Breaking News

బాలుడిపై లైంగిక దాడి కేసులో యువతి రిమాండ్‌

Published on Mon, 05/05/2025 - 06:52

బంజారాహిల్స్‌(హైదరాబాద్‌): ఆ బాలుడికి 16 ఏళ్లు. అతడి తల్లిదండ్రులు జూబ్లీహిల్స్‌లోని ఓ బడా పారిశ్రామికవేత్త ఇంట్లో పని చేస్తూ అక్కడే ఉన్న సర్వెంట్‌ క్వార్టర్స్‌లో ఉంటున్నారు. సదరు బాలుడు పదో తరగతి పరీక్షల కోసం గత జనవరిలో తల్లిదండ్రుల వద్దకు వచ్చాడు. అదే ఇంట్లో పని మనిషిగా పనిచేస్తున్న మరో యువతి (28) వారు ఉంటున్న క్వార్టర్‌ పక్కనే మరో క్వార్టర్‌లో ఉంటోంది.

 ఆ బాలుడితో పరిచయం పెంచుకున్న ఆమె తరచూ అతడిని తన క్వార్టర్‌లోకి పిలిపించుకుని అతడిపై లైంగిక దాడికి పాల్పడేది. ఈ విషయం ఎవరికైనా చెబితే నీ తల్లి మీద దొంగతనం కేసు పెట్టించి ఉద్యోగం నుంచి తీసివేయిస్తానని బాలుడిని బెదిరించేది. తన తల్లి ఉద్యోగం పోతుందనే భయంతోనే అతను ఈ విషయం ఎక్కడా చెప్పలేదు. 

ఐదు రోజుల క్రితం సదరు యువతి గదిలో తన కుమారుడు ఉండడాన్ని గుర్తించిన అతడి తల్లి అక్కడికి వెళ్లి చూడగా సదరు యువతి తన కొడుకును బలవంతంగా ముద్దు పెట్టుకుంటుండగా చూసింది.ఈ విషయమై తన కుమారుడిని నిలదీయగా అతను తల్లికి పూర్తి వివరాలు చెప్పాడు. దీంతో బాధితుడి తల్లి జూబ్లీహిల్స్‌ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేయడంతో  ఈ ఘటనపై విచారణ చేపట్టిన పోలీసులు లైంగిక దాడికి పాల్పడిన యువతిపై ఫోక్సో చట్టం కింద కేసు నమోదు చేశారు. నిందితురాలిని అరెస్ట్‌ చేసి రిమాండ్‌కు తరలించారు.  

Videos

AK-47తో YSRCP నేతలపై కాల్పులు... YS అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్..!

అమెరికాలో మహా ప్రళయం.. ఒకేసారి 3 రాకాసి తుఫానులు!

బన్నీ - జూ ఎన్టీఆర్ మల్టీస్టారర్.. నెల్సన్ మాస్టర్ ప్లాన్...

కడపలో ఉద్రిక్తత.. కార్పొరేటర్ అభ్యర్థులపై కత్తి పోట్లు.. బండి దీప్తి ఇంటిపై దాడి!

పులివెందులలో కాల్పులు.. YSRCP నేతలపై పోలీసుల దాష్టీకం

MP గురుమూర్తి చేతిలో నుంచి నామినేషన్ పేపర్స్ లాక్కొని పారిపోయిన టీడీపీ నేతలు

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

మున్సిపల్ ఎన్నికలపై జగన్ ఫోకస్.. రెండో జాబితాలో బీసీలకు పెద్దపీట..!

Photos

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)