Breaking News

ఇప్పటివరకు నా భర్తతో మాట్లాడలేదు: పట్నం నరేందర్‌ సతీమణి

Published on Wed, 11/13/2024 - 12:17

హైదరాబాద్‌, సాక్షి: వికారాబాద్‌ జిల్లాలోని లగచర్ల ఘటనలో బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే పట్నం నరేందర్‌ రెడ్డిని అరెస్ట్‌ చేయడాన్ని ఆయన సతీమణి శృతి తప్పుపట్టారు. తన భర్తను ఎలాంటి సమాచారం లేకుండా  అరెస్టు చేశారని అన్నారు. 

‘‘సమాచారం లేకుండా ఇలా అరెస్ట్ చేయటం సరికాదు. నిన్న(మంగళవారం) రాత్రి, ఇవాళ ఉదయం ఇంటి ముందు పోలీసులు కూడా ఉన్నట్టు కనిపించలేదు. హఠాత్తుగా పోలీసులు వచ్చి తీసుకొని వెళ్లారు. ఇప్పటివరకు నా భర్త నాతో మాట్లాడలేదు. వాకింగ్‌కు వెళ్లి నేను వచ్చేశాను. తర్వాత ఆయన వస్తున్న సందర్భాన్ని చూసుకొని పోలీసులు అరెస్ట్ చేశారు’’ అని అన్నారు.

మరోవైపు.. ఇవాళ ఉదయం పోలీసులు అరెస్టు చేసిన కొడంగల్ మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డితో బీఆర్‌ఎస్‌ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఫోన్‌లో మాట్లాడారు.  అక్రమ అరెస్టుపైన ఆందోళన చెందవద్దని.. ధైర్యంగా ఉండాలని కోరారు. ప్రభుత్వ అప్రజస్వామిక నియంత విధానాలపైన పార్టీ న్యాయపరంగా పోరాటం చేస్తూనే ఉంటుందని తెలిపారు. 

అనంతరం..నరేందర్ రెడ్డి సతీమణి శృతితో కేటీఆర్ మాట్లాడారు. బీఆర్ఎస్ పార్టీ మొత్తం వారి కుటుంబానికి అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. పార్టీ లీగల్ సెల్ నరేందర్ రెడ్డి అరెస్టుపైన కోర్టులో పోరాటం చేస్తుందని కేటీఆర్ శృతికి హామీ ఇచ్చారు.

	అరెస్ట్ పై.. పట్నం నరేందర్ రెడ్డి భార్య.. కీలక వ్యాఖ్యలు

Videos

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

బీహార్ తలదించుకునేలా ఏపీ లో రెడ్ బుక్ అరాచకాలు

లోకేష్ ఈ రోజుని గుర్తు పెట్టుకుంటున్నాం... మిథున్ రెడ్డి, భూమన మాస్ వార్నింగ్

BIGG BOSS లీక్స్.. ఈ వీక్ CAPTAIN అతనే..?

షాకిస్తోన్న జైలర్ 2... రజనీ రెమ్యునరేషన్ తో 4 సినిమాలు..!

విజయనగరం జిల్లాలో టీడీపీ నాయకుల రాజీనామా

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

Photos

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)