌ఎంసీ వాటిని తొలగిస్తోంది. ఈ చర్యపై బీఆర్‌ఎస్‌ వర్గాలు తీవ్రస్థాయిలో మండిపడుతోంది.

ఇదీ చదవండి: నాతో పెట్టుకోవద్దు.. కేటీఆర్‌పై విరుచుకుపడ్డ కవిత! 

Videos

కాంగ్రెస్ అధిష్టానానికి మంత్రి దామోదర బిగ్ షాక్

అమెరికాలో మరోసారి కాల్పుల కలకలం..చిన్నారులు మృతి

కేంద్ర ఎన్నికల సంఘం ముందుకు 9 సూటి ప్రశ్నలు...?

మున్సిపల్ ఎన్నికల్లో పోటీ చేస్తే చంపేస్తాం.. జేసీ అనుచరుల బెదిరింపులు

ఏలూరు మేయర్ పీఠాన్ని జనసేనకు.. తెలుగు తమ్ముళ్లు ఆగ్రహం.. మొత్తం ఒకేసారి రాజీనామా..

కుక్కకు ఇచ్చిన గౌరవం కూడా జనసేనకు లేదా? వంగవీటి నరేంద్ర కీలక వ్యాఖ్యలు

నాకు తెలిసి పార్టీ మరడం అంటే అధికార పక్షం నుండి ప్రతిపక్షంలోకి వెళ్తారు కానీ..

విశాఖ మేయర్ అభ్యర్థిగా ప్రకటించిన తరువాత వరుదు కళ్యాణి ఫస్ట్ రియాక్షన్

అడ్డంగా నామాలు, తడి బట్టలు.. ధర్మాన్ని, మతాన్ని కాపాడుతా అంటూ.. పవన్ పై వల్లభనేని వంశీ సెటైర్లు

Audio Leak: మీతో గెలవలేం.. దయచేసి పోటీ చేయొద్దు.. YSRCP లీడర్ తో మంత్రి రాంప్రసాద్ రెడ్డి

Photos

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)

+5

తిరుమల : కల్పవృక్ష వాహనంపై శ్రీ మలయప్పస్వామి కటాక్షం (ఫొటోలు)

+5

సందీప్ కిషన్ కొత్త సినిమా 'కరికాల' సినిమా ప్రారంభోత్సవం (ఫొటోలు)

+5

ఇటలీ ట్రిప్‌లో కిరణ్ అబ్బవరం సతీమణి రహస్య గోరఖ్.. (ఫోటోలు)

+5

ఇంద్రకీలాద్రిపై వైభవంగా దసరా శరన్నవరాత్రి ఉత్సవాలు (ఫొటోలు)