Breaking News

మోదీ కొత్తగా తెలంగాణకు చేసిందేమి లేదు.: వినోద్‌ కుమార్‌

Published on Sat, 04/08/2023 - 14:38

సాక్షి, హైదరాబాద్‌: తెలంగాణ రాష్ట్రం కేంద్రానికి సహకరించట్లేదనే ఆరోపణలను తీవ్రంగా ఖండిస్తున్నట్లు రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు బి.వినోద్‌ కుమార్‌ తెలిపారు. తెలంగాణ ప్రాజెక్టులకు జాతీయ హోదా ఇవ్వకుండా ఇక్కడికి వచ్చి ప్రధాన మంత్రి ఏం మాట్లాడుతారని ధ్వజమెత్తారు. రైల్వే ప్రాజెక్టుల్లో భూసేకరణ రాష్ట్రం భరిస్తోంది.. హైదరాబాద్-కరీంనగర్ రైల్వే పనులు తెలంగాణ పైసలతో అవుతున్నాయన్న విషయాన్ని గుర్తు చేశారు.

రాష్ట్రంలో 33 మెడికల్ కాలేజీలకు కేంద్రం ఒక్క రూపాయి ఇవ్వలేదని విమర్శించారు. జాతీయ రహదారుల అభివృద్ధి అనేది తెలంగాణ బిల్లులో పొందుపరిచిన అంశం తప్ప, కేంద్రం ప్రేమతో ఇచ్చినవి కాదని స్పష్టం చేశారు. జాతీయ రహదారులకు, మోదీకి సంబంధం లేదన్నారు. మోదీ కొత్తగా రైల్వే ప్రాజెక్ట్‌లు ఏం తెచ్చారని ప్రశ్నించారు. విభజన చట్టం మేరకు జాతీయ రహదారులు నిర్మిస్తున్నారని తెలిపారు. కేటీఆర్, కవిత, హరీష్ రావు ఉద్యమంలో పాల్గొన్నవాళ్లు.. బీజేపీ పార్టీలో ఉన్నవాళ్లలో కుటుంబ పాలన లేదా అంటూ ఎద్దేవా చేశారు.

రాష్ట్ర ప్రభుత్వం సహకరించడం లేదన్న మోదీ.. తెలంగాణకు ఏం చేశారో చెప్పాలి. ఎన్ని కేసులు పెట్టినా భయపడేది లేదు. మోదీని గద్దె దింపేవరకు వదిలిపెట్టం.
-మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌ రావు.

‘తెలంగాణపై ప్రధాని మోదీ విషం కక్కారు.  మోదీదే అవినీతి ప్రభుత్వం. నేటీకి గుజరాత్‌లో ఇంటింటికి మంచి నీళ్లు ఇచ్చే పరిస్థితి లేదు. తెలంగాణ అభివృద్ధి నీ చూసి మోదీ ఓర్వలేక పోతున్నారు. తెలంగాణలో అభివృద్ధి.. బీజేపీ పాలిత ప్రాంతాల్లో అవినీతి. ప్రధాని తనసభలో ప్రజలను మోసం చేసే పద్ధతిలో మాట్లాడారు. ప్రధాని స్థాయిలో మోదీ మాట్లాడలేదు.  మోదీ పర్యటనతో తెలంగాణకు ఉపయోగం లేదు.
-మంత్రి జగదీష్‌ రెడ్డి

Videos

లోన్ కట్టలేదని వేధిస్తున్నారా? RBI రూల్స్ ఇవే!

దేనితో కొట్టాలి వీళ్లని.. పోలీసులే అభ్యర్థులను లాక్కెళుతున్నారు

సల్మాన్ ఖాన్‌తో పనిచేస్తే ఇదే గతి.. ఈ అనిల్ పండిత్ ఎవరు..?

PF ఉన్నవారందరికీ పెన్షన్ వస్తుందా? అసలు లెక్కలు తెలుసుకోండి..

వేటకొడవల్లితో TDP రౌడీలు దాడి.. బండి దీప్తి స్ట్రాంగ్ వార్నింగ్

తిరుపతిలో దొంగల బీభత్సం 90 గ్రాముల బంగారం చోరీ!

టీడీపీ దాడులకు భయపడే ప్రసక్తేలేదు.. సజ్జల మాస్ వార్నింగ్

వైరల్ అవుతున్న వీడియో, దారుణం.. వెంటబడి మరి TDP గూండాల అరాచకం

టీడీపీ గూండాలు... కడపలో కత్తిపోట్లు.. పులివెందులలో కాల్పుల కలకలం

ఒక్కొక్కడి పేరు అడ్రస్ నోట్ చేస్తున్న.. సిగ్గు లేకుండా ఫోన్ ఆఫ్ చేసి పారిపోయారు

Photos

+5

యాంకర్ అనసూయ ఇంట్లో దసరా సెలబ్రేషన్ ఇలా (ఫొటోలు)

+5

ఫ్యాషన్ షో కోసం తృప్తి దిమ్రి క్రేజీ గ్లామర్ (ఫొటోలు)

+5

దసరా స్పెషల్.. చూడముచ్చటగా విజయ్-రష్మిక జంట (ఫొటోలు)

+5

నాకు హైదరాబాద్ ఎంతిష్టమో మీకు తెలుసు.. రకుల్ ప్రీత్ లేటెస్ట్ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌లో సందడిగా 'రామాయణ' ప్రీ రిలీజ్ ఈవెంట్ (ఫొటోలు)

+5

రణ్‌బీర్‌ కపూర్‌, సాయిపల్లవి 'రామాయణ' మూవీ HD స్టిల్స్‌

+5

నవరాత్రి స్పెషల్.. ప్రత్యేక పూజల్లో అలియా భట్‌ (ఫొటోలు)

+5

జైలర్‌ 2 హిట్‌.. మిర్నా ఫొటోలు వైరల్‌!

+5

జిగేలుమంటున్న ప్రియాంక.. ఎల్లోరా శిల్పం కూడా తక్కువే! (ఫొటోలు)

+5

నవరాత్రి వేడుకల్లో కుందనపు బొమ్మలా మాళవిక (ఫొటోలు)