Breaking News

బతుకమ్మ కుంట ప్రారంభోత్సవం వాయిదా

Published on Fri, 09/26/2025 - 11:19

సాక్షి, హైదరాబాద్‌: హైదరాబాద్‌లో ఎడతెరిపి లేని వర్షాల కారణంగా బతుకమ్మ కుంట(BatukammaKunta) ప్రారంభోత్సవం వాయిదా పడింది. భారీ వర్షాల నేపథ్యంలో బతుకమ్మ కుంట ప్రారంభోత్సవం వాయిదా వేసినట్లు హైడ్రా(HYDRA) శుక్రవారం ఉదయం ఓ ప్రకటనలో తెలిపింది. కాగా, సీఎం రేవంత్(Revanth Reddy) చేతుల మీదుగా వచ్చే ఆదివారం ప్రారంభోత్సవానికి హైడ్రా సన్నాహాలు చేస్తున్నట్టు సమాచారం.

ఇదిలా ఉండగా.. అంతుకుముందు బతుకమ్మ కుంటపై హైడ్రా స్పందిస్తూ.. క‌బ్జాల కోర‌ల్లో చిక్కుకున్న చెరువు నేడు జీవం పోసుకుంది. ముళ్ల పొద‌లు.. పిచ్చి మొక్క‌ల‌తో అటువైపు చూడాలంటేనే భ‌య‌ప‌డే విధంగా ఉన్న బ‌తుక‌మ్మ కుంట‌.. నేడు జ‌ల‌క‌ళ‌తో చూడ‌ముచ్చ‌ట‌గా త‌యార‌య్యింది. క‌బ్జాల చెర‌ను విడిపించుకుని క‌నువిందు చేస్తోంది. న‌గ‌ర భ‌విష్య‌త్తుకు బాట‌లు వేస్తున్న హైడ్రాకు బ‌తుక‌మ్మ కుంట ప్రేర‌ణ‌గా నిలిచింది. వ‌ర‌ద నివార‌ణ‌కు బ‌తుక‌మ్మ‌కుంట బాట‌లు వేసింది. న‌గ‌ర‌వ్యాప్తంగా చెరువులు అభివృద్ధి చెందితే వ‌ర‌ద‌లు చాలావ‌ర‌కు నివారించవ‌చ్చున‌ని బ‌తుక‌మ్మ‌కుంట నిరూపించింద‌ని హైడ్రా క‌మిష‌న‌ర్ రంగ‌నాథ్ తెలిపారు.

మండు వేస‌విలో దాదాపు 7.15 కోట్ల‌తో బ‌తుక‌మ్మ కుంట ప‌నుల‌ను హైడ్రా చేప‌ట్టింది. జేసీబీల‌తో మోకాలు లోతు త‌వ్వ‌గానే గంగ‌మ్మ త‌ల్లి ఉబికి వ‌చ్చింది. బ‌తుక‌మ్మ కుంట బ‌తికే ఉంద‌ని రుజువు చేసింది. అక్క‌డి స్థానికుల‌లో ఆనందం పెల్లుబికింది. బ‌తుక‌మ్మ కుంట కాదు.. ఇది మా స్థ‌ల‌మంటూ ఇప్ప‌టివ‌ర‌కూ న‌మ్మ‌బ‌లికిన వారిని ఇప్పుడేమంటారు అని అక్క‌డి స్థానికులు ప్ర‌శ్నించారు. ఈ మేర‌కు అక్క‌డి ముళ్ల‌ పొద‌ల‌ను తొల‌గించి త‌వ్వ‌కాలు చేప‌ట్టిన హైడ్రాకు గంగ‌మ్మ స్వాగ‌తం ప‌లికింది. అంబ‌ర్‌పేట మండ‌లం, బాగ్అంబ‌ర్‌పేట్‌లోని స‌ర్వే నంబ‌రు 563లో 1962-63 లెక్క‌ల ప్ర‌కారం మొత్తం  14.06 ఎక‌రాల విస్తీర్ణంలో బ‌తుక‌మ్మ కుంట‌. బ‌ఫ‌ర్ జోన్‌తో క‌లిపి మొత్తం వైశాల్యం 16.13 ఎక‌రాల విస్తీర్ణం అని తేల్చిన స‌ర్వే అధికారులు. తాజా స‌ర్వే ప్ర‌కారం అక్క‌డ మిగిలిన భూమి కేవ‌లం 5.15 ఎక‌రాల విస్తీర్ణం మాత్ర‌మే మిగిలి ఉంది. ప్ర‌స్తుతం మిగిలి ఉన్న 5.15 ఎక‌రాల విస్తీర్ణంలోనే బ‌తుక‌మ్మ కుంట‌ను పున‌రుద్ధ‌రించింది.

ఇది కూడా చదవండి: వర్షాల ఎఫెక్ట్‌.. శంషాబాద్‌లో దిగని విమానం.. 

Videos

Nellore: అధికారుల ఓవరాక్షన్.. ఇచ్చిపడేసిన చంద్రశేఖర్ రెడ్డి

అడ్డుకోవాలని చూసారు పోలీసులకు ఇచ్చిపడేసిన రోజా

YSRCP మున్సిపల్ చైర్మన్ అభ్యర్థి రేష్మ నామినేషన్ తిరస్కరణ...

నిందితులు అరెస్ట్... టైగర్ పై ఎటాక్ అమెరికా నుంచే ప్లాన్ అమలు...

Tesla Roadster: ఎగిరే కారు.. మస్క్ మరో సంచలనం! ధర తెలిస్తే అవాక్

Penukonda: అధికారుల ఓవర్ యాక్షన్.. ఒక్క ఫోన్ కాల్ తో దుమ్ముదులిపేసిన ఉష శ్రీ చరణ్

అభిషేక్ తో పెళ్లి! శుభ్‌మన్ గిల్, అభిషేక్ శర్మపై షాకింగ్ కామెంట్స్!

శ్రీకాకుళంలో పవన్ కు బిగ్ షాక్ YSRCPలో చేరిన జనసేన యూత్

నామినేషన్ వేసిన అనంతపురం YSRCP మేయర్ అభ్యర్థి

ప్రొద్దుటూరులో ఉద్రిక్తత పోలీస్ లారీ ఛార్జ్ తిరగబడ్డ YSRCP నేతలు

Photos

+5

జైలర్‌ 2 హిట్‌.. మిర్నా ఫొటోలు వైరల్‌!

+5

జిగేలుమంటున్న ప్రియాంక.. ఎల్లోరా శిల్పం కూడా తక్కువే! (ఫొటోలు)

+5

నవరాత్రి వేడుకల్లో కుందనపు బొమ్మలా మాళవిక (ఫొటోలు)

+5

కిరణ్ అబ్బవరం సినిమాతో కన్నడ బ్యూటీ టాలీవుడ్ ఎంట్రీ.. ఎవరీమె?

+5

బతుకమ్మ పండగ.. అందంగా హీరోయిన్ అనన్య (ఫొటోలు)

+5

తిరుమల : స్వర్ణరథంపై దేవదేవుడు శ్రీ వేంకటాద్రీశుడు దివ్య దర్శనం (ఫోటోలు)

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)

+5

మైసూరు దసరా మహోత్సవం.. జంబూసవారీ ఏర్పాట్లు (ఫోటోలు)

+5

తిరుమల : చంద్రప్రభ వాహనంపై నర్తన కృష్ణుడి అలంకారంలో శ్రీ మలయప్పస్వామి (ఫోటోలు)