Breaking News

నేడే పోలింగ్‌.. జూబ్లీహిల్స్‌ ఉప ఎన్నికకు సర్వం సిద్ధం

Published on Tue, 11/11/2025 - 02:04

సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్రవ్యాప్తంగా రాజకీయ ఉత్కంఠకు తెరలేపిన జూబ్లీహిల్స్‌ ఉపఎన్నిక చివరి అంకానికి చేరుకుంది. మంగళవారం ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు ఈ నియోజకవర్గంలో పోలింగ్‌ జరగనుంది. మొత్తం 407 పోలింగ్‌ స్టేషన్లలో 4 లక్షల మందికిపైగా ఓటర్లు ఓటు హక్కు వినియోగించుకోనున్నారు. ఇందుకోసం కేంద్ర ఎన్నికల సంఘం ఏర్పాట్లు పూర్తి చేసింది. 

వెబ్‌కాస్టింగ్‌ ద్వారా పోలింగ్‌ సరళిని పర్యవేక్షించడంతోపాటు డ్రోన్ల ద్వారా కూడా పోలింగ్‌ ప్రక్రియను ఎప్పటికప్పుడు తెలుసుకోనుంది. ఈ నెల 14న ఓట్ల లెక్కింపు చేపట్టి ఫలితాన్ని ప్రకటించనుంది. బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్‌ హఠాన్మరణంతో జరుగుతున్న ఈ ఉపఎన్నికలో గెలుపే ధ్యేయంగా ప్రధాన రాజకీయ పక్షాలన్నీ సర్వశక్తు లూ ఒడ్డాయి. నెలరోజులకు పైగా జరిగిన ప్రచారపర్వంలో కాంగ్రెస్, బీఆర్‌ఎస్, బీజేపీ హోరాహోరీ తలపడ్డాయి. 

ప్రచారం ముగిసిన మరుక్షణం నుంచే.. 
ఎన్నికల ప్రచారం ముగియగానే రాజకీయ పార్టీలు ప్ర లోభాలకు తెరలేపాయి. ఓటర్లను రహస్యంగా కలుస్తూ నగ దు పంపిణీకి తెరలేపాయి. ఆది, సోమవారాల్లో గుట్టుగా ఇంటింటికీ వెళ్లి ఓటుకు రూ. వెయ్యి నుంచి రూ. 2,500 చొప్పున నగదు పంపిణీ చేపట్టినట్లు ప్రచారం జరుగుతోంది. దీనికితోడు తాయిలాలు కూడా అందిస్తున్నాయని తెలుస్తోంది. బోరబండ, రహమత్‌నగర్‌ డివిజన్లలోని మహిళల కు నగదుతోపాటు చీరలు కూడా పంచినట్లు సమాచారం. 

మహిళా ఓటర్లను ఆకర్షించేందుకు ఓ ప్రధాన రాజకీ య పార్టీ గట్టిగా దృష్టి సారించినట్లు ప్రచారం జరుగుతోంది. స్వయం సహాయక సంఘాల మహిళలకు ఆ పార్టీ బంపర్‌ ఆఫర్‌ ఇచ్చిందని.. ఓటరుగా ఉన్న వారికి నగదు ఇవ్వడంతోపాటు గ్రూపు సభ్యులుగా ఉన్న మహిళలకు అదనంగా రూ. 2,500, గ్రూపు లీడర్లకు రూ. 5 వేల చొప్పున నగదు పంచినట్లు తెలుస్తోంది. మరో ప్రధాన పార్టీ ఓటర్లకు రూ. 1,000 నగదు పంపిణీని పూర్తి చేసిందని సమాచారం.

పోలింగ్‌ పర్యవేక్షణ కోసం... 
నేడు పోలింగ్‌ జరగనున్న నేపథ్యంలో అప్రమత్తంగా ఉండాలని ఆయా పార్టీల నేతలు, కార్యకర్తల కు ఆదేశాలు అందాయి. పోలింగ్‌ బూత్‌ ఏజెంట్‌ నుంచి అభ్యర్థి వరకు అందరూ సాయంత్రం పోలింగ్‌ ముగిసి బ్యాలెట్‌ బాక్సులు స్ట్రాంగ్‌ రూంలకు తరలేంత వరకు జాగ్రత్తగా ఉండాలని దిశానిర్దేశం చేశాయి. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి సోమవారం అందుబాటులో ఉన్న మంత్రులతో బ్రేక్‌ఫాస్ట్‌ మీటింగ్‌ నిర్వహించారు. 

ఈ భేటీలో పార్టీ ప్రచార తీరుతెన్నుల గురించి అడిగి తెలుసుకున్నారని.. మంగళవారం పోలింగ్‌ తీరును ఎప్పటికప్పుడు పర్యవేక్షించాలని ఆయన మంత్రులకు సూచించినట్లు తెలుస్తోంది. మరోవైపు బీఆర్‌ఎస్, బీజేపీ పోలింగ్‌ సరళి పర్యవేక్షణ కోసం ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశాయి.   

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)