Breaking News

‘గ్రూప్‌-1’ తీర్పు.. రేవంత్‌కో గుణపాఠం: కేటీఆర్‌

Published on Tue, 09/09/2025 - 13:05

సాక్షి, హైదరాబాద్‌: గ్రూప్-1 కేసులో హైకోర్టు తీర్పు రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి గుణపాఠమంటూ మాజీ మంత్రి, బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్ వ్యాఖ్యానించారు. నిరుద్యోగ ఆకాంక్షలకు వ్యతిరేకంగా  ప్రభుత్వం అవకతవకలకు పాల్పడిందని మండిపడ్డారు. హైకోర్టు తీర్పు ప్రకారం, విద్యార్థులు కోరిన విధంగా చర్యలు తీసుకోవాలని కేటీఆర్‌ డిమాండ్‌ చేశారు. అప్పిళ్లు, మళ్ళీ కోర్టు కేసుల పేరు చెప్పి యువతకు అన్యాయం చేయొద్దని ప్రభుత్వానికి కేటీఆర్‌ హితవు పలికారు.

నిరుద్యోగ విద్యార్థులు కోరుతున్న తీరుగా మళ్లీ తిరిగి పరీక్షను సాధ్యమైనంత త్వరగా పూర్తిచేయాలన్న కేటీఆర్‌.. ఇన్ని రోజుల పాటు గ్రూప్‌-1 అభ్యర్థులు లేవనెత్తిన అంశాలను పట్టించుకోకుండా వారిపై అణిచివేతకు పాల్పడిన రేవంత్ రెడ్డి క్షమాపణ చెప్పాలంటూ కేటీఆర్‌ డిమాండ్‌ చేశారు.

హైకోర్టు తీర్పు.. రేవంత్‌ సర్కార్‌ సమాధానం ఏంటి?: హరీష్‌
హైకోర్టు తీర్పుపై మాజీ మంత్రి హరీష్‌రావు ఎక్స్‌ వేదికగా స్పందించారు. గ్రూప్ 1 పరీక్ష మూల్యాంకనంలో అవకతవకలపై ఆయన మండిపడ్డారు. పరీక్ష కేంద్రాల కేటాయింపు, హల్ టికెట్ల జారీ, పరీక్ష ఫలితాల్లో అనుమానాలు, అక్రమాల ఆరోపణల నేపథ్యంలో నేడు హైకోర్టు ఇచ్చిన తీర్పు రాష్ట్ర ప్రభుత్వానికి చెంపపెట్టు అంటూ హరీష్‌రావు ట్వీట్‌ చేశారు. లోప భూయిష్టంగా పరీక్షలు నిర్వహించి విద్యార్థుల జీవితాలతో చెలగాటమాడుతున్న రేవంత్‌రెడ్డి ప్రభుత్వం..  ఈ కోర్టు తీర్పుకు  చెప్పే సమాధానం ఏమిటి? అంటూ ఆయన ప్రశ్నించారు.

‘‘హడావుడిగా పరీక్షలు నిర్వహించి, అవకతవకలకు పాల్పడ్డ మీ నిరక్ష్యానికి విద్యార్థులు, నిరుద్యోగులు బలవుతున్నారు. గప్పాలు కొట్టే కాంగ్రెస్ ప్రభుత్వానికి పరీక్షలు ఎలా నిర్వహించాలనే సోయి కూడా లేదు. పరీక్షలు నిర్వహించడం, ప్రభుత్వ ఉద్యోగాలు ఇవ్వడం అంటే విద్యార్థులను, నిరుద్యోగులను రెచ్చగొట్టి చిల్లర రాజకీయాలు చేయడం కాదు’’ అంటూ రేవంత్‌రెడ్డిపై హరీష్‌రావు మండిపడ్డారు.

Videos

రాబోయే రోజుల్లో పోలీసులు శిక్ష అనుభవించక తప్పదు..

నామినేషన్లు అడ్డుకున్న ఒక్కొక్కడికి చెప్తున్నా.. రోజా ఊర మాస్ వార్నింగ్

Nellore: అధికారుల ఓవరాక్షన్.. ఇచ్చిపడేసిన చంద్రశేఖర్ రెడ్డి

అడ్డుకోవాలని చూసారు పోలీసులకు ఇచ్చిపడేసిన రోజా

YSRCP మున్సిపల్ చైర్మన్ అభ్యర్థి రేష్మ నామినేషన్ తిరస్కరణ...

నిందితులు అరెస్ట్... టైగర్ పై ఎటాక్ అమెరికా నుంచే ప్లాన్ అమలు...

Tesla Roadster: ఎగిరే కారు.. మస్క్ మరో సంచలనం! ధర తెలిస్తే అవాక్

Penukonda: అధికారుల ఓవర్ యాక్షన్.. ఒక్క ఫోన్ కాల్ తో దుమ్ముదులిపేసిన ఉష శ్రీ చరణ్

అభిషేక్ తో పెళ్లి! శుభ్‌మన్ గిల్, అభిషేక్ శర్మపై షాకింగ్ కామెంట్స్!

శ్రీకాకుళంలో పవన్ కు బిగ్ షాక్ YSRCPలో చేరిన జనసేన యూత్

Photos

+5

రణ్‌బీర్‌ కపూర్‌, సాయిపల్లవి 'రామాయణ' మూవీ HD స్టిల్స్‌

+5

నవరాత్రి స్పెషల్.. ప్రత్యేక పూజల్లో అలియా భట్‌ (ఫొటోలు)

+5

జైలర్‌ 2 హిట్‌.. మిర్నా ఫొటోలు వైరల్‌!

+5

జిగేలుమంటున్న ప్రియాంక.. ఎల్లోరా శిల్పం కూడా తక్కువే! (ఫొటోలు)

+5

నవరాత్రి వేడుకల్లో కుందనపు బొమ్మలా మాళవిక (ఫొటోలు)

+5

కిరణ్ అబ్బవరం సినిమాతో కన్నడ బ్యూటీ టాలీవుడ్ ఎంట్రీ.. ఎవరీమె?

+5

బతుకమ్మ పండగ.. అందంగా హీరోయిన్ అనన్య (ఫొటోలు)

+5

తిరుమల : స్వర్ణరథంపై దేవదేవుడు శ్రీ వేంకటాద్రీశుడు దివ్య దర్శనం (ఫోటోలు)

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)