Breaking News

మహిళ జుట్టు పట్టుకొని ఈడ్చుకెళ్లిన కానిస్టేబుల్‌

Published on Sat, 09/19/2026 - 01:06

సాక్షి, హైదరాబాద్‌: హఫీజ్‌పేట రైల్వే స్టేషన్ పరిధిలో అమానుష ఘటన చోటుచేసుకుంది. మియాపూర్‌-హఫీజ్‌పేట రైల్వే స్టేషన్ సమీపంలో ఒక మహిళను రైల్వే పోలీస్ కానిస్టేబుల్ విచక్షణారహితంగా కొట్టడమే కాకుండా, ఆమె జుట్టును పట్టుకొని నేలపై ఈడ్చుకుంటూ వెళ్లడం గమనార్హం. అయితే మహిళను కొట్టడం వెనుక కారణాలు ఏంటనే దానిపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. 

అయితే సదరు మహిళను రైల్వే కానిస్టేబుల్‌ ఈడ్చుకెళుతున్న సమయంలో భర్త, కూతురు ఆమెను వదిలేయాలంటూ కానిస్టేబుల్‌ను వేడుకున్నారు. కానీ మాట వినిపించుకోని కానిస్టేబుల్‌ వాళ్లను నెట్టివేసి ఆమెను తన వాహనం వద్దకు ఈడ్చుకెళ్లాడు. దీనికి సంబంధించిన దృశ్యాలు సామాజిక మాధ్యమాల్లో వైరల్‌ అయ్యాయి.

ఇక, ఈ ఘటనకు సంబంధించిన వీడియోపై బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ ఎక్స్‌ వేదికగా స్పందించారు. తెలంగాణ పోలీసుల తీరుపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తూ.. ‘ఇది తెలంగాణ పోలీసుల దారుణ ప్రవర్తన. మీరు చర్యలు తీసుకుంటారని ఆశిస్తున్నాను’ అంటూ తెలంగాణ డీజీపీని ట్యాగ్‌ చేశారు.

ఇదీ చదవండి: టీ20 క్రికెట్‌లో ష‌ఫాలీ వ‌ర్మ అరుదైన ఫీట్‌

Videos

బంగాళాఖాతంలో మరో అల్పపీడనం

చంద్రబాబుపై వైఎస్ జగన్ సంచలన ట్వీట్

అప్పిరెడ్డికి భద్రత కూడా కల్పించలేమన్న జైలు అధికారులు

చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి బర్త్ డే సెలెబ్రేషన్స్

రామాయణ రికార్డుల జాతర

రామాయణం చిత్రంపై రామ్ గోపాల్ వర్మ ఆసక్తికర పోస్ట్

బంగారం కొనాలా? వద్దా? రానున్న 15 రోజుల్లో ఏం జరగబోతుందంటే?

జైల్లోలేళ్ల అప్పి రెడ్డిని పరామర్శించిన అంబటి రాంబాబు

YSRCP ఏజెంట్లపై TDP నేతల దాడి.. రమేష్ గౌడ్ పరామర్శ

అత్తను పెండ్లి చేసుకున్న అల్లుడు

Photos

+5

రకుల్‌ ప్రీత్‌ సింగ్‌ స్టన్నింగ్‌ ఫోటోలు

+5

దివాళీ వేళ మెరిసిన తారలు (ఫోటోలు)

+5

19 ఏళ్లకొకసారే ఇలా.. మంజుల బర్త్ డే సెలబ్రేషన్ (ఫొటోలు)

+5

శ్రీకాంత్ కూతురిని చూశారా? ఎలా మెరిసిపోతోందో? (ఫొటోలు)

+5

జపాన్‌లో అత్తమామలతో కలిసి రష్మిక సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

టాలీవుడ్ సెలబ్రిటీస్ ఇంట్లో సందడిగా దీపావళి వేడుకలు (ఫొటోలు)

+5

బర్త్ డే ప్లస్ దీపావళి.. ఫ్యామిలీతో అనసూయ సెలబ్రేషన్ (ఫొటోలు)

+5

దివాళి ఫొటోలు పంచుకున్న భూమిక, ప్రగ్యా జైస్వాల్ (ఫొటోలు)

+5

దివాళి వేళ.. అనుపమ (ఫోటోలు)

+5

జాన్వీ ప్లాన్ చేసిన ఖుషి కపూర్ బర్త్ డే సెలబ్రేషన్ (ఫొటోలు)