Breaking News

దోమలు, నల్లులు.. హైదరాబాద్‌ ఐఐటీలో చేదు అనుభవం!

Published on Mon, 08/03/2026 - 09:22

భారతదేశంలోని ప్రతిష్ఠాత్మక విద్యాసంస్థల్లో ఒకటైన ఐఐటీ హైదరాబాద్‌లో చేరిన ఓ జపాన్‌ విద్యార్థిని అనుభవాలు సోషల్‌ మీడియాలో చర్చనీయాంశంగా మారాయి. భారత్‌కు వచ్చిన ఆనందంతో పాటు.. హాస్టల్‌ వసతిలో ఎదురైన సమస్యలను కూడా ఆమె ఇన్‌స్టాగ్రామ్‌ వీడియో ద్వారా పంచుకోవడంతో ఈ అంశం వైరల్‌గా మారింది.

ఐఐటీ హైదరాబాద్‌లో తాను తొలి జపాన్‌ విద్యార్థినినని చెప్పుకున్న హిరో(Japan Student Hiro).. భారత్‌లో తన మొదటి వారం అనుభవాలను వీడియో రూపంలో పంచుకుంది. విమాన ప్రయాణం నుంచి క్యాంపస్‌ చేరుకునే వరకు జరిగిన విషయాలను వివరించిన ఆమె.. ఐఐటీ హైదరాబాద్‌ ఇంటర్నేషనల్‌ రిలేషన్స్‌ సెల్‌ నుంచి లభించిన స్వాగతంపై ప్రశంసలు కురిపించింది. భారత్‌కు రావడం ఎంతో ఉత్సాహంగా అనిపించిందని చెప్పిన హిరో.. క్యాంపస్‌లో తనకు మంచి స్వాగతం లభించిందని పేర్కొంది. కొత్త స్నేహాలు, కొత్త వాతావరణం తనకు ప్రత్యేక అనుభూతిని ఇచ్చాయని తెలిపింది.

అయితే ఈ ఆనందంతో పాటు కొన్ని ఇబ్బందులు కూడా ఎదురయ్యాయని ఆమె వెల్లడించింది. హాస్టల్‌ గదిలో సమస్యలు ఉన్నాయని, మంచంపై చనిపోయిన పురుగులు కనిపించాయని చెప్పింది. అంతేకాకుండా దోమకాట్ల కారణంగా తీవ్ర ఇబ్బంది పడ్డానని, నల్లులతో అలర్జీ రావడంతో భారత్‌లో తొలిసారి ఆస్పత్రికి వెళ్లాల్సి వచ్చిందని వివరించింది.

తన హాస్టల్‌ గది పరిస్థితులను చూపిస్తూ ఆమె చేసిన వీడియోలో వసతి సమస్యలను ప్రస్తావించింది. అయితే ఐఐటీ హైదరాబాద్‌ మొత్తం అనుభవాన్ని ప్రతికూలంగా చూపించకుండా.. ఒకవైపు సంస్థ నుంచి లభించిన సహకారాన్ని, మరోవైపు ఎదురైన సవాళ్లను సమతుల్యంగా వివరించింది. హిరో ఈ వీడియోతో పాటు తన అనుభవానికి సంబంధించిన రెండో భాగాన్ని కూడా త్వరలో పంచుకుంటానని తెలిపింది. ఆమె పోస్ట్‌ సోషల్‌ మీడియాలో వైరల్‌ కావడంతో నెటిజన్లు భిన్నంగా స్పందిస్తున్నారు.

హిరో వీడియో వైరల్‌ కావడంతో పలువురు నెటిజన్లు ఆమెకు పలు సూచనలు చేశారు. కొత్త దేశంలో చదువుకునేందుకు వచ్చినప్పుడు ఎదురయ్యే చిన్న చిన్న ఇబ్బందులను ఓపికగా ఎదుర్కోవాలని, ఏదైనా సమస్య ఉంటే నేరుగా ఐఐటీ హైదరాబాద్‌ యాజమాన్యం, అంతర్జాతీయ విద్యార్థుల విభాగం దృష్టికి తీసుకెళ్లాలని సూచించారు. పరువు లాంటి సదుపాయాలు విద్యార్థులే ఏర్పాటు చేసుకుంటారని.. ఆమె కొన్న పరుపు సరైంది ఉండకపోవచ్చని అభిప్రాయపడుతున్నారు. 

మరికొందరు.. హాస్టల్‌ పరిశుభ్రత, వసతి సమస్యలను సోషల్‌ మీడియాలో పంచుకోవడంతో పాటు సంబంధిత అధికారులకు ఫిర్యాదు చేస్తే త్వరగా పరిష్కారం లభిస్తుందని తెలిపారు. అలాగే భారతీయ సంస్కృతి, వాతావరణానికి అలవాటు పడేందుకు కొంత సమయం పడుతుందని, సానుకూల దృక్పథంతో ముందుకు సాగాలని హిరోకు సూచించారు. అదే సమయంలో ఇంకొందరు నెటిజన్లు మాత్రం విదేశీ విద్యార్థులు ఎదుర్కొనే ఇలాంటి సమస్యలపై విద్యాసంస్థలు మరింత శ్రద్ధ పెట్టాలని అభిప్రాయపడ్డారు.

ఐఐటీ హైదరాబాద్‌ స్వాగతానికి ఫిదా అయిన జపాన్‌ విద్యార్థిని.. హాస్టల్‌లో ఎదురైన దోమలు, పురుగుల సమస్యలను బయటపెట్టడంతో ఆమె అనుభవం ఇప్పుడు వైరల్‌గా మారింది. దీనిపై నిర్వాహకులు ఏమైనా స్పందిస్తారేమో చూడాలి.

Videos

సచివాలయ ఉద్యోగులంటే చంద్రబాబుకు ఎందుకింత కక్ష..?

పెళ్లి చూసుకున్నవాళ్లకే దిక్కులేదు... 15 ఏళ్ళు కలిసుంటారట..!

KAAKA నుంచి క్రేజీ అప్డేట్

ఓ బ్రాహ్మణ్ పై కక్ష్య సాధిస్తే... వేమిరెడ్డి దంపతులు ఇది నా ఆక్రందన! శ్రావణ్ శర్మ సతీమణి

సచివాలయం ఉద్యోగులను ఎలా ఈడ్చుకెళ్తున్నారో చూడండి

ఈసీ నియామక విధానంపై జగన్ ప్రశ్నలు.. అసలు వివాదం ఏంటి?

పాత అంబులెన్సుకు కొత్త రంగులు వేసిన ఏపీ సర్కారు

సిగ్గుందా చంద్రబాబు..! ఉద్యోగులంటే బానిసలనుకున్నారా..?

పోస్ట్ ఆఫీస్ అదిరిపోయే స్కీమ్.. నెలకు అకౌంట్లోకి 20,000

హిమాలయాల్లో పెను సునామీ! 200 కోట్ల మందికి డేంజర్ బెల్స్!

Photos

+5

AP: సచివాలయ ఉద్యోగుల తిరుగుబాటు..!(ఫొటోలు)

+5

ఎర్రచీరలో అందంగా శోభిత చెల్లి సమంత (ఫొటోలు)

+5

'ఆదర్శ కుటుంబం'లోని నారాయణమ్మ సాంగ్ లాంచ్ (ఫొటోలు)

+5

భర్తతో కలిసి మలేసియా ట్రిప్‌లో హీరోయిన్ అపర్ణ(ఫొటోలు)

+5

'ప్యారడైజ్'లో కేసీఆర్‌ని పోలిన పాత్ర.. షూటింగ్‌లో ఇలా(ఫొటోలు)

+5

బర్త్‌ డే సెలబ్రేషన్స్‌ వైబ్‌లో ఉప్పెన బ్యూటీ కృతి శెట్టి (ఫోటోలు)

+5

‘ది ప్యారడైజ్‌’లో సంపూర్ణేష్‌ బాబు భార్యగా విషిక.. గ్లామర్‌ ఫొటోలు వైరల్‌

+5

మిజ్వాన్‌ ఫ్యాషన్‌ షోలో అలియా, విక్కీ సందడి(ఫోటోలు)

+5

నాలుగు పదులు దాటినా మరింత గ్లామరస్‌గా శ్రియా శరణ్..(ఫోటోలు)

+5

ప్రీతి ముకుందన్‌ స్పెషల్‌ మూమెంట్‌ (ఫొటోలు)