Breaking News

సిట్‌ నోటీసులపై కేసీఆర్‌ ఏమన్నారంటే..

Published on Thu, 01/29/2026 - 16:26

సాక్షి,హైదరాబాద్‌: తెలంగాణలో రాజకీయ ప్రకంపనలు రేపుతున్న ఫోన్‌  ట్యాపింగ్‌ కేసులో బీఆర్‌ఎస్‌ అధినేత, మాజీ సీఎం కేసీఆర్‌కు సిట్‌ నోటీసులు అందించారు. ఆ నోటీసులకు కేసీఆర్‌ స్పందించినట్లు తెలుస్తోంది

సిట్‌ విచారణకు గడువు కోరే యోచనలో కేసీఆర్‌ ఉన్నట్లు సమాచారం. మూడు రోజుల తర్వాత లేదా మున్సిపల్‌ ఎన్నికల తర్వాత విచారణకు వెళ్లాలనే యోచనలో కేసీఆర్‌ ఉన్నట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం. ఈ క్రమంలో రేపు సిట్‌ విచారణకు హాజరు అవ్వాలా? వద్దా?. సమయం కోరాలా? అన్న అంశంపై చర్చించేందుకు  కాసేపట్లో ఎర్రవల్లిలోని ఫామ్‌ హౌస్‌లో ముఖ్యనేతలు, లీగల్‌సెల్‌తో కేసీఆర్‌ సమావేశం కానున్నారు. సమావేశం అనంతరం గడువుకోరే అంశంపై స్పష్టత రానుంది. ఈ సమావేశంలో పాల్గొనేందుకు కేటీఆర్‌,హరీష్‌ రావులు ఫామ్‌ హౌస్‌కు బయల్దేరారు

ఇదిలా ఉంటే ఫోన్‌ ట్యాపింగ్‌ కేసులో శుక్రవారం మధ్యాహ్నం 3గంటలకు విచారణ చేపట్టేందుకు సిట్‌ బృందం ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలుస్తోంది.కొద్ది సేపటి క్రితం నంది నగర్‌లోని కేసీఆర్‌ నివాసానికి పోలీసులు వెళ్లారు. నందినగర్‌లోని తన నివాసంలో కేసీఆర్‌ను విచారించాల్సి వస్తే.. భద్రతా ఏర్పాట్లను పరిశీలించేందుకు వచ్చినట్లు సమాచారం.

ఇప్పటికే ఫోన్‌ ట్యాపింగ్‌ కేసులో సిట్‌ అధికారులు నందినగర్‌లోని కేసీఆర్‌ పీఏకు నోటీసులు అందించారు. రేపు మధ్యాహ్నం 3గంటలకు సిట్‌ ఎదుట విచారణకు హాజరు కావాలని అందులో పేర్కొన్నారు. అయితే, వయస్సు రిత్యా  జూబ్లీహిల్స్‌ పోలీస్‌ స్టేషన్‌లో విచారణకు మినహాయింపు ఇచ్చారు. కేసీఆర్‌ ఎక్కడ కోరుకుంటే అక్కడ విచారణ చేపడతామని అన్నారు. 

SIT విచారణకు గడువు కోరే యోచనలో KCR

Videos

రణబాలి ..బాహుబలి కంటే బాగుంది.. “గూస్ బంప్స్” తెప్పించేశాడు

మిధున్ రెడ్డిపై దాడి వైఎస్ జగన్ స్టాంగ్ రియాక్షన్

టీమిండియాకు బిగ్ షాక్.. డిసైడర్ మ్యాచ్ కు అర్ష్ దీప్ దూరం?

టీడీపీ నుంచి జనసేనలోకి జంప్.. తుని చైర్మన్ అభ్యర్థిగా మీనాక్షి..!

కూటమి భయపడే ఇలా చేస్తుంది

TDP అరాచకాలకు ఇది పరాకాష్ట ... ఎమోషనల్ అయిన గడికోట శ్రీకాంత్

నేల అడుగున రహస్య యుద్ధం ఏటా 3 కోట్లు బలి! అది ఏంటో తెలుసుకోండి

గెలవాలంటే బుద్దోడిని ఆడించండి: Kris Srikkanth

భయంకరమైన మంటల్లో నుంచి శ్రీకాంత్ రెడ్డిని కాపాడిన కార్యకర్తలు

ప్రాణాలతో బయటపడిన తర్వాత శ్రీకాంత్ రెడ్డి ఫస్ట్ రియాక్షన్

Photos

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)