సంచలనంగా మార్చొద్దు

Published on Sun, 09/22/2024 - 03:43

సాక్షి, హైదరాబాద్‌: తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదంలో కల్తీ జరిగిందన్న అంశాన్ని సంచలనాత్మకంగా మార్చొద్దని రాజకీయ పార్టీలు, ధార్మిక సంస్థలకు కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు జి. కిషన్‌రెడ్డి విజ్ఞప్తి చేశారు. సనాతన ధర్మాన్ని, హిందూ ధార్మిక విశ్వాసాలను దెబ్బతీసే కుట్రలు గతంలోనూ జరిగిన నేపథ్యంలో వాటన్నింటిపై సమగ్ర దర్యాప్తు జరిపించి బాధ్యులను శిక్షించేలా చర్యలు తీసుకోవాలని ఆంధ్ర ప్రదేశ్‌ ప్రభుత్వాన్ని కోరారు. తిరుమల లడ్డూ ప్రసాదం అపవిత్రమైందన్న వార్తలతో భక్తుల నమ్మకం, విశ్వాసం సడలే ప్రమాదం ఉందని కిషన్‌రెడ్డి ఆందోళన వ్యక్తం చేశారు.

ఈ విషయంలో పార్టీలు, ధార్మిక సంస్థలు బాధ్యతతో వ్యవహరించి సంయమనం పాటించాలని ఓ ప్రకటనలో సూచించారు. ఎన్నో కష్టనష్టాలకు ఓర్చి నిత్యం వేంకటేశ్వర స్వామిని దర్శించుకునే లక్షలాది మంది భక్తుల విశ్వాసాన్ని నిలబెట్టేందుకు.. వారి మనోభావాలను పరిరక్షించేందుకు కృషి చేయాలని కిషన్‌ రెడ్డి కోరారు. లడ్డూ ప్రసాదంలో కల్తీ జరిగిందన్న వార్తలు తీవ్ర దిగ్భ్రాంతి కలిగించాయని పేర్కొన్నారు. హిందువులు ముఖ్యంగా శ్రీవారి భక్తుల మనోభావాలను దెబ్బతీయడం క్షమార్హం కాదన్నారు.

కోట్లాది మంది  భక్తుల మనోభావాలను దెబ్బతీసిన నేరస్తులకు తగిన శిక్ష పడాలని ఆయన డిమాండ్‌ చేశారు. ఈ దిశగా పోలీసు యంత్రాంగం, దర్యాప్తు సంస్థలు ముందుకు వెళ్తున్నాయని ఆశిస్తున్నామని పేర్కొన్నారు. ఇలాంటి దురాగతానికి బాధ్యులైన వారందరినీ గుర్తించి తగిన శిక్ష పడేలా చేయాలని కోరారు. భవిష్యత్తులోనూ ఇలాంటి ఘటనలేవీ పునరావృతం కాకుండా కఠిన చర్యలు చేపట్టాలని కిషన్‌రెడ్డి సూచించారు. 

Videos

YSRCP మేయర్ అభ్యర్థుల జాబితా విడుదల

తాకట్టు వద్దు.. అమ్మేయండి.. మోదీ చెప్పింది నిజమేనా?

స్థానిక ఎన్నికల అభ్యర్థుల రిజర్వేషన్ల అవకతవకలపై పేర్ని నాని స్ట్రాంగ్ రియాక్షన్

JIO ఆవిర్భావంపై ఇషా అంబానీ కామెంట్స్ వైరల్

24 క్రిమినల్ కేసులు బాబుపై రౌడీషీట్ పెట్టాలి

బూత్‌లలో సీసీ కెమెరాలు ఎందుకు లేవు? రిగ్గింగ్ కోసమేనా ఈ ప్లాన్?

మోదీ, అమిత్ షాకు CJP అభిజీత్ స్టాంగ్ వార్నింగ్

పవన్ కళ్యాణ్ చెప్పినా వినకండి ఈ ఎన్నికల్లో మంచివాళ్లను గెలిపించండి

నాతో కాలు దువ్వితే... JC బెదిరింపులకు కేతిరెడ్డి వార్నింగ్

మేయర్ మేమే.. కూటమిలో కుర్చీలాట

Photos

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)

+5

తిరుమల : కల్పవృక్ష వాహనంపై శ్రీ మలయప్పస్వామి కటాక్షం (ఫొటోలు)

+5

సందీప్ కిషన్ కొత్త సినిమా 'కరికాల' సినిమా ప్రారంభోత్సవం (ఫొటోలు)

+5

ఇటలీ ట్రిప్‌లో కిరణ్ అబ్బవరం సతీమణి రహస్య గోరఖ్.. (ఫోటోలు)

+5

ఇంద్రకీలాద్రిపై వైభవంగా దసరా శరన్నవరాత్రి ఉత్సవాలు (ఫొటోలు)

+5

‘క్రేజీ కళ్యాణం’ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ (ఫొటోలు)

+5

విజయనగరం : నూతన వధూవరులకు వైఎస్‌ జగన్‌ ఆశ్వీరాదం (ఫొటోలు)

+5

తిరుమల : ముత్యపుపందిరిపై సీతా స్వయంవరం అలంకారంలో శ్రీవారు (ఫొటోలు)