Breaking News

Ind Vs Aus- Uppal: రోహిత్‌, దినేష్‌ కార్తీక్‌ ఫోటోలతో హైదరాబాద్‌ పోలీసుల ట్వీట్‌

Published on Tue, 09/27/2022 - 10:19

సాక్షి, హైదరాబాద్‌- Ind Vs Aus 3rd T20- Hyderabad: హైదరాబాద్‌ పోలీసులు ఎప్పటికప్పుడు ట్విటర్‌ వేదికగా నగర ప్రజలకు సూచనలు ఇస్తూ చైతన్యవంతం చేస్తూ ఉంటారు. ట్రాఫిక్‌ నియమాలు, సైబర్‌ నేరాలు, రోడ్డు ప్రమాదాలు.. ఇలా పలు అంశాలపై జాగ్రత్తలు చెబుతూ నెటిజన్లకు అవగాహన కల్పిస్తుంటారు. ఇందుకోసం అప్పుడప్పుడూ పాపులర్‌ సినిమా డైలాగులు, పాటలు, పోస్టర్లు ఉపయోగించి.. సృజనాత్మకంగా జనాలకు వివరిస్తుంటారు. తాజాగా హైదరాబాద్‌ సిటీ పోలీసులు క్రికెట్‌ను ఇందుకోసం వాడుకున్నారు. ఓ ట్రెండింగ్‌ ట్వీట్‌తో ముందుకు వచ్చారు.

హైదరాబాద్‌ వేదికగా.. ఆస్ట్రేలియాతో జరిగిన టీ20 మ్యాచ్‌ సందర్భంగా టీమిండియా కెప్టెన్‌ రోహిత్‌ శర్మ, దినేష్‌ కార్తీక్‌ మధ్య కొన్ని సరదా సంఘటనలు చోటుచేసుకున్న విషయం తెలిసిందే. రోహిత్‌, దినేష్‌ కార్తీక్‌కు చెందిన రెండు ఫోటోలను షేర్‌ చేస్తూ ట్రాఫిక్‌ నిబంధనలు, హెల్మెట్‌ ధరించాల్సిన ప్రాముఖ్యతను వివరించారు. ఇందులో మొదటి  ఫోటోలో రోహిత్‌ గ్రౌండ్‌లో కార్తీక్‌పై కాస్త ఆగ్రహం వ్యక్తం చేస్తూ.. అతన్ని ముఖాన్ని నలిపేసే ప్రయత్నం చేశాడు. 

రెండో దానిలో రోహిత్‌ దినేష్‌ను దగ్గరకు తీసుకొని ముద్దు పెడుతున్నాడు. అయితే ఆ సమయంలో అతని ముఖానికి హెల్మెట్‌ ఉంది.  ఈ రెండిటిని హైదరాబాద్‌ సిటీ పోలీసులు ట్విటర్‌లో షేర్‌ చేస్తూ.. ప్రయాణికులు హెల్మెట్‌ ధరించి ట్రాఫిక్ రూల్స్‌ పాటిస్తే ఎలా ఉంటుందో, పాటించకుంటే ఎలా ఉంటుందో వెల్లడించారు. హెల్మెట్‌ ధరించకుంటే ప్రమాదమని, అదే హెల్మెట్‌ ధరిస్తే అందరూ సంతోషంగా ఉండచ్చనే అనే కోణంలో ఈ మేరకు ట్వీట్‌ చేశారు.

Videos

మెడికల్ మాఫియా బాగోతం! ఫేక్ డాక్టర్ల మాయాజాలం

ఇజ్రాయెల్ వర్సెస్ ఇరాన్ Conflict 2025

Rain Alert: మరో నాలుగు రోజుల పాటు రాష్ట్రంలో వర్షాలు

KTR: నీ కేసులకు భయపడేది లేదు

రేషన్ డోర్ డెలివరీ రద్దుపై వైఎస్ జగన్ రియాక్షన్..

రోడ్డు ప్రమాదంలో గాయపడ్డ వైఎస్సార్‌సీపీ అధికార ప్రతినిధి కొండా రాజీవ్

Operation Trashi: టాప్ 6 ఉగ్రవాదులు హతం..

MLAని అని చెప్పుకోవాలంటే సిగ్గుగా ఉంది: Bandaru Satyanarayana

తమిళనాడు లిక్కర్ స్కామ్ కేసు దర్యాప్తుపై సుప్రీంకోర్టు స్టే

పహల్గాం ఉగ్రదాడికి ప్రతీకారం తీర్చుకున్నాం : ప్రధాని మోదీ

Photos

+5

Miss World 2025 : శిల్పారామంలో ఆడి పాడుతూ సందడి చేసిన గ్లోబల్‌ బ్యూటీలు (ఫొటోలు)

+5

లిక్కర్‌ స్కాం.. బాబు బేతాళ కథలు.. జగన్‌ ధ్వజం (చిత్రాలు)

+5

అనసూయ ఇంట మరో శుభకార్యం.. పెద్ద కుమారుడితో సంప్రదాయ వేడుక (ఫొటోలు)

+5

HHVM మూవీ ఈవెంట్‌లో మెరిసిన హీరోయిన్ నిధి అగర్వాల్ (ఫొటోలు)

+5

Cannes 2025 : ‘సింధూరం’తో మెరిసిన ఐశ్వర్య (ఫోటోలు)

+5

ప్రసాద్ ఐమ్యాక్స్‌ : ‘రానా నాయుడు సీజన్-2’ టీజర్‌ ఈవెంట్‌ రానా సందడి (ఫొటోలు)

+5

హైదరాబాద్‌లో దంచికొడుతున్న వర్షం..భారీగా ట్రాఫిక్ జామ్ (ఫొటోలు)

+5

హనుమాన్‌‌ జయంతి .. జనసంద్రంగా కొండగట్టు అంజన్న క్షేత్రం (ఫొటోలు)

+5

విజయ్‌ సేతుపతి 'ఏస్‌' మూవీ ప్రీరిలీజ్‌ వేడుక (ఫొటోలు)

+5

'హరి హర వీరమల్లు' సాంగ్ లాంచ్ ఈవెంట్ (ఫొటోలు)