Breaking News

ప్రభాకర్‌రావే కీలకం.. బెయిల్‌ ఇవ్వొద్దు

Published on Mon, 04/07/2025 - 20:18

హైదరాబాద్‌, సాక్షి: ఫోన్‌ ట్యాపింగ్‌ కేసులో ఇవాళ కీలక పరిణామం ఒకటి చోటు చేసుకుంది.  ఈ కేసులో ఏ1 నిందితుడు,  స్పెషల్‌ ఇంటెలిజెన్స్‌ బ్రాంచ్‌(SIB) మాజీ చీఫ్‌ ప్రభాకర్‌ రావు బెయిల్‌ పిటిషన్‌పై సోమవారం తెలంగాణ హైకోర్టులో వాదనలు జరిగాయి.  ఈ పిటిషన్‌పై పోలీసులు తరఫున కౌంటర్‌ దాఖలు చేసిన పబ్లిక్‌ ప్రాసిక్యూటర్‌.. వివిధ కారణాలను ప్రస్తావిస్తూ నిందితుడికి బెయిల్‌ ఇవ్వొద్దని వాదించారు.

కౌంటర్‌ కాపీలో ఏముందంటే.. ఫోన్‌ ట్యాపింగ్‌ వ్యవహారంలో ప్రభాకర్‌రావే కీలకం. ఎస్‌ఐబీలో ఎస్‌వోటీ(Special Operations Team)ని నెలకొల్పింది ఇతనే. ప్రభాకర్‌రావు ఆధ్వర్యంలోనే ఎస్‌వోటీ  పనిచేసింది. ఫోన్‌ట్యాపింగ్‌కే ప్రధాన లక్ష్యంగా విధులు నిర్వహించింది. ట్యాపింగ్‌ బాధితుల్లో ప్రతిపక్షాలకు చెందిన వాళ్లను, కొందరు అధికారులు, వ్యాపారులు, రియల్టర్లను బెదిరించి డబ్బు వసూలు చేశారు. అంతేకాదు..

.. ఓఎస్‌డీగా ఇతర అధికారులకు తప్పుడు డాక్యుమెంట్లతో ప్రమోషన్లు ఇప్పించారు. ఐపీఎస్‌ అధికారిగా విరమణ పొంది చట్టపరంగా దర్యాప్తునకు సహకరించడం లేదు. ఇంటర్‌పోల్‌ రెడ్‌ కార్నర్‌ నోటీసులు జారీ చేయడంతో విధిలేక హైకోర్టుకు వచ్చారు. హైదరాబాద్‌ వస్తున్నానని గతంలో ట్రయల్‌కోర్టులో పిటిషన్‌ వేశారు. దాదాపు తొమ్మిది నెలలు గడిచినా నిందితుడు భారత్‌కు రాలేదు’’ అని ఉంది.  

బెయిల్‌ పిటిషన్‌ కొట్టివేయాలని వాదించిన పీపీ.. పోలీస్‌ దర్యాప్తునకు సహకరించేలా నిందితుడు ప్రభాకర్‌ రావుకు ఆదేశాలివ్వాలని విజ్ఞప్తి చేశారు. ఇదిలా ఉంటే.. ఈ కేసులో ఇప్పటిదాకా అరెస్టైన నిందితులందరికీ దాదాపుగా బెయిల్‌ లభించింది.

Videos

నేపాల్ లో మృత్యుంజయులు 9రోజుల తర్వాత..

పోలీసుల వివక్షను ప్రశ్నించిన కృపా లక్ష్మీ..!

ఇస్రో ఖాతాలో మరో భారీ విజయం

4 సార్లు చేతులు తిప్పి.. 4 డైలాగులు కొడితే మంత్రివి కాలేవు... బాబు కి మాస్ కౌంటర్

పాడి కౌశిక్ రెడ్డికి ఎథిక్స్ కమిటీ నోటీసులు..!

41 ఏళ్లకు జూడో సర్టిఫికెట్.. లోకేష్ స్కాం బట్టబయలు..

పోలీసుల ఓవర్ యాక్షన్.. కల్పలత రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్

ఒళ్లు దగ్గర పెట్టుకోండి..! బాబుపై చలసాని సీరియస్

కొండా సురేఖ దారెటు..!

ఇంకా ఎన్నెన్ని బయటపడతాయో? కొండా బర్తరఫ్ పై రామచంద్రరావు రియాక్షన్

Photos

+5

చిన్ని కృష్ణుడిగా కిరణ్ అబ్బవరం కొడుకు.. క్యూట్‌నెస్‌కు నెటిజన్లు ఫిదా!

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)