Breaking News

పహల్గాం ఉగ్ర దాడి.. హైదరాబాద్‌లో హైఅలర్ట్‌‌

Published on Thu, 04/24/2025 - 18:23

సాక్షి, హైదరాబాద్‌: పహల్గాం ఉగ్రదాడి నేపథ్యంలో హైదరాబాద్‌ పోలీసులు హై అలర్ట్‌ ప్రకటించారు. నగరంలోని సున్నిత ప్రాంతాల్లో ప్రత్యేక నిఘా పెట్టారు. పాత బస్తీతో పాటు వివిధ ప్రాంతాలపై పోలీసులు నజర్‌ పెట్టారు. పర్యాటక ప్రాంతాల్లో తనిఖీలు ముమ్మరం చేశారు. నగరంలోని గతంలో టెర్రరిస్టుల దాడులకు గురైన ప్రాంతాలు సహా పలు ప్రాంతాల్లో భద్రతా సిబ్బందిని అప్రమత్తం చేశారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలకు జరగకుండా ముందస్తు చర్యలు తీసుకుంటున్నారు.

మరో వైపు, తిరుమలలో కూడా భద్రతను కట్టుదిట్టం చేశారు అధికారులు. పహల్గాంలో ఉగ్ర దాడి జరిగిన నేపథ్యంలో టీటీడీ.. తిరుమలలో సెక్యూరిటీని కట్టుదిట్టం చేసింది. తిరుమలలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా ముందస్తు చర్యలు తీసుకుంటున్నారు.

పహల్గాం ఉగ్రదాడి నేపథ్యంలో తిరుమలలో సెక్యూరిటీని పెంచారు. తిరుమల ఘాట్ రోడ్డులోని లింక్ రోడ్డు సమీపంలో వాహనాలను టీటీడీ విజిలెన్స్ అధికారులు తనిఖీ చేస్తున్నారు. ఈ క్రమంలో అనుమానం వచ్చిన వాహనాలను క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు. తిరుమలలో అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా ముందస్తు చర్యలు చేపట్టారు.

 

Videos

Penukonda: అధికారుల ఓవర్ యాక్షన్.. ఒక్క ఫోన్ కాల్ తో దుమ్ముదులిపేసిన ఉష శ్రీ చరణ్

అభిషేక్ తో పెళ్లి! శుభ్‌మన్ గిల్, అభిషేక్ శర్మపై షాకింగ్ కామెంట్స్!

శ్రీకాకుళంలో పవన్ కు బిగ్ షాక్ YSRCPలో చేరిన జనసేన యూత్

నామినేషన్ వేసిన అనంతపురం YSRCP మేయర్ అభ్యర్థి

ప్రొద్దుటూరులో ఉద్రిక్తత పోలీస్ లారీ ఛార్జ్ తిరగబడ్డ YSRCP నేతలు

Rashmika: బతుకమ్మను నెత్తిన పెట్టుకొని... బతుకమ్మ సంబరాలు

కాలేజీలో బిగ్ బాస్ ఓటింగ్.. కేంద్రం సీరియస్ వార్నింగ్...

నామినేషన్లు అడ్డుకోవడంపై... అనిల్ చంద్ర పునేఠా స్ట్రాంగ్ రియాక్షన్

IPL 2027 వేలం డేట్ ఫిక్స్ ? ఎక్కడంటే?

టైగర్ ష్రాఫ్‌ ను కాల్చింది నేనే సంచలన ఆడియో రిలీజ్

Photos

+5

జిగేలుమంటున్న ప్రియాంక.. ఎల్లోరా శిల్పం కూడా తక్కువే! (ఫొటోలు)

+5

నవరాత్రి వేడుకల్లో కుందనపు బొమ్మలా మాళవిక (ఫొటోలు)

+5

కిరణ్ అబ్బవరం సినిమాతో కన్నడ బ్యూటీ టాలీవుడ్ ఎంట్రీ.. ఎవరీమె?

+5

బతుకమ్మ పండగ.. అందంగా హీరోయిన్ అనన్య (ఫొటోలు)

+5

తిరుమల : స్వర్ణరథంపై దేవదేవుడు శ్రీ వేంకటాద్రీశుడు దివ్య దర్శనం (ఫోటోలు)

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)

+5

మైసూరు దసరా మహోత్సవం.. జంబూసవారీ ఏర్పాట్లు (ఫోటోలు)

+5

తిరుమల : చంద్రప్రభ వాహనంపై నర్తన కృష్ణుడి అలంకారంలో శ్రీ మలయప్పస్వామి (ఫోటోలు)

+5

హైదరాబాద్ : సద్దుల బతుకమ్మ వేడుకల్లో బతుకమ్మ ఆడిన రష్మిక (ఫోటోలు)