Breaking News

HYD: ఎమ్మెల్సీ ఎన్నికలు.. ఓటింగ్‌కు బీఆర్‌ఎస్‌ దూరం

Published on Wed, 04/23/2025 - 08:43

సాక్షి, హైదరాబాద్‌: హైదరాబాద్ జిల్లా స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నిక పోలింగ్ ప్రశాంతంగా ముగిసింది. 78.57 శాతం పోలింగ్‌ నమోదైంది. 88 ఓట్లు పోలయ్యాయి. 66 కార్పొరేటర్లు, 22 మంది ఎక్స్ అఫిషియో సభ్యులు ఓటు హక్కును వినియోగించుకున్నారు. బీఆర్ఎస్ మినహా బీజేపీ, కాంగ్రెస్, ఎంఐఎం కార్పొరేటర్లు, ఎక్స్ ఆఫీషియ్ సభ్యులు పోలింగ్‌లో పాల్గొన్నారు. బీఆర్ఎస్ కార్పొరేటర్లు, ఎక్స్ అఫిషియో సభ్యులు ఓటింగ్‌కు దూరంగా ఉన్నారు. ఈ నెల 25న జీహెచ్ఎంసీ ప్రధాన కార్యాలయంలో కౌంటింగ్ నిర్వహించనున్నారు

ఉదయం 10 గంటల వరకు 50 శాతం  ఓట్లు నమోదు అవ్వగా, 45 మంది కార్పొరేటర్లు ఓటు వినియోగించుకున్నారు. ఎక్స్ అఫీషియో హోదాలో  ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ తన ఓటు హక్కు వినియోగించుకున్నారు. కేంద్రమంత్రి కిషన్ రెడ్డి, ఎంపీలు లక్ష్మణ్, ఈటల రాజేందర్‌, కొండా విశ్వేశ్వర్ రెడ్డి, ఎమ్మెల్సీ  AVN రెడ్డి, ఎమ్మెల్యే రాజాసింగ్‌, బీజేపీ కార్పొరేటర్లు ఓటు వేశారు.

బీజేపీ ఎంపీ లక్ష్మణ్ మాట్లాడుతూ.. ఎన్నికల్లో పాల్గొనవద్దని బీఆర్ఎస్ ప్రకటించడం ప్రజాస్వామ్య విలువలకు విరుద్ధమన్నారు. ఈ అంశంపై ఎన్నికల కమిషన్‌కు ఫిర్యాదు చేస్తామన్నారు. ఎన్నికల సంఘం వారిపై చర్యలు తీసుకోవాలన్నారు.

ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 4 వరకు పోలింగ్  జరిగింది. ఎన్నికల కోసం జీహెచ్‌ఎంసీ హెడ్ ఆఫీస్‌లో రెండు పోలింగ్ కేంద్రాల ఏర్పాటు చేశారు. డ్యూటీలో 250 మంది పోలింగ్ సిబ్బంది.. 250 మంది పోలీసులతో భద్రతా ఏర్పాటు చేశారు. పోటీలో ఎంఐఎం, బీజేపీ అభ్యర్థులు ఉన్నారు. ఎంఐఎం అభ్యర్దిగా  మీర్జా రియాజ్ ఉల్ హాసన్, బీజేపీ అభ్యర్థిగా గౌతమ్‌ రావు బరిలో ఉన్నారు.

మొత్తం ఓటర్లు 112. 81 మంది కార్పొరేటర్లు, 31 మంది ఎక్స్ అఫీషియో సభ్యులు. వీరిలో ఎంఐఎంకు 50, బీజేపీకి 24, బీఆర్‌ఎస్‌కు 24, కాంగ్రెస్‌కు 14. సరిపడ సంఖ్య బలం లేకున్నా హైదరాబాద్ స్థానిక సంస్థల ఎన్నికల బరిలో నిలిచిన బీజేపీ. ఈ నెల 25న ఉదయం 8 గంటల నుంచి కౌంటింగ్ జరగనుంది. స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో కాంగ్రెస్ కీలక నిర్ణయం తీసుకుంది. ఎమ్మెల్సీ ఎన్నికల్లో కాంగ్రెస్ ఓటర్లు కచ్చితంగా ఓటు హక్కు వినియోగించుకోవాలని ఆదేశించింది.
 

Videos

ఉద్యోగుల ఆగ్రహం.. బాబుకు షాక్..! మా డబ్బులు మాకు ఇవ్వండి

బంగారం కొనేవాళ్లకు ఇది గుడ్ న్యూస్.. GOLD రేట్లు ఇంకా తగ్గుతాయా?

సీఎం రేవంత్ మార్పు ఖాయం? BRS రాకేష్ కుమార్ షాకింగ్ కామెంట్స్

గుంటూరు పెదకాకానిలో హై టెన్షన్

జనసేన MLAపై బాబు సీరియస్

స్మృతి మందాన రికార్డు సెంచరీ.. సెమిస్ లో భారత్

24 క్యారెట్ గోల్డ్ కు LOAN ఎందుకు ఇవ్వరు? అసలు కారణం ఇదే

బాహుబలి, RRR రికార్డ్స్ పై కన్నేసిన ఇరుముడి..

నేపాల్ లో మృత్యుఘోష..! 1300కు చేరువలో మృతులు

కడప TDPలో మేయర్ పీఠం కోసం వార్..

Photos

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు