Breaking News

సీఐపై హైడ్రా కమిషనర్‌ రంగనాథ్‌ ఆగ్రహం

Published on Wed, 05/14/2025 - 15:39

సాక్షి,హైదరాబాద్‌: బాధితులు ఫిర్యాదు చేసినా కేసులు ఎందుకు నమోదు చేయలేదని హయత్‌ నగర్‌ సీఐపై హైడ్రా కమిషనర్‌ ఏవీ రంగనాథ్‌ ఆగ్రహం వ్యక్తం చేశారు.

తమ ప్లాట్లను కబ్జా చేశారని పలువురు బాధితులు హైడ్రాకు ఫిర్యాదు చేశారు. బాధితుల ఫిర్యాదుతో హైడ్రా కమిషనర్‌ ఏవీ రంగనాథ్‌ స్వయంగా కోహెడలో వివాదాస్పద స్థలాన్ని పరిశీలించారు. భూమిలో మారణాయుధాలు చూసి ఆ‍గ్రహానికి లోనయ్యారు.ఈ సందర్భంగా..బాధితులపై దాడి జరిగినా కేసు ఎందుకు నమోదు చేయలేదని హయత్‌ నగర్‌ సీఐపై హైడ్రా కమిషనర్‌ ఏవీ రంగనాథ్‌ ఆగ్రహం వ్యక్తం చేశారు.

బాధితులకు అండగా ఉంటామని హామీ ఇచ్చారు. బాధితుల ఫిర్యాదులపై కేసులు నమోదు చేసి దర్యాప్తు చేయాలని సూచించారు. వారికి న్యాయం చేయాలని ఆదేశాలు జారీ చేశారు.

హైడ్రా కార్యాలయంలో ప్రజావాణి  
హైదరాబాద్‌ హైడ్రా కార్యాలయంలో ప్రజావాణి కార్యక్రమం నిర్వహిస్తోంది. ప్రతి సోమవారం ప్రజల నుంచి ఫిర్యాదులు స్వీకరించేలా హైడ్రా ప్రజావాణి కార్యక్రమాన్ని ప్రారంభించింది. ఈ ప్రజావాణి కార్యక్రమానికి విశేష స్పందన వస్తోంది. బాధితుల నుంచి హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్ ఫిర్యాదులను స్వయంగా స్వీకరిస్తున్నారు. అందిన ఫిర్యాదులపై విచారణ చేపట్టాలని అధికారులకు ఆదేశాలు జారీ చేస్తున్నారు.

అయితే,ప్రజా వాణిలో కోహెడలో తమ భూమి కబ్జాకు గురైందని, ఫిర్యాదు చేసినా హయత్‌ నగర్‌ సీఐ పట్టించుకోవడం లేదంటూ ఏవీ రంగనాథ్‌ ఎదుట ఏకరవు పెట్టుకున్నారు. దీంతో బాధితుల ఫిర్యాదు మేరకు ఏవీ రంగనాథ్‌ స్వయంగా వివాదాస్పద స్థలాన్ని సందర్శించారు. బాధితులతో మాట్లాడారు.

Videos

మెగా DSC స్కామ్ లో చేతులు మారిన కోట్ల రూపాయలు..!

రఘు మాస్టర్ పై కేసు పెట్టిన సుమలత

DSC స్కామ్ పై బాబును నిలదీసిన YS జగన్

లక్షకు 30 లక్షల లాభం.. కాసుల వర్షం కురిపించిన స్టాక్స్

జైల్లో మిమ్మల్ని మేము పెట్టలేమా..? రిటైర్మెంట్ టైమ్ లో రాజకీయాల్లోకి వచ్చారు...

కొండా అవుట్... మంత్రి పదవి కావలెను

ఇంకెంతకాలం ఈ సోది చెప్పుకొని బతుకుతారు..! ఏకిపారేసిన జడ శ్రవణ్..!

జనసేన ఇన్ ఛార్జ్ యుగంధర్ పైసా వసూల్

ఢిల్లీలో భారీ వర్షం.. పట్టపగలే చీకట్లు

DSCలో జరిగిన అక్రమాలు బట్టబయలు

Photos

+5

శ్రీకృష్ణాష్టమి వేడుకలు.. రాధా వేషధారణలో అనసూయ(ఫోటోలు)

+5

హాయ్ మూవీ మూడ్‌లో నయనతార పోజులు.. ఫోటోలు

+5

బ్యూటీఫుల్ శారీలో హీరోయిన్ ప్రియమణి అందాలు.. ఫోటోలు

+5

కృష్ణుడు వచ్చేశాడోచ్.. క్యూట్ డ్రెస్సుల్లో సందడి చేసిన సినీ ప్రముఖుల పిల్లలు! (ఫొటోలు)

+5

చిన్ని కృష్ణుడిగా కిరణ్ అబ్బవరం కొడుకు.. క్యూట్‌నెస్‌కు నెటిజన్లు ఫిదా!

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)