సర్‌.. బేఖాతర్‌!

Published on Mon, 07/20/2026 - 01:33

సాక్షి, హైదరాబాద్‌: ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (ఎస్‌ఐఆర్‌)పై అసెంబ్లీ, పార్లమెంటు నియోజకవర్గాల వారీగా ఇన్‌చార్జిలు, సమన్వయకర్తల నియామకం. గాంధీభవన్‌లో ప్రత్యేక వ్యవస్థ. ‘ఎస్‌ఐఆర్‌ను సీరియస్‌గా తీసుకోండి.. లేదంటే మీ స్థానంలో కొత్తవారు వస్తారు.. అవసరమైతే మీ జిల్లాలు మార్చేందుకు కూడా వెనుకాడను..’ అంటూ ఎమ్మెల్యేలకు, ఇన్‌చార్జి మంత్రులకు సీఎం రేవంత్‌రెడ్డి హెచ్చరికలు. ఎమ్మెల్యేలు, మంత్రులు, ఎమ్మెల్సీలు, ఎంపీలతో పాటు డీసీసీ అధ్యక్షుల నుంచి రాష్ట్ర పార్టీ వ్యవహారాల ఇన్‌చార్జి మీనాక్షి సమాచార సేకరణ. పీసీసీ అధ్యక్షుడు మహేశ్‌కుమార్‌గౌడ్‌ ఎప్పటికప్పుడు తీసుకుంటున్న చర్యలు. దేశంలోని పలు రాష్ట్రాల్లో ఎస్‌ఐఆర్‌ నిర్వహించిన తర్వాత వచ్చిన ఫలితాలు.. ‘ఇవేవీ కూడా అధికార కాంగ్రెస్‌ పార్టీ ఎమ్మెల్యేలకు పట్టడం లేదు. 

కేంద్ర ఎన్నికల సంఘం నిర్వహిస్తున్న ‘సర్‌’పై ప్రత్యేక దృష్టి సారించాలని పార్టీ పక్షాన పదేపదే చెబుతున్నా మంత్రులతో సహా ఎమ్మెల్యేలు కూడా ఖాతరు చేయడం లేదు..’ అని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి వద్ద ఉన్న నివేదికలు స్పష్టం చేస్తున్నట్లు సమాచారం. రాష్ట్రంలో మొత్తం 66 మంది కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలుండగా, అధికారం ఉండి కూడా వారి వారి నియోజకవర్గాల్లో ఎస్‌ఐఆర్‌ ప్రక్రియపై పార్టీ శ్రేణులను కార్యోన్ముఖులను చేయలేకపోతున్నారని అవి పేర్కొంటున్నట్లు తెలిసింది. విశ్వసనీయ సమాచారం ప్రకారం.. ఆదివారం పార్టీ నేతలతో జరిగిన జూమ్‌ సమావేశంలో ఎస్‌ఐఆర్‌ ప్రక్రియపై కాంగ్రెస్‌ పార్టీ కేడర్‌ పనితీరును గురించి అసెంబ్లీ నియోజకవర్గాల వారీగా తన వద్ద ఉన్న నివేదికను నాలుగు కేటగిరీల్లో సీఎం రేవంత్‌ చదివి వినిపించారు.  

ఇతర పార్టీల ఎమ్మెల్యేలున్న 11 చోట్ల ముందంజ 
ఈ నివేదిక ప్రకారం 41 మంది పార్టీ ఎమ్మెల్యేలు మాత్రమే ఎస్‌ఐఆర్‌పై పూర్తి స్థాయిలో దృష్టి కేంద్రీకరించి పనిచేస్తున్నారు. 11 చోట్ల పర్వాలేదనే స్థాయిలో పనిచేస్తుండగా, 14 స్థానాల్లో మాత్రం పెద్దగా పట్టించుకోవడం లేదని, మరో 4 స్థానాల్లో అసలు కాంగ్రెస్‌ పార్టీ కేడర్‌ జాడ కూడా లేదని వెల్లడయింది. ఇతర పార్టీల ఎమ్మెల్యేలున్న మరో 11 చోట్ల పార్టీ ఇన్‌చార్జిల ఆధ్వర్యంలో ఎస్‌ఐఆర్‌ కార్యక్రమాలు జరుగుతున్నాయని తేలింది. మొత్తం మీద పార్టీ ఎమ్మెల్యేలు ప్రాతినిధ్యం వహిస్తున్న మొత్తం నియోజకవర్గాల్లో 60 శాతం స్థానాల్లో మాత్రమే ఎస్‌ఐఆర్‌ కార్యక్రమం చురుగ్గా సాగుతోందని వెల్లడైంది. ఎస్‌ఐఆర్‌ విషయంలో బాగా పనిచేస్తున్న నియోజకవర్గాల జాబితాలో కొడంగల్, మధిర, ఆంధోల్, కొల్లాపూర్‌ తదితర నియోజకవర్గాలుండగా, పెద్దగా పనిచేయని నియోజకవర్గాల జాబితాలో హుజూర్‌నగర్, పర్వాలేదనే స్థాయిలో పనిచేస్తున్న స్థానాల్లో ధర్మపురి ఉండటం గమనార్హం. 

