Breaking News

ఇప్పటికే మహిళలకు క్షమాపణలు చెప్పాను: కేటీఆర్‌

Published on Sat, 08/24/2024 - 13:45

సాక్షి, హైదరాబాద్‌: మహిళా కమిషన్‌ ఆఫీసులో కేటీఆర్‌ విచారణ ముగిసింది. మహిళలపై చేసిన వ్యాఖ్యలపై కమిషన్‌ ఎదుట విచారణకు కేటీఆర్ హాజరయ్యారు‌. ఈ క్రమంలో కమిషన్‌కు ఏం చెప్పారో వివరణ ఇచ్చారు.

కాగా, మహిళలపై వ్యాఖ్యలకు గాను మహిళ కమిషన్‌కు వివరణ ఇచ్చేందుకు కేటీఆర్‌ ఆఫీసుకు వచ్చారు. వివరణ ఇచ్చిన అనంతరం కేటీఆర్‌ మీడియాతో మాట్లాడుతూ..‘నా వ్యాఖ్యలపై ఇప్పటికే మహిళలకు క్షమాపణలు చెప్పాను. ఇదే విషయాన్ని మహిళా కమిషన్‌ ముందు కూడా చెప్పాను. కమిషన్‌ ఎదుట క్షమాపణ కూడా కోరాను. రాజకీయాల్లో హుందాతనం ఉండాలి. పొరపాటు జరిగినప్పుడు జరిగిందని ఒప్పుకోవాలి. అంతేకానీ, మా మీద పడటం, దాడి చేయడం(​కాంగ్రెస్‌ మహిళా నేతలను ఉద్దేశించి) మంచిది కాదన్నారు. అలాగే, రాష్ట్రంలో మహిళలపై జరుగుతున్న దాడులను కూడా మహిళా కమిషన్‌ దృష్టికి తీసుకెళ్లాం’ అని అన్నారు. 

మహిళా కమిషన్‌ ముందు వివరణ ఇచ్చేందుకు ఆఫీసుకు కేటీఆర్‌ వస్తున్న నేపథ్యంలో మహిళా కాంగ్రెస్‌ నేతలు కమిషన్‌ వద్దకు భారీ సంఖ్యలో చేరుకున్నారు. అనంతరం, మహిళా కాంగ్రెస్‌ కార్యకర్తలు కేటీఆర్‌ వాహనాన్ని అడ్డుకునేందుకు ప్రయత్నం చేశారు. కేటీఆర్‌కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. మహిళలకు కేటీఆర్‌ బహిరంగ క్షమాపణలు చెప్పాలని డిమాండ్‌ చేశారు. ఇక, అదే సమయంలో అక్కడే ఉన్న బీఆర్‌ఎస్‌ మహిళా కార్యకర్తలు కాంగ్రెస్‌కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. దీంతో, ఇరు వర్గాల మధ్య తోపులాట చోటుచేసుకుంది. ఒకరిపైకి మరొకరు దూసుకెళ్లారు. అనంతరం, కమిషన్‌ ఆఫీసులోకి కాంగ్రెస్‌ మహిళా కార్యకర్తలు దూసుకెళ్లారు. పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో పోలీసులు వారిని అరెస్ట్‌ చేశారు.

 

 

Videos

రాబోయే రోజుల్లో పోలీసులు శిక్ష అనుభవించక తప్పదు..

నామినేషన్లు అడ్డుకున్న ఒక్కొక్కడికి చెప్తున్నా.. రోజా ఊర మాస్ వార్నింగ్

Nellore: అధికారుల ఓవరాక్షన్.. ఇచ్చిపడేసిన చంద్రశేఖర్ రెడ్డి

అడ్డుకోవాలని చూసారు పోలీసులకు ఇచ్చిపడేసిన రోజా

YSRCP మున్సిపల్ చైర్మన్ అభ్యర్థి రేష్మ నామినేషన్ తిరస్కరణ...

నిందితులు అరెస్ట్... టైగర్ పై ఎటాక్ అమెరికా నుంచే ప్లాన్ అమలు...

Tesla Roadster: ఎగిరే కారు.. మస్క్ మరో సంచలనం! ధర తెలిస్తే అవాక్

Penukonda: అధికారుల ఓవర్ యాక్షన్.. ఒక్క ఫోన్ కాల్ తో దుమ్ముదులిపేసిన ఉష శ్రీ చరణ్

అభిషేక్ తో పెళ్లి! శుభ్‌మన్ గిల్, అభిషేక్ శర్మపై షాకింగ్ కామెంట్స్!

శ్రీకాకుళంలో పవన్ కు బిగ్ షాక్ YSRCPలో చేరిన జనసేన యూత్

Photos

+5

రణ్‌బీర్‌ కపూర్‌, సాయిపల్లవి 'రామాయణ' మూవీ HD స్టిల్స్‌

+5

నవరాత్రి స్పెషల్.. ప్రత్యేక పూజల్లో అలియా భట్‌ (ఫొటోలు)

+5

జైలర్‌ 2 హిట్‌.. మిర్నా ఫొటోలు వైరల్‌!

+5

జిగేలుమంటున్న ప్రియాంక.. ఎల్లోరా శిల్పం కూడా తక్కువే! (ఫొటోలు)

+5

నవరాత్రి వేడుకల్లో కుందనపు బొమ్మలా మాళవిక (ఫొటోలు)

+5

కిరణ్ అబ్బవరం సినిమాతో కన్నడ బ్యూటీ టాలీవుడ్ ఎంట్రీ.. ఎవరీమె?

+5

బతుకమ్మ పండగ.. అందంగా హీరోయిన్ అనన్య (ఫొటోలు)

+5

తిరుమల : స్వర్ణరథంపై దేవదేవుడు శ్రీ వేంకటాద్రీశుడు దివ్య దర్శనం (ఫోటోలు)

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)