ఆపదలో ఆదుకున్నది కేటీఆర్‌ అన్న మాత్రమే

Published on Wed, 07/29/2026 - 09:35

తంగళ్లపల్లి(సిరిసిల్ల): కష్టకాలంలో తమకు అండగా నిలిచి, దేవుడిలా ఆదుకున్నది బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్, సిరిసిల్ల ఎమ్మెల్యే కేటీఆర్‌ మాత్రమేనని నేరెళ్ల బాధితుడు గంధం గోపాల్‌ కుటుంబ సభ్యులు ఆవేదనతో తెలిపారు. స్వార్థ రాజకీయ ప్రయోజనాల కోసం ఇతర పార్టీల నాయకులు తమను కేవలం వాడుకున్నారే తప్ప ఎలాంటి సాయం యలేదని మంగళవారం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.

హామీలు ఇచ్చి మోసం చేసిన బీజేపీ, కాంగ్రెస్‌ 
గోపాల్‌ కుటుంబ సభ్యులు మాట్లాడూతూ... ‘మమ్మల్ని అందరూ రాజకీయంగా వాడుకున్నారు. కాంగ్రెస్‌ నాయకులు మా వద్దకు వచ్చి హామీలు ఇచ్చి వెళ్లిపోయారే తప్ప సహాయం చేయలేదు. కేంద్ర మంత్రి బండి సంజయ్‌ మా పక్క ఊరికి (రెండు కిలోమీటర్ల దూరంలోకి) వచ్చినా కనీసం పరామర్శించలేదు. మీకు రూ. 20 కోట్లు ఇప్పిస్తా’ అని పెద్ద పెద్ద మాటలు చెప్పారు కానీ, రూపాయి సాయం చేయలేదు. ఆస్పత్రిలో ఉన్నప్పుడు వారి పీఏలకు ఎన్నిసార్లు ఫోన్‌ చేసినా పట్టించుకోలేదు’ అని ఆరోపించారు. బండి సంజయ్‌ విజయసంకల్ప యాత్ర చేసిన సమయంలో కూడా మమ్మల్ని కనీసం పరామర్శించే ప్రయత్నం చేయలేదని తెలిపారు.

కుటుంబ సభ్యుడిలా అండగానిలిచిన కేటీఆర్‌
ఆస్పత్రిలో ప్రాణాపాయ స్థితిలో ఉన్న సమయంలో కేటీఆర్‌ అన్న స్వయంగా డాక్టర్లతో మాట్లాడి మెరుగైన వైద్యం అందించేలా చూశారు. ‘నేను మీ ఇంట్లో పెద్ద అన్నలాంటివాడిని, ఆస్పత్రి ఖర్చులు, ఆర్థికసాయం ఏది కావాలన్నా నేను చూసుకుంటా’ అని ధైర్యం చెప్పారని తెలిపారు. ‘చనిపోయిన తర్వాత కూడా మమ్మల్ని పరామర్శించిన ఏకైక నాయకుడు కేటీఆర్‌ మాత్రమే అని, కల్వకుంట్ల కవిత అక్క కూడా మాతో మాట్లాడి ఎల్లప్పుడూ అండగా ఉంటామని హామీ ఇచ్చారు’ అని కుటుంబ సభ్యులు వెల్లడించారు. తమ కుటుంబానికి కష్ట సమయంలో నిజమైన అండగా నిలిచింది కేటీఆర్‌ మాత్రమేనని, అందుకే తాము ఎప్పటికీ ఆయననే నమ్ముతామని స్పష్టం చేశారు. మాట్లాడిన వారిలో గోపాల్‌ భార్య గంధం లావణ్య, తల్లి బాలవ్వ, కూతుళ్లు అక్షిత, నిఖిత, కొడుకు అభినయ్, తమ్ముడు గొర్రె మహేశ్‌ ఉన్నారు.

 

Videos

కాంగ్రెస్ అధిష్టానానికి మంత్రి దామోదర బిగ్ షాక్

అమెరికాలో మరోసారి కాల్పుల కలకలం..చిన్నారులు మృతి

కేంద్ర ఎన్నికల సంఘం ముందుకు 9 సూటి ప్రశ్నలు...?

మున్సిపల్ ఎన్నికల్లో పోటీ చేస్తే చంపేస్తాం.. జేసీ అనుచరుల బెదిరింపులు

ఏలూరు మేయర్ పీఠాన్ని జనసేనకు.. తెలుగు తమ్ముళ్లు ఆగ్రహం.. మొత్తం ఒకేసారి రాజీనామా..

కుక్కకు ఇచ్చిన గౌరవం కూడా జనసేనకు లేదా? వంగవీటి నరేంద్ర కీలక వ్యాఖ్యలు

నాకు తెలిసి పార్టీ మరడం అంటే అధికార పక్షం నుండి ప్రతిపక్షంలోకి వెళ్తారు కానీ..

విశాఖ మేయర్ అభ్యర్థిగా ప్రకటించిన తరువాత వరుదు కళ్యాణి ఫస్ట్ రియాక్షన్

అడ్డంగా నామాలు, తడి బట్టలు.. ధర్మాన్ని, మతాన్ని కాపాడుతా అంటూ.. పవన్ పై వల్లభనేని వంశీ సెటైర్లు

Audio Leak: మీతో గెలవలేం.. దయచేసి పోటీ చేయొద్దు.. YSRCP లీడర్ తో మంత్రి రాంప్రసాద్ రెడ్డి

Photos

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)

+5

తిరుమల : కల్పవృక్ష వాహనంపై శ్రీ మలయప్పస్వామి కటాక్షం (ఫొటోలు)

+5

సందీప్ కిషన్ కొత్త సినిమా 'కరికాల' సినిమా ప్రారంభోత్సవం (ఫొటోలు)

+5

ఇటలీ ట్రిప్‌లో కిరణ్ అబ్బవరం సతీమణి రహస్య గోరఖ్.. (ఫోటోలు)

+5

ఇంద్రకీలాద్రిపై వైభవంగా దసరా శరన్నవరాత్రి ఉత్సవాలు (ఫొటోలు)