మజ్లిస్‌కు రేవంత్‌ జీహుజూర్‌

Published on Mon, 11/03/2025 - 05:59

గోల్కొండ: రాష్ట్రంలో మజ్లిస్‌ పార్టీకి ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి గులామ్‌గా మారి జీహుజూర్‌ అంటున్నారని కేంద్ర మంత్రి జి.కిషన్‌రెడ్డి విమర్శించారు. ఆదివారం ఆయన జూబ్లీహిల్స్‌ ఉప ఎన్నికల ప్రచారంలో భాగంగా షేక్‌పేటలో ఎన్నికల ప్రచారంలో పాల్గొని ప్రసంగించారు. హైదరాబాద్‌లో గత అసెంబ్లీ ఎన్నికల్లో ఒక్కసీటు కూడా గెలుచుకోలేకపోయిన కాంగ్రెస్‌ పార్టీ.. పరువు కాపాడుకునేందుకు జూబ్లీహిల్స్‌లో విజయం సాధించడానికి మజ్లిస్‌ పార్టీకి గులామ్‌గా మారిందని ఆరోపించారు.

మజ్లిస్‌ పార్టీ అడిగినవాటినల్లా మంజూరు చేస్తూ మైనార్టీ ఓట్లను పొందడానికి సీఎం రేవంత్‌రెడ్డి ఎంతకైనా తెగిస్తున్నారని మండిపడ్డారు. మజ్లిస్‌ పార్టీ తరఫున గతంలో ఎమ్మెల్యేగా పోటీ చేసిన వ్యక్తిని అద్దెకు తెచ్చుకొని ఈసారి కాంగ్రెస్‌ అభ్యర్థిగా మార్చారని ఎద్దేవా చేశారు. మైనార్టీలను ప్రసన్నం చేసుకోవడానికి అన్ని హద్దులూ దాటి హడావుడిగా అజహరుద్దీన్‌కు మంత్రి పదవి కట్టబెట్టారని విమర్శించారు. ఇది ఎన్నికల కోడ్‌ను ఉల్లంఘించడమే అని ఆరోపించారు. మజ్లిస్‌ పార్టీ ఒత్తిళ్లకు లొంగి విలువైన ఆర్మీ స్థలాలను ముస్లిం స్మశానవాటికలకు కేటాయిస్తోందని ఆగ్రహం వ్యక్తంచేశారు. 

కాంగ్రెస్‌ పథకాలకు నిధులు కేంద్రానివే.. 
రాష్ట్రంలో రేవంత్‌రెడ్డి ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలన్నిటికి కేంద్ర ప్రభుత్వ నిధులే అందుతున్నాయని కిషన్‌రెడ్డి తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న రేషన్‌ బియ్యానికి సైతం కేంద్ర ప్రభుత్వ నిధులే ఆధారమని పేర్కొన్నారు. దేశంలో జరుగుతున్న అభివృద్ధి మొత్తం ప్రధాని నరేంద్రమోదీ కృషి వల్లేనని తెలిపారు. రాష్ట్రంలో రైతంగానికి అందుతున్న ఆర్థిక సహాయం కూడా కేంద్ర ప్రభుత్వానిదేనని ఆయన స్పష్టం చేశారు.

గత రెండేళ్ల రేవంత్‌ పాలనను ప్రజలు అసహ్యించుకుంటున్నారని చెప్పారు. తనకు తాను సెక్యులర్‌ వాదిగా చెప్పుకునే కాంగ్రెస్‌ పార్టీ.. ప్రజలను వర్గాలుగా విభజించి పాలిస్తోందని విమర్శించారు. జూబ్లీహిల్స్‌ ఉప ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థి లంకల దీపక్‌రెడ్డిని అత్యధిక ఓట్ల మెజారిటీతో గెలిపించాలని ఓటర్లను కోరారు.  

Videos

చరణ్ సరసన సారా..!

YSRCP మున్సిపల్ చైర్మన్ అభ్యర్థుల జాబితా విడుదల

మొదలైన కూటమి కుట్రలు.. YSRCP అభ్యర్థి కొడుకుని తీసుకెళ్లిన పోలీసులు

ఆర్టీసీని చంపేందుకు కుట్ర.. ప్రభుత్వం తీరుపై ఆర్టీసీ జేఏసీ ఫైర్

కాంగ్రెస్ అధిష్టానానికి మంత్రి దామోదర బిగ్ షాక్

అమెరికాలో మరోసారి కాల్పుల కలకలం..చిన్నారులు మృతి

కేంద్ర ఎన్నికల సంఘం ముందుకు 9 సూటి ప్రశ్నలు...?

మున్సిపల్ ఎన్నికల్లో పోటీ చేస్తే చంపేస్తాం.. జేసీ అనుచరుల బెదిరింపులు

ఏలూరు మేయర్ పీఠాన్ని జనసేనకు.. తెలుగు తమ్ముళ్లు ఆగ్రహం.. మొత్తం ఒకేసారి రాజీనామా..

కుక్కకు ఇచ్చిన గౌరవం కూడా జనసేనకు లేదా? వంగవీటి నరేంద్ర కీలక వ్యాఖ్యలు

Photos

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)

+5

తిరుమల : కల్పవృక్ష వాహనంపై శ్రీ మలయప్పస్వామి కటాక్షం (ఫొటోలు)

+5

సందీప్ కిషన్ కొత్త సినిమా 'కరికాల' సినిమా ప్రారంభోత్సవం (ఫొటోలు)

+5

ఇటలీ ట్రిప్‌లో కిరణ్ అబ్బవరం సతీమణి రహస్య గోరఖ్.. (ఫోటోలు)