Breaking News

మంత్రి హరీష్ రావుకు బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే మైనంపల్లి వార్నింగ్‌

Published on Mon, 08/21/2023 - 13:09

తిరుమల: తెలంగాణలో రాబోయే అసెంబ్లీ  ఎన్నికల నేపథ్యంలో బీఆర్‌ఎస్‌ అభ్యర్ధుల ప్రకటన ముహూర్తానికి ముందే ఆ పార్టీ మల్కాజ్ గిరి ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంత రావు మంత్రి హరీశ్ రావుకు సీరియస్ వార్నింగ్ ఇచ్చారు. 

సీఎం మరికొద్ది సేపట్లో అభ్యర్థుల జాబితా ప్రకటించనున్నారనగా మల్కాజ్ గిరి ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు మంత్రి హరీశ్ రావుపై ఫైర్ అయ్యారు. నేను, నా కుమారుడు ఎక్కడ నుండి పోటీ చెయ్యాలో చెప్పడానికి హరీష్రావు ఎవరు? ఇందులో ఆయన పెత్తనం ఏమిటని ప్రశ్నించారు. నేను మల్కాజ్ గిరి నుంచి నా కుమారుడు మెదక్ నుంచి పోటీ చేస్తాము. ఎవ్వరు అడ్డుకుంటారో చూస్తామని సవాల్ చేశారు. 

ఇంతకాలం మెదక్ అభివృద్ధిని అడ్డుకుంది హరీష్ రావేనని అవసరమైతే సిద్దిపేటలో నా తడాఖా ఏంటో చూప్పించి హరీశ్ రావు అడ్రస్ గల్లంతు చేస్తానని వెంకటేశ్వర స్వామి మీద ప్రమాణం చేశారు. కేసీఆర్ కుటుంబంలో చాలామందికి టికెట్ ఇచ్చారని మా ఇద్దరికి టికెట్ ఇస్తేనే పోటీ చేస్తామని స్పష్టం చేశారు. 

‘నా కుమారుడు మైనంపల్లి రోహిత్ రెండు గోల్డ్ మెడల్స్ సాధించారు. కరోన సమయంలో ప్రణాలకు తగించి చాలా మందికి వైద్య సేవలు అందించారు. తండ్రి గా నా కుమారుడికి నా సపోర్ట్ ఉంటుంది. నా కొడుకుని మెదక్ ఎమ్మెల్యే చేస్తాను. హరీష్‌రావు మెదక్‌ లో పెత్తనం చలాయిస్తున్నాడు. ఓ డిక్టేటర్లా హారీష్‌రావు ప్రవర్తిస్తా ఉన్నారు. హారీష్రావు గతం గుర్తు పెట్టుకో. ఓ టంకు డబ్బాతో, రబ్బరు చొప్పులతో వచ్చిన రోజు చూసాను. నేను హిరోగా ఉన్నా, హరీష్ రావు చాలా చిన్న వాడు....సిద్దిపేట్ అభివృద్ధి అయింది,  మెదక్ ఎందుకు అభివృద్ధి కాలేదు అని అడిగినా.

హరీష్‌రావు బట్టలు ఇప్పే వరకు నేను వదలను.. ఈసారి నా కొడుకును ఎమ్మెల్యేగా గెలిపించుకొని హరీష్‌రావు అడ్రస్ లేకుండా చేస్తా. వచ్చే ఎన్నికల్లో సిద్ధిపేటలో పోటి చేస్తా బిడ్డా. హరీష్‌రావుని నిద్రపోనివ్వను. లక్ష కోట్లు హరీష్‌రావు సంపాదించాడు. టంకు డబ్బా,రబ్బరు చెప్పులతో వచ్చిన హారీష్‌రావ్‌కి లక్ష కోట్లు ఎక్కడి నుండి వచ్చాయి.

మెదక్ లో హారీష్‌రావ్ పెత్తనం ఏంటి. మల్కాజ్‌గిరిలో నేను పోటీ చేస్తా, మెదక్ లో నా కొడుకు పోటీ చేస్తాడు. అవసరమైతే రాజకీయాలు పక్కన‌పెట్టి నా కొడుకుని గెలిపించుకొంటాను. నేను టీఆర్ఎస్ పార్టీ, వారు నన్ను వద్దు అనుకొంటే నేను ఏం చేసేను. నాకు ఎమ్‌ఎల్‌ఏ టికెట్‌ ఇచ్చారు.  ఇస్తే ఇద్దరికి టికెట్ ఇవ్వమని అడిగా. లేకుంటే  ఎవ్వరికి వద్దు అని తేల్చి చెప్పాను’అని మంత్రి హరీష్‌రావుపై మండిపడ్డారు బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే మైనంపల్లి.
 

ఇది కూడా చదవండి: హెల్త్‌ డైరెక్టర్‌ శ్రీనివాస్‌కు మంత్రి హరీష్‌ క్లాస్‌

Videos

విశ్వక్ సేన్ లో ఇంత మార్పా?

CBI ఎంట్రీ ... సాయి కృష్ణ కేసులో కీలక పరిణామం

3 రోజులుగా నిర్బంధం.. పోలీసులకు విడదల రజిని వార్నింగ్

ఏపీ హైకోర్టులో YSRCP లంచ్ మోషన్ పిటిషన్

డెలివరీ బాయ్ సాహసం.. వంటింట్లో తప్పిన పెను ప్రమాదం..!

12th ఫ్లోర్ కిటికీలో వేలాడుతున్న చిన్నారి.. అసలు ఎం జరిగింది?

రెండింతల కసితో.. బాబుకు బడితపూజే

YSRCP అభ్యర్థులను దారుణంగా కొట్టిన TDP రౌడీలు

సండే ఎమ్మెల్యే కాదు.. సత్తా ఉన్న ఎమ్మెల్యేని.. ఇచ్చిపడేసిన శిల్పా రవి

The Paradise OTT: ఓటీటీలోకి వచ్చేసిన నాని 'ది ప్యారడైజ్'

Photos

+5

పెళ్లి బంధానికి నాలుగేళ్లు.. పూర్ణ ఫ్యామిలీ (ఫొటోలు)

+5

'మా అన్నయ్య బంగారం'.. ప్రభాస్ బర్త్ డే క్యూట్ ఫొటోస్

+5

'మిస్టర్ దెయ్యం' సినిమా లాంచ్ (ఫొటోలు)

+5

వైట్ శారీలో టాలీవుడ్ అందాల భామ ఈషా రెబ్బా కొత్త ఫోటోలు

+5

‘అక్క’ ట్రైలర్‌ లాంచ్‌లో మెరిసిన హీరోయిన్‌ కీర్తి సురేశ్‌ (ఫొటోలు)

+5

గజరాజులు తిరుగు ప్రయాణం... నగరవాసుల భావోద్వేగం

+5

'ఐఫా'అవార్డుల విలేకరుల సమావేశంలో బాలీవుడ్ నటులు సందడి (ఫొటోలు)

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా సద్దుల బతుకమ్మ (ఫొటోలు)

+5

హైదరాబాద్ : ఎగ్జిబిషన్‌ మైదానంలో సందడిగా దత్తన్న అలయ్‌ బలయ్‌ (ఫొటోలు)

+5

ప్రభాస్ హీరోయిన్ కొత్త ఫొటోలు! (ఫొటోలు)