Breaking News

కాంగ్రెస్‌ పార్టీకి ఓటడిగే హక్కు లేదు

Published on Sat, 11/01/2025 - 05:10

సాక్షి, హైదరాబాద్‌: జూబ్లీహిల్స్‌ ఉపఎన్నికలో కాంగ్రెస్‌ ప్రభుత్వానికి ప్రజలను ఓట్లు అడిగే నైతిక హక్కు లేదని కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రి జి. కిషన్‌రెడ్డి విమర్శించారు. ఉపఎన్నిక ప్రచారంలో భాగంగా శుక్రవారం హైదరాబాద్‌ ఎర్రగడ్డ డివిజన్‌లోని పలు కాలనీల్లో ఆయన ఇంటింటి ప్రచారం నిర్వహించారు. పాదయాత్రగా అందరినీ పలకరిస్తూ ముందుకు కదిలారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రేవంత్‌రెడ్డి ప్రభుత్వం ఏర్పడి రెండేళ్లు కావొస్తున్నా అసెంబ్లీ ఎన్నికలప్పుడు ఇచి్చన హామీలను అమలు చేయట్లేదని మండిపడ్డారు. జూబ్లీహిల్స్‌లో కనీస మౌలిక సదుపాయాలు లేక దయనీయ పరిస్థితులు కనిపిస్తున్నాయన్నారు. ఎక్కడ చూసినా గుంతల రహదారులు, పొంగుతున్న మురుగు కాల్వలు, వెలగని వీధి దీపాలే దర్శనమిస్తున్నాయని చెప్పారు.

నియోజకవర్గానికి చుట్టూ ఉన్న కూకట్‌పల్లి, ఖైరతాబాద్, శేరిలింగంపల్లి ప్రాంతాలు గతంతో పోలిస్తే బాగా అభివృద్ధి చెందినప్పటికీ జూబ్లీహిల్స్‌ మాత్రం అలాగే ఉండిపోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. గతంలో బీఆర్‌ఎస్, కాంగ్రెస్‌ అభ్యర్థులకు అవకాశం కల్పించిన నియోజకవర్గ ప్రజలు.. ఈసారి బీజేపీ అభ్యర్థి ని గెలిపించాలని కోరారు. ఇతర పార్టీల్లా రాజకీయాలు చేయాలనుకోవట్లేదని.. తమ నిజాయతీనే తమను గెలిపిస్తుందని నమ్ముతున్నట్లు చెప్పారు. కాంగ్రెస్, మజ్లిస్‌ పార్టీల గూండాయిజం, రౌడీయిజాన్ని అంగీకరించబోమని కిషన్‌రెడ్డి స్పష్టం చేశారు.

జూబ్లీహిల్స్‌లో బీఆర్‌ఎస్‌ ప్రభావం లేదని.. కాంగ్రెస్‌ను నమ్మే పరిస్థితి ప్రజల్లో కనిపించట్లేదని అన్నారు. మజ్లిస్‌ ఓట్లపై నమ్మకంతోనే కాంగ్రెస్‌ జూబ్లీహిల్స్‌లో పోటీ చేస్తోందని ఆయన ఆరోపించారు. అందుకే మజ్లిస్‌ నుంచి అభ్యర్థి ని తెచ్చుకున్నారని దుయ్యబట్టారు. బీజేపీ అభ్యర్థి దీపక్‌రెడ్డి స్థానికంగా అందుబాటులో ఉంటాడని.. ఆయనకు ఒక్క ఫోన్‌ కాల్‌ చేయగానే ప్రజాసమస్యల పరిష్కారానికి ముందుండి నడుస్తాడని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమం అనంతరం ఎన్నికల్లో వ్యవహరించాల్సిన వ్యూహాలపై పార్టీ నేతలకు దిశానిర్దేశం చేశారు.

Videos

గోల్డ్ కొనేవారికి షాక్..! భారీగా పెరిగిన ధరలు

కృష్ణుడిగా విజయ్ దేవరకొండ..?

భలే పడ్డారు.. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియో

రోడ్డుపై స్కూటర్ ఆపి.. హెల్మెట్ తో దాడి..! మాజీ ఎమ్మెల్యే రౌడీయిజం వైరల్

ప్లాన్ "B" లోడింగ్..! కొండా సురేఖ సంచలన పోస్ట్

ఒంటరైన గంభీర్ రోహిత్ కోసం రెండుగా చీలిన బీసీసీఐ

DSCపై కొండారెడ్డి బురుజు దగ్గర ప్రభాకర్ తో కలిసి చర్చకి సిద్ధమా లోకేష్ ?

సంక్షోభంలో ఫోక్స్ వ్యాగన్.. మరో 50 వేల ఉద్యోగాలకు కోత

ట్రంప్ కు దిమ్మతిరిగే షాక్.. బర్త్ రైట్ సిటిజన్ షిప్ ఆర్డర్ కు కోర్టు బ్రేక్!

Konda Surekha: నన్ను తీయడం వల్ల వాళ్లకే నష్టం

Photos

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు