Breaking News

పండుగవేళ పాలపిట్ట కనిపించాలంటే ఈ ప్రాంతాలకు వెళ్లాల్సిందే!

Published on Tue, 10/20/2026 - 07:17

దసరా వచ్చిందంటే జమ్మిచెట్టు పూజలు.. పెద్దల ఆశీర్వాదాలు.. పాలపిట్ట దర్శనం అనేది తెలంగాణలో తరతరాలుగా వస్తున్న సంప్రదాయం.  పాలపిట్టను చూసేందుకు ఒకప్పుడు పొలాల గట్లు, చెట్ల కొమ్మలు, విద్యుత్‌ తీగలపై దృష్టి సారించేవారు.

అయితే వేగంగా విస్తరిస్తున్న మన నగరంలో ఆ నీలిరంగు రెక్కల అందం అదృశ్యమవుతోంది. దసరా వేళ పాలపిట్ట కోసం నగర శివారు ప్రాంతాల వైపు వెళ్లాల్సి వస్తోంది. ఇది కేవలం ఓ పక్షి జాడ కోసం అన్వేషణ మాత్రమే కాదు.. నగరంలో మారుతున్న జీవ వైవిధ్యానికి అద్దం పట్టే అంశం కూడా!

సంప్రదాయంలో ప్రత్యేక స్థానం.. 
పాలపిట్టగా పిలిచే ఇండియన్‌ రోలర్‌ పక్షిని విజయదశమి రోజున జమ్మిచెట్టు పూజ అనంతరం చూడటం శుభప్రదమనే విశ్వాసం ప్రజల్లో ఉంది. ఒకప్పుడు పల్లెల్లో సహజంగా కనిపించే ఈ పక్షిని ఇప్పుడు ప్రత్యేకంగా వెతుక్కుంటూ వెళ్లాల్సి వస్తోందని పక్షి ప్రేమికులు చెబుతున్నారు. తెలంగాణ, హైదరాబాద్‌లోని శామీర్‌పేట సరస్సు, గండిపేట, ఉస్మానియా విశ్వవిద్యాలయం, ఖాజాగూడ లేక్‌ వంటి పచ్చదనం ఉన్న ప్రాంతాల్లోనే దీని ఉనికి కనబడుతోంది. హైదరాబాద్‌ బర్డ్‌ అట్లాస్‌ తొలి సీజన్‌ సర్వేలో మొత్తం 26 పక్షులను గుర్తించగా, శామీర్‌పేట, పీర్జాదిగూడ, శంషాబాద్‌ పరిసరాల్లో వీటి ఉనికి నమోదైంది.  

పావురాల వల్ల..
హైదరాబాద్‌ చుట్టూ నిర్మాణాలు పెరగడం, ఖాళీ స్థలాలు తగ్గడం, పాత చెట్ల తొలగింపు, పురుగుమందుల వినియోగం వంటి అంశాలు పక్షుల జీవన పరిస్థితులపై ప్రభావం చూపుతున్నాయి. సిటీలో అతిగా పెరిగిన పావురాల వల్ల కూడా ఇతర పక్షుల మనుగడ కొంత వరకు కష్టతరమైతుందని పరిశోధకులు చెబుతున్నారు. స్టేట్‌ ఆఫ్‌ ఇండియాస్‌ బర్డ్స్‌ నివేదికలోనూ ఇండియన్‌ రోలర్‌ జాతీయ స్థాయి దీర్ఘకాలిక ధోరణి తగ్గుదలగా నమోదైంది. పాలపిట్ట దర్శనమే కాకుండా దాని పరిరక్షణనూ మనం బాధ్యతగా తీసుకోవాలని పక్షి ప్రేమికులు అంటున్నారు.

ఇదీ చదవండి: రేషన్‌ కార్డుదారులకు గుడ్‌న్యూస్‌.. త్వరలో షాపుల్లో కొత్త సరుకులు!

Videos

ఏం తమాషాలు చేస్తున్నారా.. కలెక్టర్ ఆఫీస్ వద్ద అధికారుల ఓవర్ యాక్షన్

పులివెందులలో YS అవినాష్ రెడ్డిపై కాల్పులు Exclusive Visuals

RO రూమ్ లో ఉంటే TDP గూండాలు వచ్చి.. దాడి చేశారు.. YSRCP అభ్యర్థి

విశాఖ మేయర్ నేనే.. పోటీ ఎవరున్నా గెలుపు నాదే

విద్యార్థులకు TDP డబ్బు,బిర్యానీ వైరల్ అవుతున్న ఆడియో రికార్డింగ్

లోన్ కట్టలేదని వేధిస్తున్నారా? RBI రూల్స్ ఇవే!

దేనితో కొట్టాలి వీళ్లని.. పోలీసులే అభ్యర్థులను లాక్కెళుతున్నారు

సల్మాన్ ఖాన్‌తో పనిచేస్తే ఇదే గతి.. ఈ అనిల్ పండిత్ ఎవరు..?

PF ఉన్నవారందరికీ పెన్షన్ వస్తుందా? అసలు లెక్కలు తెలుసుకోండి..

వేటకొడవల్లితో TDP రౌడీలు దాడి.. బండి దీప్తి స్ట్రాంగ్ వార్నింగ్

Photos

+5

యాంకర్ అనసూయ ఇంట్లో దసరా సెలబ్రేషన్ ఇలా (ఫొటోలు)

+5

ఫ్యాషన్ షో కోసం తృప్తి దిమ్రి క్రేజీ గ్లామర్ (ఫొటోలు)

+5

దసరా స్పెషల్.. చూడముచ్చటగా విజయ్-రష్మిక జంట (ఫొటోలు)

+5

నాకు హైదరాబాద్ ఎంతిష్టమో మీకు తెలుసు.. రకుల్ ప్రీత్ లేటెస్ట్ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌లో సందడిగా 'రామాయణ' ప్రీ రిలీజ్ ఈవెంట్ (ఫొటోలు)

+5

రణ్‌బీర్‌ కపూర్‌, సాయిపల్లవి 'రామాయణ' మూవీ HD స్టిల్స్‌

+5

నవరాత్రి స్పెషల్.. ప్రత్యేక పూజల్లో అలియా భట్‌ (ఫొటోలు)

+5

జైలర్‌ 2 హిట్‌.. మిర్నా ఫొటోలు వైరల్‌!

+5

జిగేలుమంటున్న ప్రియాంక.. ఎల్లోరా శిల్పం కూడా తక్కువే! (ఫొటోలు)

+5

నవరాత్రి వేడుకల్లో కుందనపు బొమ్మలా మాళవిక (ఫొటోలు)