Breaking News

ప్రేమించిన యువతి మోసం.. పవన్ కళ్యాణ్ ఆత్మహత్య

Published on Wed, 11/26/2025 - 12:47

సాక్షి, మేడ్చల్ జిల్లా: పోచారం ఐటీ కారిడార్ పోలీస్ స్టేషన్ పరిధిలో విషాదకర ఘటన చోటుచేసుకుంది. ఇన్ఫోసిస్‌లో సాఫ్ట్‌వేర్ ఉద్యోగిగా పనిచేస్తున్న 26 ఏళ్ల పవన్ కళ్యాణ్ రెడ్డి ఆత్మహత్య చేసుకున్నాడు. 

పోలీసుల ప్రాథమిక దర్యాప్తు ప్రకారం.. గుంటూరు జిల్లా సంగడిగుంట ఐపీడీకాలనీకి చెందిన ఆటో డ్రైవర్ శ్రీనివాస్ రెడ్డి కుమారుడు పవన్ కళ్యాణ్ రెడ్డి, పోచారం ఇన్ఫోసిస్ సమీపంలోని సంస్కృతి టౌన్‌షిప్‌లో స్నేహితులతో కలిసి నివసిస్తూ గత నాలుగేళ్లుగా ఇన్ఫోసిస్‌లో ఉద్యోగం చేస్తున్నాడు. అయితే పవన్ కళ్యాణ్ ఒక యువతిని ప్రేమించేవాడు. 

ఇద్దరూ పెళ్లి చేసుకునే ఉద్దేశంతో శారీరకంగా దగ్గరైనట్లు తెలుస్తోంది. అయితే ఇటీవల ఆమె ఫోన్‌లో మరో వ్యక్తితో తీసుకున్న ఫొటోలు కనిపించడంతో పవన్ కళ్యాణ్ తీవ్రంగా అనుమానపడ్డాడు. సదరు ఫొటోలను యువతి కుటుంబ సభ్యులకు పంపించాడు. దీంతో ఆ యువతి గచ్చిబౌలి పోలీస్ స్టేషన్‌లో పవన్ కళ్యాణ్‌పై ఫిర్యాదు చేసింది.

ఆ ఘటన తర్వాత పవన్ కళ్యాణ్ రెండు రోజులుగా ఆమెకు కాల్ చేసినా స్పందించకపోవడంతో తీవ్ర మనస్తాపానికి గురయ్యాడు. సోమవారం ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఫ్యాన్‌కు ఉరి వేసుకుని బలవన్మరణానికి పాల్పడ్డాడు. స్నేహితులు ఈ విషయం అతని తండ్రికి తెలియజేయడంతో కుటుంబ సభ్యులు హుటాహుటిన నగరానికి చేరుకున్నారు.

ప్రేమించిన యువతి మోసగించిందన్న బాధతోనే నా కుమారుడు ప్రాణాలు తీసుకున్నాడు అంటూ మృతుడి తండ్రి పోచారం ఐటీ కారిడార్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దాంతో పోలీసులు కేసు నమోదు చేసి విచారణ ప్రారంభించారు.

ఇదీ చదవండి: హైదరాబాద్‌లో నకిలీ ఐఏఎస్‌ అధికారి అరెస్ట్‌

Videos

బన్నీ - జూ ఎన్టీఆర్ మల్టీస్టారర్.. నెల్సన్ మాస్టర్ ప్లాన్...

కడపలో ఉద్రిక్తత.. కార్పొరేటర్ అభ్యర్థులపై కత్తి పోట్లు.. బండి దీప్తి ఇంటిపై దాడి!

పులివెందులలో కాల్పులు.. YSRCP నేతలపై పోలీసుల దాష్టీకం

MP గురుమూర్తి చేతిలో నుంచి నామినేషన్ పేపర్స్ లాక్కొని పారిపోయిన టీడీపీ నేతలు

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

మున్సిపల్ ఎన్నికలపై జగన్ ఫోకస్.. రెండో జాబితాలో బీసీలకు పెద్దపీట..!

తిరుపతిలో దారుణం.. నామినేషన్ వేయడానికి వెళ్లిన మహిళ బట్టలు చింపి...

భారీ ర్యాలీతో వరుదు కళ్యాణి నామినేషన్

Photos

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి