Breaking News

ఫార్ములా ఈ రేసుకు హాజరైన మంత్రి కేటీఆర్.. అసౌకర్యంపై స్పందన

Published on Sat, 02/11/2023 - 16:18

సాక్షి, హైదరాబాద్‌: నగరంలోని హుస్సేన్‌ సాగర్‌ తీరం వద్ద ఫార్ములా- రేసింగ్‌ పోటీలు సందడిగా సాగాయి. రెండో రోజు ఫార్ములా-ఈ రేసింగ్‌కు మంత్రి కేటీఆర్‌ హాజరయ్యారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. ప్రపంచంలోనే ప్రతిష్టాత్మకైనా ఫార్ములా ఈ రేసు హైదరాబాద్ వేదికగా జరగడం ఆనందకరమని అన్నారు. నెక్లెస్‌ రోడ్డులో ఫార్ములా ఈ కార్లు వేగంగా దూసుకుపోతుంటే చూడటానికి ఎంతో బాగుందని హర్షం వ్యక్తం చేశారు.

హైదరాబాదులో ఉన్న యువత, క్రీడాభిమానులు ఈ రేస్‌ను చూసేందుకు తరలివస్తున్నారని చెప్పారు. ఈ ఈవెంట్స్‌లో కొంత అసౌకర్యం కలుగుతుందన్నమాట నిజమేనన్న కేటీఆర్.. కానీ అది మన్నించి సహకరిస్తున్నందుకు నగరవాసులందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నామన్నారు. ఇంటువంటి కార్యక్రమాలతో హైదరాబాద్ కు అంతర్జాతీయ గుర్తింపు లభిస్తుందని, ఈ కార్యక్రమం సవ్యంగా, సాఫీగా జరగాలని కోరుకుంటున్నానని చెప్పారు. 

కాగా దేశంలో తొలిసారిగా హైదరాబాద్‌లో నిర్వహిస్తున్న అంతర్జాతీయ ఫార్ములా ఈ-రేసింగ్‌ పోటీలను వీక్షించేందుకు సినీ, క్రీడా రంగాలకు సెలబ్రిటీలు పెద్ద ఎత్తున తరలిరావడంతో అభిమానుల్లో జోష్‌ కనిపిస్తోంది. టీమిండియా మాజీ క్రికెటర్‌ సచిన్‌ టెండూల్కర్‌తోపాటు శిఖర్‌ ధావన్‌, దీపక్‌ చాహర్‌, సినీనటుడు నాగచైతన్య, అఖిల్‌ అక్కినేని. మహేశ్‌ బాబు సతీమణి నమ్రత, కుమారుడు గౌతమ్‌, జూనియర్‌ ఎన్టీఆర్‌ సతీమణి లక్ష్మీ ప్రణతి, నారా బ్రాహ్మణి హుస్సేన్‌ సాగర్‌ తీరానికి విచ్చేశారు. 
చదవండి: హైదరాబాద్‌లో ఫార్ములా ఈ రేసింగ్‌.. సెలబ్రిటీల సందడి 

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)