Breaking News

వారికి నా కంటే అందగాడు కనిపించలేదేమో!

Published on Sun, 05/18/2025 - 16:06

హైదరాబాద్: ఉగ్రవాదంపై భారత్ జరుపుతున్న పోరులో భాగంగా తన వంతు పాత్రను సమర్దవంతంగా పోషిస్తున్న హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ.. పాకిస్తాన్ ట్రోలర్స్ కు స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. ఇస్లాంలో హింసకు తావులేదని పదే పదే చెబుతున్న అసదుద్దీన్ పై పాకిస్తాన్ కు చెందిన  పలువురు ట్రోలింగ్‌కు దిగారు. దీనికి ఓవైసీ నవ్వుతూనే అదిరిపోయే కౌంటర్ ఇచ్చారు. ‘ పాకిస్తాన్ లో ఉన్న  వారికి భారత్ లో ఉన్న నేను మాత్రమే కనిపిస్తున్నాను. నా కంటే అందగాడు వారికి కనిపించలేదేమో. అందుకే నా ప్రసంగాలు వింటూ ఉన్నారు.  నా ప్రసంగాలు విని మీ మెదడులో ఉన్న చెత్తను తీసేయండి. అది అందరికీ మంచిది. మీ అజ్ఞానం కూడా అంతమవుతుంది’ అని అసదుద్దీన్‌ తెలిపారు.

‘ ‘మీపై పాకిస్తాన్ ట్రోలింగ్ ఎక్కువైంది కదా’’ ? అని మీడియా అడిగిన ప్రశ్నకు ఓవైసీ నవ్వుతూ స్పందించారు. వారికి తన కంటే అందగాడు భారత్ లో కనిపించలేదేమో. అందుకే నా ప్రసంగాలను ట్రోల్స్ చేస్తున్నారు’ అంటూ చమత్కరించారు.

పహల్గామ్ ఉగ్రదాడి అనంతరం చోటు చేసుకున్న పరిణామాల్లో భాగంగా అంతర్జాతీయ వేదికపై  ఉగ్రవాదంపై భారత్ సాగిస్తున్న పోరాటానికి ఓవైసీ సిద్ధమవుతున్నారు.  పహల్గామ్ ఉగ్రదాడి తర్వాత, ఆపై భారత్ చేపట్టిన ఆపరేషన్ సిందూర్ కు ముందు జరిగిన అఖిలపక్ష సమావేశానికి ఓవైసీకి ఆహ్వానం చివరి నిమిషంలో అందింది. తొలుత ఓవైసీకి ఆహ్వానం అందలేదనే వార్తల నేపథ్యంలో హోంమంత్రి అమిత్ షా స్వయంగా ఫోన్ చేసి ఓవైసీని అఖిలపక్ష సమావేశానికి రమ్మని ఆహ్వానించారు. 

అప్పట్నుంచీ పాకిస్తాన్ దుశ్చర్యలను ఎండగడుతూనే ఉన్నారు అసదుద్దీన్ ఓవైసీ. పాకిస్తాన్  ఓ ఉగ్రవాద దేశంగా మారిపోయిందని, ఆ దేశం అర్థ శతాబ్దం వెనక్కి పోయిందంటూ ఘాటైన వ్యాఖ్యలు చేశారు. ఇలా సమయం వచ్చినప్పుడల్లా పాకిస్తాన్ తీరుపై ధ్వజమెత్తుతూనే ఉన్నారు ఓవైసీ.

ఇదీ చదవండి:

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)