రాష్ట్రంలోని 89 నియోజకవర్గాలపై కాంగ్రెస్‌ పార్టీ అంచనా ఇది: 
బాగా పనిచేస్తున్న నియోజకవర్గాలు: 
అచ్చంపేట, ఆదిలాబాద్, ఆలేరు, అంబర్‌పేట, ఆంధోల్, అశ్వారావుపేట, బెల్లంపల్లి, భువనగిరి, భూపాలపల్లి, బోధ్, చెన్నూరు, దేవరకొండ, డోర్నకల్, స్టేషన్‌ ఘన్‌పూర్, గోషామహల్, హుస్నాబాద్, హుజూరాబాద్, జడ్చర్ల, జగిత్యాల, కల్వకుర్తి, కామారెడ్డి, కరీంనగర్, ఖైరతాబాద్, కొడంగల్, ఖమ్మం, కొల్లాపూర్, కొత్తగూడెం, మధిర, మహబూబాబాద్, మహబూబ్‌నగర్, మానకొండూరు, మంచిర్యాల, మంథని, మిర్యాలగూడ, ములుగు, నాగార్జున సాగర్, నకిరేకల్, నల్లగొండ, నారాయణ్‌ ఖేడ్, నిజామాబాద్‌ రూరల్, అర్బన్, పాలకుర్తి, పరకాల, రామగుండం, సంగారెడ్డి, సిర్పూర్, తాండూరు, వేములవాడ, వనపర్తి, వరంగల్‌ వెస్ట్, వర్థన్నపేట, ఇల్లెందు.  

పర్వాలేదనే స్థాయిలో పనిచేస్తున్న స్థానాలు:  
బాన్సువాడ, చొప్పదండి, ధర్మపురి, కోదాడ, మల్కాజిగిరి, మునుగోడు, ముషీరాబాద్, నారాయణపేట, నర్సంపేట, పరిగి, కుత్బుల్లాపూర్, సత్తుపల్లి, శేరిలింగంపల్లి, తుంగతుర్తి, సూర్యాపేట, జహీరాబాద్‌.  

సరిగా పనిచేయని నియోజకవర్గాలు:  
బాల్కొండ, బోధన్‌ , చేవెళ్ల, గజ్వేల్, హుజూర్‌నగర్, చార్మినార్, ఇబ్రహీంపట్నం, కూకట్‌పల్లి, ముథోల్, నిర్మల్, పినపాక, రాజేంద్రనగర్, ఉప్పల్, ఎల్లారెడ్డి, గజ్వేల్, నర్సంపేట, యాకుత్‌పుర.  

అసలు దృష్టి పెట్టని స్థానాలు:  
ఆలంపూర్, ఆర్మూర్, ఆసిఫాబాద్, బహుదూర్‌పుర.    

Videos

అమెరికాలో మరోసారి కాల్పుల కలకలం..చిన్నారులు మృతి

కేంద్ర ఎన్నికల సంఘం ముందుకు 9 సూటి ప్రశ్నలు...?

మున్సిపల్ ఎన్నికల్లో పోటీ చేస్తే చంపేస్తాం.. జేసీ అనుచరుల బెదిరింపులు

ఏలూరు మేయర్ పీఠాన్ని జనసేనకు.. తెలుగు తమ్ముళ్లు ఆగ్రహం.. మొత్తం ఒకేసారి రాజీనామా..

కుక్కకు ఇచ్చిన గౌరవం కూడా జనసేనకు లేదా? వంగవీటి నరేంద్ర కీలక వ్యాఖ్యలు

నాకు తెలిసి పార్టీ మరడం అంటే అధికార పక్షం నుండి ప్రతిపక్షంలోకి వెళ్తారు కానీ..

విశాఖ మేయర్ అభ్యర్థిగా ప్రకటించిన తరువాత వరుదు కళ్యాణి ఫస్ట్ రియాక్షన్

అడ్డంగా నామాలు, తడి బట్టలు.. ధర్మాన్ని, మతాన్ని కాపాడుతా అంటూ.. పవన్ పై వల్లభనేని వంశీ సెటైర్లు

Audio Leak: మీతో గెలవలేం.. దయచేసి పోటీ చేయొద్దు.. YSRCP లీడర్ తో మంత్రి రాంప్రసాద్ రెడ్డి

పవన్ పరువు పాయే.. పావలా సీట్లు కూడా ఇవ్వని లోకేష్.. జనసేన జీరో

Photos

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)

+5

తిరుమల : కల్పవృక్ష వాహనంపై శ్రీ మలయప్పస్వామి కటాక్షం (ఫొటోలు)

+5

సందీప్ కిషన్ కొత్త సినిమా 'కరికాల' సినిమా ప్రారంభోత్సవం (ఫొటోలు)

+5

ఇటలీ ట్రిప్‌లో కిరణ్ అబ్బవరం సతీమణి రహస్య గోరఖ్.. (ఫోటోలు)

+5

ఇంద్రకీలాద్రిపై వైభవంగా దసరా శరన్నవరాత్రి ఉత్సవాలు (ఫొటోలు)