Breaking News

సంక్రాంతికి పల్లె బాట.. ఒక్కసారిగా పెరిగిన వాహనాల రద్దీ

Published on Sat, 01/10/2026 - 16:48

సాక్షి, హైదరాబాద్‌: సంక్రాంతి పండుగ సందర్భంగా హైదరాబాద్ నగరవాసులు పల్లెలకు క్యూ కట్టారు. ఏపీకి వెళ్లే వారి వాహనాలతో హైదరాబాద్ - విజయవాడ జాతీయ రహదారి కిక్కిరిసిపోయింది. ఇవాళ సాయంత్రం ఒక్కసారిగా వాహనాల రద్దీ పెరిగిపోయింది. యాదాద్రి జిల్లా పంతంగి టోల్‌ ప్లాజా దగ్గర భారీగా ట్రాఫిక్‌ జామ్‌ ఏర్పడింది. పంతంగి టోల్‌ప్లాజా దగ్గర భారీగా వాహనాలు నిలిచిపోయాయి.

ఇబ్రహీంపట్నం సర్కిల్ వద్ద..
ఎన్టీఆర్ జిల్లా ఇబ్రహీంపట్నం సర్కిల్ వద్ద వాహనాల రద్దీ పెరిగింది. ట్రాఫిక్ జామ్‌తో కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచిపోయాయి. హైదరాబాద్... విజయవాడ హైవే ఇబ్రహీంపట్నం వద్ద వాహనాలు నిదానంగా కదులుతున్నాయి. ట్రాఫిక్ ఆంక్షలతో ప్రయాణికులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. నేడు, రేపు(శని, ఆది) ట్రాఫిక్ మరింత పెరిగే అవకాశం ఉందని.. ట్రాఫిక్ సమస్యలు తలెత్తకుండా చర్యలు తీసుకుంటున్నామని సీఐ చంద్రశేఖర్ అన్నారు.

హైదరాబాద్‌లో పలు చోట్ల భారీగా ట్రాఫిక్‌ జామ్..
హైదరాబాద్‌లో పలు చోట్ల భారీగా ట్రాఫిక్‌ జామ్‌ ఏర్పడింది. సిటీ కాలేజీ, ఎంజే మార్కెట్‌, బేగంబజార్‌, హైకోర్టు, ఆఫ్జల్‌గంజ్‌, నయాపూల్‌ భారీగా ట్రాఫిక్‌ ఏర్పడింది. వీకెండ్‌ సంక్రాంతి సెలవులు, ఎగ్జిబిషన్‌ కారణంగా రద్దీ నెలకొంది.

విజయవాడలో..
పండిట్ నెహ్రూ బస్టాండ్ ప్రయాణికులతో కిటకిటలాడుతోంది. సంక్రాంతికి సొంత గ్రామాలకు ప్రజలు ప్రయాణమయ్యారు. స్కూళ్లు, కాలేజీలకు సెలవులు కావడంతో రద్దీ పెరిగింది. ఇవాళ ఉదయం నుండి ప్రయాణికులతో బస్టాండ్లు రద్దీగా మారాయి.

 

Videos

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

బీహార్ తలదించుకునేలా ఏపీ లో రెడ్ బుక్ అరాచకాలు

లోకేష్ ఈ రోజుని గుర్తు పెట్టుకుంటున్నాం... మిథున్ రెడ్డి, భూమన మాస్ వార్నింగ్

BIGG BOSS లీక్స్.. ఈ వీక్ CAPTAIN అతనే..?

షాకిస్తోన్న జైలర్ 2... రజనీ రెమ్యునరేషన్ తో 4 సినిమాలు..!

విజయనగరం జిల్లాలో టీడీపీ నాయకుల రాజీనామా

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

Photos

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)